వీడెవడండీ బాబు..! గంగా నదిలో చేపలు కాదు కాసులు, బంగారం పడుతున్నాడు

First Published | Nov 6, 2024, 4:57 PM IST

నదిలో చేపలు పట్టడం చూసుంటారు... మొసళ్లు వంటి ప్రమాదకరమైన జలచరాలను పట్టడం చూసుంటారు.  కానీ ఎప్పుడైనా డబ్బులు పట్టడం చూసారా? 

Ganga River

ప్రస్తుత హైటెక్ జమానాలో మతపరమైన ఆచారాలు, సాంప్రదాయాలన్ని మూడ నమ్మకాలుగా ముద్రపడిపోయాయి. కానీ కొన్ని ఆచారాలు, నమ్మకాలు మాత్రం ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీకి తగ్గట్లుగా వుంటాయి. వీటి గురించి తెలిసి మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ గా ఆలోచించి ఇలాంటి ఆచార వ్యవహారాలు పాటించారో అర్థమవుతుంది. ఇలాంటి ఓ హిందు ఆచారం పర్యావరణాన్ని కాపాడటమే కాదు ఓ కుటుంబం కడుపు కూడా నింపుతోంది. ఇంతకూ అంత మంచి ఆచారమేమిటి? అది కుటుంబం కడుపు ఎలా నింపుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 
 

Ganga River

నదిలో కాసుల వేట : 

సాధారణంగా నీటి ప్రవాహాల్లో ఏ చేపలకోసమో, ఇతర జలచరాల కోసమో జాలర్లు వేటాడటం చూసుంటారు. సముద్రాలు, నదులు, వాగులు వంకలు, చెరువుల్లో లభించే చేపలు, రొయ్యలు, పీతలు వంటివి వలవేసి పట్టుకోవడం... వాటిని అమ్మగా వచ్చిన డబ్బులు కుటుంబాన్ని పోషించుకుంటారు జాలర్లు. కానీ నేరుగా నీటి ప్రవాహాల్లోనే డబ్బుల కోసం వేటాడటం ఎప్పుడైనా చూసారా? 

నీటిలో డబ్బుల వేట ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అయితే మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి చాలా తెలివిగా ఆలోచించి నీటిలోంచి డబ్బులు తీస్తున్నాడు. అతడి తెలివిగా నదిలో చేపలు పట్టినట్లే డబ్బులు పడుతున్నాడు... ఇలా డబ్బుల వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకూ నదిలో డబ్బులెలా వచ్చాయో తెలుసా? హిందువుల ఆచారమే ఆ నదిలో డబ్బులకు కారణం. నదులు, నీటి ప్రవాహాల్లో నాణేలు వేయడం పవిత్రమైన పనిగా పెద్దలు చెబుతుంటారు... దాన్ని చాలామంది విశ్వసిస్తారు. ఇక ఎంతో పవిత్రంగా భావించే గంగానది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

గంగా నదిలో పుణ్య స్నానానికి వచ్చేవారు, నదీతీరంలోని ఆలయాలకు వచ్చేవారు, నదిపై గత వంతెనలపై వెళ్లే వాహనాల నుండి ప్రయాణికులు నీటిలో నాణేలు వేస్తుంటారు. ఇలా వేసిన నాణేలను సేకరించడమే ఓ వ్యక్తి జీవనాధారంగా ఎంచుకున్నాడు. ఇలా నదిలోంచి డబ్బులు తీసే విధానానికి చాలామంది ఫిదా అయిపోయారు. 

ప్రత్యేక పడవలో నదిలోకి వెళ్లే అతడు కొన్ని అయస్కాంతాలను తాడుకు కట్టేసి నదిలోకి విసురుతాడు. ఆ తాడును పట్టుకుని మెళ్ళిగా దగ్గరకు లాగుతాడు. నాణేలకు అయస్కాంతానికి అతుక్కునే గుణం వుంటుంది ... కాబట్టి భక్తులు నదిలో విసిరిన నాణేలు బయటకు వస్తాయి. ఇలా అతడు చాలా తెలివిగా నాణేల వేట చేపడుతున్నాడు. 

Latest Videos


Ganga River

బంగారం,వెండి కూడా :

గంగానదిలో యువకుడు నాణేలను బయటకు తీయడాన్ని గమనించినవారు దాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ యువకుడితో కూడా మాట్లాడించారు. ఇలా నదిలోంచి తీసే డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని సదరు యువకుడు తెలిపారు. అంతేకాదు కేవలం నాణేలే కాదు అప్పుడప్పుడు బంగారం,వెండి కూడా లభిస్తుందని సదరు వ్యక్తి వెల్లడించాడు. 

ఇలా నదిలోంచి నాణేలు తీస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 62 లక్షలకు పైగా మంది వీక్షించారు. రెండున్నర లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలామంది ప్రశంసలు కురిపించారు. కానీ కొంతమంది బంగారం, వెండిని అయస్కాంతంతో ఎలా సేకరిస్తారనే సందేహం వ్యక్తం చేశారు.
 

Ganga River

ఇంతకూ నీటిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా? 

నదుల్లో డబ్బులు వేయడం భారతదేశంలో ఒక పురాతన ఆచారం. ఈ ఆచారం వేదకాలం నుండి ఉన్నట్టుగా చరిత్ర  చెబుతోంది. కాలానుగుణంగా మార్పులు వచ్చినప్పటికీ ఈ ఆచారం మాత్రం కొనసాగుతోంది.ప్రధానంగా ఈ ఆచారానికి సాంస్కృతిక,సైన్స్ రీజన్స్ ఉన్నాయి.  

మన పురాణాల ప్రకారం నదులు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా గంగ, యమున, గోదావరి వంటి నదులను దేవతల రూపంగా భావిస్తారు. అందువల్ల భక్తులు నదుల్లోకి నాణేలు వేయడం అనేది దేవతలకు కానుకలు ఇచ్చినట్టుగా భావిస్తారు.  ఈ ప్రక్రియను ఒక ఆచారంగా అందరూ ఆచరిస్తారు. 

ఇక సైన్స్ రీజన్ ఏమిటంటే...పూర్వం నాణేలు ముఖ్యమైన లోహాలతో తయారు చేసేవారు. ముఖ్యంగా రాగి(copper)తో ఎక్కువగా వీటిని తయారు చేసేవారు. ఈ నాణేలు నీటిలోకి వెళ్లి అక్కడ ఉండే సూక్ష్మజీవులు, ఇతర హానికరమైన పదార్థాలను నాశనం చేస్తాయి. సైన్స్ ప్రకారం రాగి, వాటర్ తో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి నీటిలోని వ్యర్థాలను సెపరేట్ చేసి నీటి అడుగుకు పంపుతుంది. దీంతో పైన ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటినే పూర్వం ప్రజలంతా తాగేవారు. ఇది ఒక రకమైన పరిశుభ్రతను ప్రోత్సహించే ప్రక్రియ కాబట్టి నాణేలు నదుల్లో వేయడం నీరు శుభ్రమవుతుందని, ఒక ఆరోగ్యకరమైన ఆచారమని ప్రజలంతా ఆచరించేవారు.  

click me!