రైలులో ఎంత లగేజి క్యారీ చేయవచ్చో తెలుసా?

First Published | Sep 14, 2024, 5:57 PM IST

విమానాల్లో మాదిరిగానే రైళ్లలోనూ పరిమితికి లోబడే లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి వుంటుంది. ఇలా రైళ్లలో ఎంత లగేజీని క్యారీ చేయవచ్చో తెలుసా? 

Indian Railway

Indian Railway : విమాన ప్రయాణికులు పరిమితికి మించి లగేజిని తీసుకెళ్లడానికి అనుమతి వుండదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో విమాన ప్రయాణ సమయంలో చాలామంది పరిమితంగానే లగేజీ తీసుకెళతారు... లేదంటే ఎయిర్ పోర్ట్ లో లేనిపోని తలనొప్పి వస్తుంది. కానీ రైళ్లలో ఇలాకాదు... బస్తలకు బస్తాలను తీసుకెళుతుంటారు. రైలు ప్రయాణాల్లో ఎంతయినా లగేజీ తీసుకెళ్ళవచ్చు... ఎలాంటి పరిమితి వుండదని భావిస్తుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే విమానాల్లో మాదిరిగానే రైళ్లలోనూ లగేజీ పరిమితి వుంటుంది. 

Indian Railway

ఏంటీ... రైళ్లలోనూ ఇష్టం వచ్చినంత లగేజీ తీసుకెళ్లలేమా! అని ఆశ్చర్యపోతున్నారా. అయితే రైల్వే నిబంధనలను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.  రైలు ప్రయాణాన్ని బట్టి ఎంత లగేజీ వెంట తీసుకెళ్లవచ్చు అనేది నిర్దారించారు. లగేజీ బరువు పరిమితి మించితే జరిమానా విధించే అవకాశం వుంటుంది. కాబట్టి రైళ్లలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసుకొండి. 

Latest Videos


Indian Railway

రైల్వే నిబంధనల ప్రకారం...  ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు, ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. AC2 టైర్‌ ప్రయాణికులు 50 కిలోలు, AC3 టైర్, చైర్ కార్ ప్రయాణీకులు 40 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులు కూడా 40 కిలోల వరకు లగేజీని క్యారీ చేయవచ్చు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు లగేజీని ఉచితంగా వెంట తీసుకెళ్లవచ్చు. 

ఇలా రైళ్లలో పరిమితంగానే లగేజీ తీసుకెళ్లాలి... ఎక్కువ తీసుకెళ్లాలంటే అదనపు చార్జీలు చెల్లించాల్సి వుంటుంది. అలాకాదని ఎక్కువ లగేజీని వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే జరిమానా పడవచ్చు. కాబట్టి ఏ క్లాస్ లో ప్రయాణించేవారు పరిమితికి లోబడే లగేజీని తీసుకెళ్లడం మంచింది.  
 

Indian Railway

లగేజీ బరువే కాదు సైజు పై కూడా పరిమితి వుంది. లగేజీ ప్యాక్ చేసే సూట్ కేసులు, పెట్టెల పరిమాణం 100 cm x 60 cm x 25 cm (Length x Width x Hight)   మించకూడదు. ఏసి, చైర్ కార్ కోచ్ లో అయితే ఇది మరింత తక్కువగా వుంటుంది... 55 cm x 45 cm x 22.5 cm మించకూడదు. లగేజీ ఈ కొలతలు దాటితే వాటిని విడిగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్‌లో తరలించారు. ఈ బ్రేక్ వ్యాన్ బాగా పెద్దగా, భారీ లగేజీకి సరిపోయేలా రూపొందించబడింది.

Indian Railway

ఇలా బరువు, పరిమాణ పరిమితులతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా రైళ్లలో కొన్ని వస్తువులను తరలించడంపై నిషేదం వుంది. రసాయనాలు, బాణాసంచా, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, గ్రీజు, లెదర్ మొదలైనవాటిని ప్రయాణికులు వెంట తీసుకెళ్లడంపై నిషేధం వుంది. ప్రయాణీకులు ఈ నిషేధిత వస్తువులలో దేనినైనా తీసుకువెళుతున్నట్లు తేలితే వారు భారతీయ రైల్వే నిబంధనలలోని రూల్ 164 ప్రకారం కఠిన శిక్షను ఎదుర్కొంటారు.ప్రయాణీకుల భద్రతను దృష్టిలో వుంచుకుని   ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరక్కుండా నివారించడానికి ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.  

click me!