పెన్షనర్లు తమ పెన్షన్ ఎంత పెరుగుతుందో తెలుసుకునేందుకు ఆత్రుతగా ఉన్నారు. పెన్షన్ రివిజన్, ఫ్యామిలీ పెన్షన్, పాత పెన్షనర్ల భద్రత లాంటి చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2026 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయిన వాళ్లను కూడా కొత్త పెన్షన్ రివిజన్‌లో చేర్చాలని పెన్షనర్ల సంఘాలు గట్టిగా అడుగుతున్నాయి. దీనికోసం 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (Terms of Reference)లో స్పష్టమైన మార్పులు చేయాలని కోరుతున్నాయి.
అలాగే, చెన్నైలో జరిగిన మీటింగ్‌లో కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ పెంపుపై పలు డిమాండ్లు పెట్టారు. ఒక పెన్షనర్ల సంఘం అయితే 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ₹69,000 కనీస బేసిక్ పే ఇవ్వాలని అడిగింది. అయితే ఇవన్నీ వాళ్ల డిమాండ్లు మాత్రమే, ప్రభుత్వం ఇంకా ఏదీ ఓకే చేయలేదు.