ఢిల్లీ లాడ్జి హత్య కేసులో, హనీ-ట్రాప్ యాంగిల్.. చంపేసి "సారీ" నోట్ పెట్టి..

Published : Apr 08, 2023, 12:25 PM IST

ఢిల్లీలో కలకలం రేపిన వ్యాపారి హత్య కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీట్రాప్ చేసి దోచుకునే ముఠా సభ్యురాలిగా తేల్చారు.

PREV
16
ఢిల్లీ లాడ్జి హత్య కేసులో, హనీ-ట్రాప్ యాంగిల్.. చంపేసి "సారీ" నోట్ పెట్టి..

న్యూఢిల్లీ : ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని లాడ్జిలో ఒక వ్యాపారవేత్త హత్యకు గురైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య జరిగిన వారం రోజుల తర్వాత, ఈ కేసుకు సంబంధించి 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని పానిపట్‌కు చెందిన ఈ మహిళ.. వ్యాపారవేత్త హత్యలో నిందితురాలిగా పేర్కొన్నారు. హనీ ట్రాప్ చేసి.. బాధితులను దోచుకునే ముఠాలోని వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

26

నిందితురాలి పేరు ఉష అని ఆమెకు అంజలి, నిక్కీ, నికిత అనే మారు పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రకరకాల పేర్లతో తాను టార్గెట్ చేయాలనుకున్న వ్యక్తులతో స్నేహం చేస్తూ వారిని హోటళ్లకు తీసుకెళ్లేది. ఆ తరువాత మత్తుమందు ఇచ్చి, తన ముఠాతో కలిసి దోచుకునేవారు.

36

వ్యాపారవేత్త దీపక్ సేథీని దోచుకోవడానికి నిందితులు ఇదే ప్లాన్‌ను ఉపయోగించారు. ఈ క్రమంలో దీపక్ సేథీ డ్రగ్స్ ఓవర్ డోస్ అవ్వడంతో ఢిల్లీలోని బల్జీత్ లాడ్జిలోని తన గదిలో మృతి చెంది కనిపించాడు. నోట్లో నుంచి నురగలు కక్కుతూ శవమై కనిపించాడు. దీంతో డ్రగ్స్ ఓవర్ డోస్  వల్లే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీపక్ సేథి (53) మార్చి 30వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్ హౌస్‌కు వెళ్లాడు. ఆ మహిళ అర్థరాత్రి 12.24 గంటల ప్రాంతంలో రూ. 1,100, నగలతో గది నుండి బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

46

అతను చనిపోవడం విషయంలో తన విచారం వ్యక్తం చేస్తూ ఆమె చేతిరాతతో రాసిన నోట్‌ను వదిలివెళ్లింది. విచారణలో, బాధితుడితో కాల్ లిస్టులో ప్రధాన నిందితురాలితో సహా అనుమానాస్పద నంబర్‌లను పోలీసులు కనుగొన్నారు. నకిలీ పత్రాలను ఉపయోగించి మార్చి 20న ఈ నంబర్‌ను జారీ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. మార్చి 23న సంత్‌గఢ్ ప్రాంతంలో ఈ నంబర్ రీఛార్జ్ చేశారు. దీంతో సంత్ గఢ్ లొకేషన్‌కు చేరుకున్న పోలీసులు, ఆ రీఛార్జ్ చేసింది చిడే అనే నైజీరియన్ జాతీయుడని కనిపెట్టారు. 

56

అతడిని విచారించగా.. ఆ నెం. తన సహజీవన భాగస్వామి మధుమిత స్నేహితురాలు నిక్కీ అలియాస్ నికితకు చెందిన నంబర్ అని చిదే పోలీసులకు చెప్పాడు. అతను చెప్పిన వివరాలతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఉషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో ఉష జైలులో ఉన్నట్లు విచారణలో తేలింది. ఆమె జైలులో మధుమితతో స్నేహం చేసింది. ఆ తరువాత సంత్‌గఢ్‌లో వీరిద్దరు కలిసి ఉండేవారు. 

66
Suicide

మధుమితకు దీపక్ సేథి పరిచయం. అలా మధుమిత దీపక్ సేథిని ఉషకు పరిచయం చేసిందని పోలీసులు తెలిపారు. మార్చి 30న మధుమిత, ఉషాలు  కన్నాట్ ప్లేస్‌లోని మెట్రో స్టేషన్ సమీపంలో దీపక్ సేథీని కలిశారు. అనంతరం ఉషాను అతను బల్జీత్ లాడ్జికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


విచారణ సమయంలో, ఉష, సేథీని చంపే ఉద్దేశ్యం తనకు లేదని పోలీసులకు చెప్పింది. అనుకోకుండా జరిగిపోయిందని.. అందుకే గది నుండి వెళ్లేముందు దీపక్ సేథీ కోసం "సారీ" నోట్‌ను వదిలివేసినట్లు కూడా చెప్పింది. అతను "మంచి వ్యక్తి" అని పేర్కొంది. ఉష దగ్గరి నుంచి హోటల్ నుంచి తీసుకెళ్లిన బ్యాగ్, సేథి బంగారు ఉంగరం, అతని మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

click me!

Recommended Stories