హిమాచల్ ప్రదేశ్ ప్రమాదం : లేడీ డాక్టర్ చివరి ట్వీట్ వైరల్..

First Published Jul 26, 2021, 1:22 PM IST

 జైపూర్ కు చెందిన ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ దీప విషయంలో ఇది నిజం అక్షరాల నిజమయ్యింది. ఆదివారం హిమాచల్ ప్రదేశ్, కన్నౌన్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘనలో మృతి చెందిన 9మందిలో ఆమె కూడా ఒకరు. 

జీవితంలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. పెద్దలు చెప్పే ఈ మాట వందశాతం వాస్తవం. అంతేకాదు జీవితం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ తెలీదు. సెకన్లలో జీవితం తలకిందులు అవ్వచ్చు. అప్పటివరకు ఆడుతూ, పాడుతూ మనతో ఉన్నవాళ్లు.. అంతలోనే కనిపించకుండా పోవచ్చు.
undefined
అందుకే జీవించినంత కాలం హాయిగా, ఆనందంగా బతకాలని చెుతుంటారు. జైపూర్ కు చెందిన ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ దీప విషయంలో ఇది నిజం అక్షరాల నిజమయ్యింది. ఆదివారం హిమాచల్ ప్రదేశ్, కన్నౌన్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘనలో మృతి చెందిన 9మందిలో ఆమె కూడా ఒకరు.
undefined
మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్ బార్డర్ వద్ద దిగిన ఫోటోను తన ట్విటర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్ రోడ్డు మీద వెడుతున్న కార్లమీద పడ్డాయి.
undefined
ఓ కారులో ఉన్న దీప మృత్యవాతపడింది. ఓ ప్రకృతి ప్రేమికురాలి జీవితం ముగిసింది. ప్రస్తుతం ఆమె చివరి ట్విటర్ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమ షాక్ ను.. సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
undefined
click me!