గోవాలో ఇడ్లీ సాంబార్ వివాదం
బెంగళూరుకు చెందిన వాళ్లు గోవాకు వచ్చి వడ పావ్ అమ్ముతున్నారు. కొందరు ఇక్కడ ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. అందుకే గత రెండేళ్లుగా గోవాకు అంతర్జాతీయ పర్యాటకుల రాక తగ్గిందని ఆయన చెప్పారు. ఇలా గోవాలోకి ప్రవేశించిన ఇతర ఆహార పదార్థాలే రాష్ట్రంలో పర్యాటకుల రాకను ప్రభావితం చేసాయని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు.
ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే భారత పర్యటనకు వచ్చేవారు గోవా కంటే ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. గోవా పర్యాటక శాఖతో పాటు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్లు విదేశీ పర్యాటకుల రాక తగ్గడానికి కారణం... వీళ్లు ఈ విషయం తెలుసుకోవాలని అన్నారు.