అల్ట్రాసౌండ్, ఎక్స్-రే, సిటీ స్కాన్‌తో సహా క్షుణ్ణంగా పరీక్షించారు. అయితే, ఎండోస్కోపీ లేదా లాపరోస్కోపీ లాంటి ఇన్వాసివ్ పద్ధతుల ద్వారా ఫోన్‌ను సురక్షితంగా కడుపులోనుంచి తీయడం సాధ్యం కాదని తేలింది. దీనికోసం శస్త్రచికిత్స జోక్యం అవసరమని వైద్య బృందం నిర్ధారించింది. శస్త్ర చికిత్స బృందం దాదాపు రెండు గంటలపాటు శ్రమించి బాలిక కడుపులో నుంచి ఫోన్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ సమయంలో కొంచెం క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పటికీ, ఆపరేషన్ విజయవంతమైందని, ఫోన్‌ని విజయవంతంగా బైటికి తీశామని డాక్టర్ కుష్వాహా తెలిపారు.