దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి వల్ల జాతీయ రహదారుల రూపురేఖలు మారాయి. ఈ రోడ్లు ప్రయాణికులకు సౌకర్యంతో పాటు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టోల్ ద్వారా భారీ ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. ఒకే ఒక్క ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక్క నెలలో ఎంత సంపాదించిందో తెలుసా?
దేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. 2025 బడ్జెట్‌లో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలను కలుపుతూ బాగా పొడవైనవే కాదు చిన్న చిన్న ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ఉన్నాయి. దేశంలో అత్యంత లాభదాయకమైన ఎక్స్‌ప్రెస్‌వే ఏదో తెలుసా? ఇది ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తుంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్యను పెంచింది. దీని నిర్మాణం కోసం దాదాపు రూ. 16,300 కోట్లు ఖర్చయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇంకేదో కాదు ముంబై టు పూణె మధ్య నిర్మించినదే.
25
ముంబై - పుణె ఎక్స్‌ప్రెస్‌వే
ఈ ఎక్స్‌ప్రెస్‌వే నవీ ముంబైలోని కలంబోలిలో మొదలై పుణెలోని కివాలేలో ముగుస్తుంది. దీనిని NHAI తో కలిసి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) నిర్మించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు ఇరువైపులా అదనంగా మూడు లేన్ల కాంక్రీట్ సర్వీస్ రోడ్లు నిర్మించారు.
2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ముంబై, పుణె నగరాలను కలుపుతూ ప్రయాణికుల సమయాన్ని బాగా ఆదా చేస్తుంది.
35
ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యంత ఖరీదైనది, రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వే. ఇది పురాతనమైన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆర్థిక రాజధాని ముంబైని పుణెతో కలిపే ఈ రోడ్డు భారతదేశపు మొట్టమొదటి ఆరు లేన్ల రహదారి.
45
రూ. 163 కోట్ల ఆదాయం
డిసెంబర్ 2024లో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే టోల్ వసూళ్లలో అగ్రస్థానంలో ఉందని IRB ఇన్ఫ్రా ట్రస్ట్ విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. ఈ సమయంలో టోల్ వసూళ్లు రూ. 580 కోట్లకు చేరుకోగా, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే ఒక్కటే రూ. 163 కోట్లు వసూలు చేసింది. 2023 డిసెంబర్‌లో టోల్ వసూళ్లు రూ. 158.4 కోట్లుగా ఉన్నాయి.
55
అత్యధిక ఆదాయ
ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం 94.5 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది, కానీ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. డిసెంబర్ 2024లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే, NH48 కలిసి టోల్ టాక్స్ ద్వారా రూ. 70.7 కోట్లు వసూలు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలను కలుపుతూ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నప్పటికీ, వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది.