తన చెల్లెలు సుమైల తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సోనూ అనుమానించిందని డీసీపీ తెలిపారు. ఇక, శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టంలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనూను అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు.