ఏడాదిగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజీల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఏడాదిగా పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గడం లేదు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాను విధించే పన్నులను కొంత తగ్గించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడ పన్నులను తగ్గించాలని సూచించింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనతో కొంత పన్నులను తగ్గించాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో కొన్ని పన్నులు తగ్గించలేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గినా కూడా దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గలేదు.