ఇరు కుటుంబాలు మాట్లాడుకుని అన్ని విషయాల్లో అంగీకారానికి వచ్చిన తర్వాత ఈ పెళ్లిని కుదిరించారు. మే 29వ తారీఖున యోగేష్, శిల్పి వివాహం జరగాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఇరు కుటుంబాలు కళ్యాణం జరగాల్సిన మే 29న పెళ్లి మండపానికి చేరుకున్నారు. మండపమంతా బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది. వరుడు కూడా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నాడు.