పెళ్లి టైమ్‌కు వరుడు మిస్సింగ్.. పారిపోతున్నాడని తెలిసి వధువు ఏం చేసిందంటే..

Published : May 23, 2023, 04:00 PM IST

వివాహనికి కొద్ది నిమిషాల ముందు వరుడు పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. పెళ్లి మండపానికి 20 కి.మీ దూరంలో అతడిని పట్టుకుని మండపానికి తీసుకొచ్చింది. చివరకు అతడితోనే ఆమె వివాహం జరిగింది. 

PREV
15
పెళ్లి టైమ్‌కు వరుడు మిస్సింగ్.. పారిపోతున్నాడని తెలిసి వధువు ఏం చేసిందంటే..

వివాహనికి కొద్ది నిమిషాల ముందు వరుడు పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. పెళ్లి మండపానికి 20 కి.మీ దూరంలో అతడిని పట్టుకుని మండపానికి తీసుకొచ్చింది. చివరకు అతడితోనే ఆమె వివాహం జరిగింది. 

25

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. బరేలికి చెందిన మహిళకు బదౌన్ జిల్లాకు చెందిన వ్యక్తితో రెండున్నరేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చాలా చర్చలు జరిగాయి. 

35

పలుమార్లు చర్చల తర్వాత ఎట్టకేలకు పెళ్లికి తేదీని నిర్ణయించారు. ఆదివారం భూతేశ్వర్ నాథ్ ఆలయంలో ఈ జంట వివాహం జరపాలని నిర్ణయించారు. అయితే వివాహ ముహూర్తం సమీపించినా అక్కడ వరుడి జాడ లేదు. దీంతో అక్కడ అనేక అనుమానాలు మొదలయ్యాయి. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 

45

తన వాళ్లను వెంట పెట్టుకుని వరుడి కోసం వేటాడుతూ వెళ్లింది. బరేలీకి 20 కి.మీ దూరంలో ఉన్న భీమోరా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కుతుండగా వరుడిని పట్టుకుంది. తిరిగి అతడిని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చే సమయంలో.. మార్గమధ్యంలో హైవోల్టేజీ డ్రామా జరిగింది.

55

అయితే ఏది ఏమైనా వధువు మాత్రం వరుడిని వదిలిపెట్టేందుకు ఇష్టపడలేదు. చివరకు ఇరు కుటుంబాల సమక్షంలో  వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

click me!

Recommended Stories