బీజేపీ నాయకురాలు సనా ఖాన్ హత్య, భర్త అరెస్ట్.. ఇంకా లభించని మృతదేహం..

Published : Aug 12, 2023, 03:59 PM IST

నాగ్‌పూర్ బీజేపీ నాయకురాలు సనా ఖాన్ హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె భర్తను మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
15
బీజేపీ నాయకురాలు సనా ఖాన్ హత్య, భర్త అరెస్ట్.. ఇంకా లభించని మృతదేహం..

నాగ్‌పూర్ : నాగ్‌పూర్ బీజేపీ నాయకురాలు సనా ఖాన్ అదృశ్యం మిస్టరీ వీడింది. ఈ ఘటన జరిగి పది రోజుల తర్వాత, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆమెను హత్య చేసినందుకు ఆమె భర్త అమిత్ సాహును శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

25

అమిత్ సాహు నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో సంబంధం ఉందని నాగ్‌పూర్ పోలీసుల బృందం జబల్‌పూర్‌లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసింది.

35

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాహు ఎమ్మెల్యే ఖాన్ మృతదేహాన్ని నదిలో పడేశాడు. సాహు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సనాఖాన్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. అయితే బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

45

నాగ్‌పూర్ నివాసి, బిజెపి మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ జబల్‌పూర్ వచ్చి అదృశ్యమయ్యారు. ఆమె కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 1న ఖాన్ ఫోన్ చివరి లొకేషన్ జబల్‌పూర్‌లో ఉంది, అక్కడ ఆమె సాహుని కలవడానికి వెళ్ళింది. 

55

ఖాన్ నాగ్‌పూర్ నుండి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు నగరానికి చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. అయితే కొద్దిసేపటికే ఆమె కనిపించకుండా పోయింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నాగ్‌పూర్ పోలీసుల బృందం మహారాష్ట్రకు వెళ్లి ఈరోజు స్థానిక కోర్టులో హాజరుపరచనుంది.

click me!

Recommended Stories