జూలై 22, 25, 26 సెలవే..
ఈ వారంలో మొదటి సెలవు జూలై 22న అంటే వచ్చే బుధవారం వస్తోంది. అయితే ఈ సెలవు కేవలం త్రిపురలో మాత్రమే… ఈ రాష్ట్రంలో ఖార్చీ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యధావిధిగా నడుస్తాయి.
ఖార్చీ పూజ అనేది త్రిపురలోని చాలా పురాతనమైన, ముఖ్యమైన మతపరమైన, సాంస్కృతిక పండుగల్లో ఒకటి. ఈ పండుగ సమయంలో 14 దేవతలకు, భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ స్థానిక పండుగ కారణంగా రిజర్వ్ బ్యాంక్ కేవలం అగర్తలా బ్యాంకింగ్ సర్కిల్‌కు మాత్రమే సెలవు ప్రకటించింది. కాబట్టి ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదని కస్టమర్లు గమనించాలి.
ఇక జూలై 25న మరో సెలవు వస్తోంది. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది… ఈ జూలైలో నాలుగో శనివారం 25న వస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూలై 26న ఆదివారం… కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, ఆఫీసులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా బ్యాంకు ఉద్యోగులకు సెలవే…. దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. ఇలా ఈ వారంలో రెండ్రోజులు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులుండగా… ఓ రోజు త్రిపురలో మాత్రమే సెలవు ఉంది.