మద్యం దుకాణానికి రికార్డు ధర: రూ. 510 కోట్లకు దక్కించుకొన్న మహిళలు

First Published Mar 10, 2021, 10:45 AM IST

మద్యం దుకాణానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ వేలం పాటలో ఇద్దరు మహిళలు మద్యం దుకాణాన్ని దక్కించుకొన్నారు. రూ. 510 కోట్లతో ఈ దుకాణాన్ని రాజస్థాన్ కు చెందిన ఇద్దరు మహిళలు కొనుగోలు చేశారు. 

మద్యం దుకాణం కోసం టెండర్ ప్రక్రియ ఓ గ్రామంలో ఉదయం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగింది. అంతేకాదు రికార్డు స్థాయిలో ఈ మద్యం దుకాణాన్ని దక్కించుకొన్నారు.ఈ దుకాణాన్ని రూ. 500 కోట్లకు దక్కించుకొన్నారు టెండరుదారుడు
undefined
రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ మద్యం దుకాణం వేలం రూ. 72 లక్షలతో ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం ప్రక్రియ తెల్లవారుజాము 2 గంటల వరకు కొనసాగింది.
undefined
మూడు రోజుల క్రితం రాష్ట్రంలో మద్యం దుకాణాల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 వేల మద్యం దుకాణాలకు ఈ యాక్షన్ నిర్వహిస్తున్నారు. వసుంధరరాజే సీఎంగా ఉన్న సమయంలో ఈ విధానాన్ని రద్దు చేశారు. ఆశోక్ గెహ్లాట్ మాత్రం ఈ విధానాన్ని తిరిగి పునరుద్దరించారు.
undefined
రూ. 72 లక్షలతో ప్రారంభమైన వేలం ప్రక్రియ చివరకు రూ. 510 కోట్లకు ముగిసింది. ఈ మద్యం దుకాణం గత ఏడాది రూ. 65 లక్షలకు విక్రయించారు. ఈ ఏడాది ఈ దుకాణం మూల ధరను రూ.72 లక్షలుగా అధికారులు నిర్ణయించారు.
undefined
రూ. 510 కోట్లకు మద్యం దుకాణాన్ని కొనుగోలు చేసింది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు.వీరిలో ఒకరి పేరు కిరణ్ కన్వార్ గా అధికారులు తెలిపారు.
undefined
ఇంత పెద్ద మొత్తంలో వేలం ప్రక్రియలో పలుకుతుందని ఎక్సైజ్ అధికారులు కూడ ఊహించలేదు. సాధారణ ధర కంటే సుమారు 708 రెట్లు అధికంగా ఈ దుకాణానికి దక్కింది.
undefined
మద్యం దుకాణాన్ని దక్కించుకొన్నవారు వేలం పాటలో రెండు శాతం డబ్బులను తొలుతఎక్సైజ్ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. వేలం ప్రక్రియ పూర్తైన మూడు రోజుల లోపుగా ఈ డబ్బులను జమ చేయాలి.
undefined
లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతోంది. లైసెన్స్ క్యాన్సిల్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1 లక్ష కూడ తిరిగి వేలంలో పాల్గొన్నవారికి ఇవ్వరు.
undefined
గతంలో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలను కేటాయించేవారు కానీ ప్రస్తుతం ఈ యాక్షన్ ద్వారా టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
undefined
నోహర్ తో పాటు చురు జిల్లాలోని ఓ వైన్ షాపును రూ. 11 కోట్లకు దక్కించుకొన్నారు. జైపూర్ లోని సంగనేర్‌లోని మరో దుకాణాన్ని ఈ వేలంలో రూ. 8.91 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు.
undefined
click me!