తమిళ రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ? ఈ నెల 31 న పార్టీ ప్రకటన??

First Published Dec 29, 2020, 4:07 PM IST

తమిళనాడు రాజకీయాల్లో రోజుకో కొత్త ట్విస్ట్ కనిపిస్తుంది. రాజకీయాలకు రజనీ నో చెప్పడంతో  తమిళ్ పొలిటికల్ స్క్రీన్ పై హీరో విజయ్ వచ్చాడు. అనారోగ్య కారణాల దృష్ట్యా సూపర్ స్టార్ రజినీకాంత్  వెనక్కి తగ్గారు. పార్టీని ప్రారంభించట్లేదని నేడు సంచలన ప్రకటన చేశారు. 

తమిళనాడు రాజకీయాల్లో రోజుకో కొత్త ట్విస్ట్ కనిపిస్తుంది. రాజకీయాలకు రజనీ నో చెప్పడంతో తమిళ్ పొలిటికల్ స్క్రీన్ పై హీరో విజయ్ వచ్చాడు. అనారోగ్య కారణాల దృష్ట్యా సూపర్ స్టార్ రజినీకాంత్ వెనక్కి తగ్గారు. పార్టీని ప్రారంభించట్లేదని నేడు సంచలన ప్రకటన చేశారు.
undefined
అయితే తలైవా పార్టీ ఆలోచన విరమించుకోవడంతో హీరో విజయ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలోనే ఆయన పార్టీ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి నిజంగానే దళపతి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా?
undefined
విజయ్ రాజకీయాల్లోకి వస్తారనేది ఇప్పటి మాట కాదు. గత రెండేళ్లుగా ఈ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ విజయ్ పేరుతో పార్టీ ప్రకటించి, ఎన్నికల సంఘం గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో దళపతి రాజకీయ అరంగేట్రం మళ్లీ జోరందుకున్నాయి.
undefined
అయితే దీనిపై నటుడు విజయ్ స్పందించారు. తన తండ్రి పెట్టిన పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేగాక, తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ సభ్యులెవరూ తన తండ్రి ప్రకటించిన పార్టీలో చేరద్దని బహిరంగంగానే చెప్పారు. దీంతో విజయం రాజకీయాల్లోకి రాగానే అంతా భావించారు.
undefined
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మక్కళ్ ఇయక్కమ్ కార్యదర్శులతో విజయ్ అనధికారికంగా సమావేశమయ్యారు. ‘ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతర ఏ రాజకీయ పార్టీలోనూ చేరవద్దు. మీరు ఎదురుచూస్తున్న క్షణం త్వరలోనే వస్తుంది. నా నుంచి మంచి ప్రకటన వెలువుడతుంది’ అని విజయ్ రాజకీయ ప్రవేశంపై రహస్య సందేశం ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
undefined
దీంతో దళపతి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ మళ్లీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్.. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలవడం కూడా ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
undefined
అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, తన తదుపరి చిత్రం మాస్టర్ విడుదల విషయమై ఆయన సీఎంను కలిసినట్లు సమాచారం.
undefined
విజయ్ ను తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానగణం ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది విజయ్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
undefined
అయితే ఇప్పుడు తలైవా రాజకీయాల ఆలోచన విరమించుకోవడంతో విజయ్ ఎంట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది.
undefined
డిసెంబర్ 31న మాజీ సీఎం, దివంగత జయలలిత సమాధి వద్ద దళపతి పార్టీ ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీ ,అళగిరి పార్టీ తో DMK ఓటు బ్యాంక్ చీల్చేలా స్కెచ్ వేస్తున్నారు.
undefined
click me!