యువతకు టివికే వరాలు..
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కీలక ప్రకటనలు చేసింది టివికే. ప్రతి కాలేజీ విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ నుంచి డాక్టోరల్ స్టడీస్ వరకు చదువుకోవడానికి రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తామని విజయ్ పార్టీ తెలిపింది.
ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసుల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ.5,000 అందిస్తామని టివికే ప్రకటించింది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.10,000, ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.8,000 స్టైఫండ్‌తో ఏటా 5 లక్షల ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే ప్రతి చిన్నారి తల్లికి ఏటా రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. మహిళల స్వయం సహాయక సంఘాలకు (SHGs) రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని టివికే చీఫ్ విజయ్ తెలిపారు. ఇలా చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతపై వరాలు కురిపించారు విజయ్.