8th Pay Commission: 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఆ వివరాలు మీకోసం.
గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం స్పీడప్.. ఉద్యోగుల జీతాల లెక్కలు షురూ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, భత్యాల పెంపుదలపై సిఫార్సులు చేయడానికి 8వ వేతన సంఘం (8th Pay Commission) తన పనిని వేగవంతం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, వివిధ రకాల అలవెన్సుల కోసం ఎంత ఖర్చు చేస్తోందో పూర్తిగా తెలుసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తమ పరిధిలోని ఉద్యోగుల జీతభత్యాల పూర్తి వివరాలను కమిషన్ అధికారిక ఆన్‌లైన్ డేటా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
26
వెంటనే డేటా ఇవ్వండి
ఈ సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి 8వ వేతన సంఘం జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించింది. అయితే, డేట్ ను పొడిగించే అవకాశం వుంది. ఈ ప్రక్రియలో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, భారీ మొత్తంలో ఆర్థిక గణాంకాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు నిర్ణీత గడువులోగా ఈ వివరాలను అందించగలవా లేదా అనేది చూడాలి. ఒకవేళ అవసరమైతే, ఈ డెడ్‌లైన్‌ను పొడిగించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కమిషన్ పేర్కొంది.
36
ఆన్‌లైన్ పోర్టల్‌లోనే సమాచారం.. ఆఫ్‌లైన్ కు నో
అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ వివరాలను కేవలం అధికారిక ఆన్‌లైన్ డేటా పోర్టల్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయాలని వేతన సంఘం స్పష్టం చేసింది. ఎలాంటి ఆఫ్‌లైన్ సమాచారాన్ని అంగీకరించబోరు. అంటే, శాఖలు ఫిజికల్ ఫైళ్లు, ఎక్సెల్ షీట్లు, ప్రింటెడ్ పత్రాలు లేదా ఈమెయిల్ ద్వారా ఎలాంటి డేటాను పంపడానికి వీలు లేదు. కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన డేటాను మాత్రమే కమిషన్ చెల్లుబాటు అయ్యేదిగా గుర్తిస్తుంది. ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల కమిషన్ తన సిఫార్సులను సిద్ధం చేసేటప్పుడు గణాంకాలను సులభంగా విశ్లేషించవచ్చు.
గత మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాల ఖర్చుల వివరాలను అందించాలని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కమిషన్ కోరింది. ఇందులో ఆర్థిక సంవత్సరాలు 2022-23, 2023-24, 2024-25 ల గణాంకాలు ఉంటాయి. పే మ్యాట్రిక్స్ లెవెల్-1 నుండి లెవెల్-18 వరకు ఉన్న ఉద్యోగుల జీతాలు, వివిధ అలవెన్సులపై ఎంత ఖర్చు చేశారో డేటాలో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.
56
ప్రభుత్వ ఖర్చుల పూర్తి సమాచారం
కమిషన్ కేవలం బేసిక్ పే వివరాలను మాత్రమే కాకుండా, వివిధ విభాగాల్లో జరిగిన ఖర్చుల పూర్తి వివరాలను కూడా అడిగింది. ఇందులో బేసిక్ పే, వర్తించే చోట మిలిటరీ సర్వీస్ పే, డీఏ, హౌస్ రెంట్ అలవెన్స్ , ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, రైల్వే ఉద్యోగుల కోసం రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్, నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్, ఉద్యోగులకు ఇచ్చే ఇతర అన్ని అలవెన్సుల వివరాలు ఉండాలి. ఇవే కాకుండా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో అలవెన్సులపై చేసిన మొత్తం ఖర్చు సమాచారాన్ని కూడా విడిగా ఇవ్వాల్సి ఉంటుంది.
66
ఈ ప్రక్రియ ఎందుకు అంత ముఖ్యం?
ఈ డేటా సేకరణ అనేది 8వ వేతన సంఘం సిఫార్సుల దిశగా వేసిన మొదటి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం వివిధ శ్రేణుల ఉద్యోగుల జీతాలు, భత్యాల కోసం ఎంత ఖర్చు చేస్తోందో విశ్లేషించిన తర్వాత, భవిష్యత్తులో వేతన సవరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక ప్రభావాన్ని కమిషన్ అంచనా వేస్తుంది. ఈ ఆధారంగానే కమిషన్ సవరించిన జీతాల స్కేల్, వివిధ అలవెన్సులు, ప్రభుత్వంపై పడే మొత్తం ఆర్థిక భారం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తన రిపోర్టులను, సిఫార్సులను సిద్ధం చేస్తుంది.