20 నెలల చిన్నారి అవయవదానం.. దేశంలోనే మొదటిసారి...

First Published Jan 16, 2021, 12:44 PM IST

దేశంలోనే అత్యంత పిన్నవయసు అవయవదాతగా నిలిచింది 20 నెలల చిన్నారి ధనిష్తా. కన్నబిడ్డ ప్రమాదవశాత్తూ చనిపోతే, మరో ఐదుగురికి జీవనదానం చేశారా తల్లిదండ్రులు.

దేశంలోనే అత్యంత పిన్నవయసు అవయవదాతగా నిలిచింది 20 నెలల చిన్నారి ధనిష్తా. కన్నబిడ్డ ప్రమాదవశాత్తూ చనిపోతే, మరో ఐదుగురికి జీవనదానం చేశారా తల్లిదండ్రులు.
undefined
తమ బిడ్డ తమకు కానరాకుండా పోయినా ఆ ఐదుగురిలో జీవించే ఉంటుందని అంటున్నారు. పాప కుటుంబం చేసిన ఈ గొప్ప పని నిజంగా ప్రశంసనీయమని డాక్టర్లు అన్నారు.
undefined
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఆశిశ్ కుమార్, బబితా దంపులకు కూతురు ధ‌నిష్తా. 20 నెలల ఆ చిన్నారి ఈ నెల 8న బాల్క‌నీలో నుంచి ప్రమాదవశాత్తు కింద పడింది. వెంటనే ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటిన గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
undefined
Iచికిత్స పొందుతున్న చిన్నారికి ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక తమకు దక్కదని తెలిసిన ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
undefined
అంతటి విషాదంలోనూ తల్లిదండ్రులు.. ఆ చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. చిన్నారికి సంబంధించిన గుండె, కాలేయం, కిడ్నీలు, కార్నియాలను ఐదుగురు పేషేంట్ లకు దానం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వార్త వైరల్ గా మారింది.
undefined
click me!