
Laila Review: హీరో ఆడవేషం వేసి కథను నడిపించటం మంచి సక్సెస్ ఫుల్ ఫార్ములా. ఎప్పుడూ గెడ్డం, మీసం లుక్ తో మాస్ రచ్చ లేపే హీరో ని.. ఆడవేషంలో చూస్తే అందరికీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అందుకే హాలీవుడ్ మిసెస్ డౌట్ ఫెయిర్ నుంచి మన కమల్ ‘బామ్మనే సత్యభామనే’,నరేష్ ...చిత్రం భళారే విచిత్రం, రాజేంద్రప్రసాద్ మేడం, శివకార్తికేయన్ ‘రెమో’వంటి సినిమాలు చాలా సక్సెస్ అయ్యాయి.
ఇప్పుడు విశ్వక్సేన్ సైతం ఆడవేషంలో మన ముందుకు వచ్చారు. ప్రేమికుల రోజు కానుకగా వచ్చిన ఈ సినిమా కథేంటి, ప్లస్ లు, మైనస్ లు ఏమిటి, లైలా గా విశ్వక్ ఏ మేరకు మెప్పించాడు, వంటి విషయాలు చూద్దాం.
Laila Review: స్టోరీ లైన్
హైదారాబాద్ పాతబస్తీలో సోను మోడల్(విశ్వక్ సేన్) కు ఓ బ్యూటీ ఫార్లర్. అలాగే అక్కడ జనాలకు అతని ఫేవరెట్ మేకప్ మ్యాన్ కూడా. అందరితో మంచిగా ఉంటూ , జిమ్ ట్రైనర్ అయిన జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమలో ఉంటూ హ్యాపీగా కాలక్షేపం చేస్తూంటాడు. అయితే అతనికి కొందరు శతృవులు కూడా ఉంటారు. అలాంటివారిలో రుస్తుం(అభిమన్యు సింగ్) ఒకడు.
సోనూ మోడల్ మేకప్ చేసిన ఓ అమ్మాయి(కామాక్షి)ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడి భయపెట్టి, బెదిరించి పెళ్లి చేసుకుంటాడు. తీరా శోభనం జరిగిన తెల్లారి చూస్తే ఆమె నల్లగా ఉందని రివీల్ అవుతుంది. దానికి కారణం సోను మోడల్ మేకప్ అని రుస్తుం సోనుపై పగపెంచుకుంటాడు. అలాగే ఎస్సై శంకర్(బబ్లూ పృథ్వీరాజ్) ఇద్దరు భార్యల మేటర్ ఒకరికొకరికి తెలిసేలా చేసి అతనికి శత్రువు అవుతాడు సోను.
Laila Review: అంతకు ముందే సోను తన పార్లర్ కి వచ్చే ఓ మహిళ కు ఆయిల్ బిజినెస్ కి హెల్ప్ చేస్తాడు. అయితే అదే రుస్తుం పెళ్ళిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలా మంది ఆసుపత్రి పాలవుతారు. సోను పేరుతో ప్రమోట్ అవుతున్న వంట నూనె కావడంతో సోనూ కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు. ఆ ఆయిల్ తో వండిన ఫుడ్ తిని చాలా మంది హాస్పిటల్ పాలవుతారు.
దాంతో సోనుని చంపటం కోసం చాలా మంది తిరుగుతూంటారు. అప్పుడు వీళ్ల నుంచి తప్పించుకోవటానికి సోనూ మోడల్ లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఏమైంది. వాళ్లకు లైలా,సోను ఒకరే అని తెలిసిందా.ఖలీల్ భాయ్(గుళ్ళు దాదా) సోనుని చంపడానికి తిరగటానికి కారణం ఏమిటి..సోనూ లేడీ గెటప్ తో ఏ ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆ లేడి గెటప్ వేసింది సోనూ నే అని ఎప్పుడు రివీల్ అయ్యింది, జెన్నితో సోనూ ప్రేమ కథ ఏమైంది... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Laila Review: ఎలా ఉందంటే
రామ్ గోపాల్ వర్మ, విశ్వక్సేన్ ఇద్దరూ తమ చిత్రాల ప్రమోషన్స్ కోసం రిలీజ్ కు ముందు వివాదాస్పద వ్యాఖ్యలో, వివాదాలు క్రియేట్ చేసే యత్నాలో చేస్తూంటారు. జనాల దృష్టిలో పడుతూంటారు. కానీ సినిమాలో అంత విషయం కనిపించదు. సినిమాకు రిలీజ్ కు ముందు ఏర్పడిన బజ్ ని నిలబెట్టుకునే ప్రయత్నం కొంచెం కూడా కనపడదు. విశ్వక్సేన్ ప్రమోషన్స్ కోసం చేసే ఇన్నోవేటివ్ ఐడియాలు ఆయన సినిమాల్లో కనిపించటం లేదు. మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్..మసకబారిన పాతకాలం రొటీన్ కథల్లో చేస్తున్నాడనిపిస్తూంటుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, ఇదిగో ఇవాళ ఈ లైలా ఏదీ అప్ టు ది మార్క్ ఉండదు. ఏదో సినిమాకు వెళ్లాం, చూసామంటే చూసాం అని అనిపిస్తూంటుంది.
సినిమా మొదటి నుంచీ లైలా చాలా అవుట్ డేటెడ్ సీన్స్ తో ఎనభైల్లో తీసి ఇప్పుడు రిలీజ్ చేసారేమో అని అనుమానాలు కలిగిస్తూంటుంది. కథకథనాల్లో కానీ.. సన్నివేశాల్లో కానీ.. ఎక్కడా ‘వావ్’ అనిపించే మూమెంట్ ఏదీ లేదు. కొత్తదనం అన్నది కాగడా వేసి వెతికినా కనిపించదు. ఈ కథ చాలా సినిమాల్ని గుర్తుకు తెస్తుంది. ప్రతి సన్నివేశం కూడా ఇప్పటికే చూసినట్లే ఉంటుంది. కామెడీ పేరుతో వచ్చే సీన్స్ నవ్వించవు, రొమాన్స్ సీన్స్ కవ్వించవు సరికదా...స్కిప్ చేయటానికి రిమోట్ లేదే అని బాధపడేలా చేస్తాయి.
Laila Review:
హీరో,హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ అయితే దారుణం. సెంటిమెంట్ అయితే చాలా ఫోర్సెడ్ గా అనిపిస్తుంది. కేవలం హీరో..అమ్మాయి వేషం వేసిన సినిమాలు తెలుగులో ఈ మధ్యకాలంలో రాలేదనే ఒక్క ఆలోచనే ఈ సినిమాని ముందుకు నడిపించినట్లుంది.
ఫైట్స్, పాటలు తీసేసినా మిగతా సినిమా అంతా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తరహాలో ఫిల్ చేయటానికి ఎంత కష్టపడ్డారో టీమ్ అనిపిస్తుంది. ఎందుకంటే సరైన కాంప్లిక్ట్ లేకుండా డ్రామాని, అందులో కామెడీని జనరేట్ చేయటం కష్టం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ స్లాంగ్ ని అడ్డంపెట్టి డబుల్ మీనింగ్ లు చెప్పటం కొంత జుగుప్సగానూ అనిపిస్తుంది.
Laila Review: టెక్నికల్ గా ..
విశ్వక్సేన్ కు లైలా గా చూపించటంలో ఫెరఫెక్ట్ గా సెట్ చేయటంలో మాత్రం వంద శాతం సక్సెస్ అయ్యింది టెక్నికల్ టీమ్. అదే సమంయలో స్టోరీ రైటింగ్ నుంచి డైరెక్షన్ , మ్యూజిక్ వరకు ఏ డిపార్టమెంట్ బెస్ట్ ఇవ్వలేకపోయారు.
నటుడుగా విశ్వక్సేన్ ని వంకపెట్టలేం. అతని ఎనర్జీ చాలా వరకూ ఆ మాత్రం అయినా చివరిదాకా సినిమా చూసేలా చేసింది. పృధ్వీ కామెడీ సినిమాలో ఏమీ పండలేదు. హీరోయిన్ కేవలం గ్లామర్ షోకే పరిమితం అన్నట్లు ముందుకు వెళ్లింది. ఉన్నంతలో అభిమన్యుసింగ్ కొన్ని సీన్స్ కు కలిసొచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Laila Review: ఫైనల్ థాట్
స్క్రిప్టు సరిగ్గా లేనప్పుడు ఏ గెటప్ లు వేసినా కలిసొచ్చేదమీ ఉండదు. డబల్ మీనింగ్ జోక్స్, అడల్ట్ జోక్స్ తో నవ్వించాలనే ప్రయత్నం కొన్ని సార్లు మాత్రమే కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో ఫన్ పండకపోతే చూసేవారికి ప్రత్యక్ష్య నరకమే.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating – 1.75