Laila Twitter Review: లైలా మూవీ ట్విట్టర్ రివ్యూ, విశ్వక్ సేన్ ప్రయోగం ఫలించిందా?

Published : Feb 14, 2025, 06:03 AM IST

Laila Twitter Review:  ప్రతీసారి ఏదో ఒక కాంట్రవర్సీ మధ్య సినిమా రిలీజ్ చేస్తూ వచ్చిన విశ్వక్ సేన్. ఈసారి కూడా తన ప్రయోగాత్మక సినిమా లైలాను వివాదాల నడుమ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈమూవీ రిలీజ్ కు ముందు ఫారెన్ లో   ప్రీమియర్స్ సందడి చేయగా.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో అభిప్రాయాలు వెల్లడించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది..?   

PREV
16
Laila Twitter Review: లైలా మూవీ ట్విట్టర్ రివ్యూ, విశ్వక్ సేన్ ప్రయోగం ఫలించిందా?
Laila Twitter Review:

Laila Twitter Review: టాలీవుడ్య లో డిఫరెంట్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రయోగాత్మక సినిమాలతో సందడి చేస్తూ వస్తున్నాడు. ఇక ఈసారి విశ్వక్ చేసిన ప్రయోగం లైలా. వాలంటైన్స్ డే సందర్బంగా థియేటర్లలో సందడిచేయడానికి రెడీగా ఉన్న ఈసినిమా ఎలా ఉంది అనేది ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ లైలా. ఈసినిమాలో విశ్వక్  జంటగా  ఆకాంక్ష శర్మ నటించగా, కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించారు.  రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈసినిమా ఎన్నో వివాదాల నడుమ రిలీజ్ కు రెడీ అయ్యింది.

26
Laila Twitter Review:

లైలా సినిమా సూపర్ హిట్ అవ్వాలని స్టార్ సెలబ్రిటీలు చాలామంది ట్విట్టర్ వేదికగా  విశ్వక్ సేన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందులో మరీ ముఖ్యంగా మెగా మేనల్లుడు  సాయి ధరమ్ తేజ్ ఎక్స్ వేదికగా  విషెస్ తెలిపాడు. లైలా సినిమా చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. విశ్వక్ సేన్‌కు లైలా చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించాలని కోరుకొంటున్నాను. గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతున్నది. చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు..

36
Laila Twitter Review:

ఇక సినిమా ఎలా ఉందంటే.. విశ్వక్ వన్ మ్యాన్ షో. పస్ట్ హాఫ్ లో విశ్వక్ కామెడీ అదరిపోయింది. ప్రతీసీన్ లో విశ్వక్ కష్టం కనిపించింది. ఇతర ఆర్టిస్ట్ ల సపోర్ట్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతం అని ఒకరు ట్వీట్ చేశారు. 
 

46
Laila Twitter Review:

మరొకరు మాతరం లైలా ఫస్ట్ ఆఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాకు రావడం పెద్ద టైం వేస్ట్.. కామెడీ కూడా పెద్దగా అనిపించలేదు.  అంతా ఆర్టిఫిషియల్ గా ఉంది.. దీనికన్నా వరుణ్ తేజ్ మట్కా నే బాగుంది. సెకండ్ ఆఫ్ అన్నా మంచిగా వచ్చింట్లే బాగుండు అని ఓ నెటిజన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 

56
Vishwak Sen Laila Twitter Review:

కొంత మంది మాత్రం సినిమా ఓవర్ ఆల్ గా పర్వాలేదు. మరీ ముఖ్యంగా లేడీ గెటప్ లో అంత సాహసం చేసిన విశ్వక్ సేన్ ధైర్యాన్నిమొచ్చుకోవచ్చు. ఈసినిమా పూర్తి క్రెడిట్ విశ్వక్ కు  దక్కుతుంది అంటూ.. వన్ మ్యాన్ షో అంటూ ట్వీట్ చేస్తున్నారు కొందరు. 

 

66
Laila Twitter Review:

ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఇప్పటి వరకూ పెద్దగా  పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు.. లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ కష్టానికి... లైలా సినిమా రిలీజ్ తరువాత ఒకటి రెండు రోజుల్లో ఏమైనా మార్పుకనిపించవచ్చు.  స్టోరీలో పస లేదు, కాని విశ్వక్ సేన్ కష్టం మాత్రం సినిమాలో కనిపిస్తుంది. లేడీ గెటప్ లో అంత పెర్ఫామెన్స్ అంటే అది అందరికి సాధ్యం కాదు. చూడాలి లైలా ఓవర్ ఆల్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయో. 

Read more Photos on
click me!