విశాల్ Mad వరల్డ్: ‘మార్క్ ఆంటోనీ’రివ్యూ

First Published | Sep 15, 2023, 4:09 PM IST

విశాల్ (Vishal), ఎస్.జె. సూర్య నటించిన టైమ్ ట్రావెల్  సైన్స్ ఫిక్షన్ సినిమా 'మార్క్ ఆంటోనీ' (Mark Antony Movie).

Mark Antony Movie Review


  హీరో విశాల్.. హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలతో ఆయనకు సక్సెస్ రావటం లేదు. దాంతో ఈ సారి రూట్ మార్చి యాక్షన్ కు ఫన్, సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’గా మన ముందుకు వచ్చారు.  టీజర్ .. ట్రైలర్‌లు రిలీజ్  తరువాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్ తో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఓ ఫోన్ హీరోని గ‌తానికి తీసుకెళ్తే త‌నేం చేశాడ‌నే క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది... అసలు కథేంటి, ఇప్పటిదాకా వచ్చి న టైమ్ ట్రావెల్ చిత్రాలకు ఈ సినిమాకు ఉన్న తేడా ఏంటి,మన తెలుగు వాళ్లకు నచ్చే కంటెంట్ ఉన్న సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

mark antony

స్టోరీ లైన్:
 

మార్క్ (విశాల్)తండ్రి  ఆంటోనీ (విశాల్) ఒకప్పుడు పెద్ద గ్యాంగస్టర్. అయితే ఓ గొడవలో చనిపోతాడు. దాంతో ఆంటోని  క్లోజ్ ప్రెండ్ ఇంకో  గ్యాంగస్టర్ అయిన ..జాకీ మార్తాండ (ఎస్.జె. సూర్య)..మార్క్ ని చేరతీసి పెంచుతూంటాడు. మార్క్...తండ్రిలా గ్యాంగస్టర్ కాకుండా ఓ మెకానిక్ అవుతాడు. అయితే మార్క్ కు ఓ పగ ఉంటుంది. తన తల్లిని చంపిన తండ్రిపై పీకల దాకా కోపం ఉంటుంది. కానీ  చనిపోయిన తండ్రిని ఏమీ చెయ్యలేడు కదా. అయితే టైమ్ ట్రావెల్ అతనికి ఆ అవకాసం ఇస్తుంది.  టైమ్ ట్రావెల్ ఫోన్ ద్వారా తన తండ్రిపై పగ తీర్చుకునే అవకాసం వస్తుంది. అయితే ఈ క్రమంలో తన తండ్రి గురించి షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి...  ఫోన్ టైమ్ ట్రైవల్ కాన్సెప్టు ఏమిటి... తన తండ్రి ఆంటోనిపై పగ తీర్చుకున్నాడా .. ? ఈ కథలో సిల్క్ స్మిత, ఏకాంబరం (సునీల్), రమ్య (రీతూ వర్మ), వేదవల్లి (అభినయ) క్యారక్టర్స్  ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


mark antony


ఎనాలసిస్ 

 OTT ప్లాట్ ఫామ్స్ వచ్చాక ఫక్తు మసాలా కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా  విభిన్నమైన ఆలోచనలు, genre ఫిల్మ్స్ తో ఆలోచించే స్వాతంత్ర్యం వచ్చింది మేకర్స్ కు. అందులోనూ ఒకే genre కు ఫిక్స్ కాకుండా రెండు మూడు genre ని బ్లెండ్ చేసి మరీ రూపొందిస్తున్నారు.  ఈ చిత్రం ఓ ప్రాపర్ బ్లాక్ కామెడీ యాక్షన్   గా రూపొందించారు. రెండు కాలాల మధ్య సినిమా షిప్ట్ అవటం దగ్గర నుంచి అక్కడ జరిగే సిట్యువేషన్స్ దాకా కొత్తగా ట్రీట్ చేసే  ప్రయత్నం చేసారు. అయితే ఈ క్రమంలో రిపీట్ ఎక్కువైపోతోందని, సినిమా లౌడ్ గా ఉంటోందని గమనించలేదు. సినిమా ప్రారంభమై దర్శకుడు కాస్త ఛాదస్తంగా మొదలెడతాడు. మనకు అర్దంకాక ఇబ్బంది పడతామేమో అని ..ఫోన్ టైమ్ ట్రావెల్ ,రూల్స్, ఉదాహరణలు చెప్పుకొస్తాడు. అలాగే స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ వెళ్తాడు. అసలే ఆ టైన్ ట్రావెల్ కొత్త, తమిళ ఫేస్ లు ఎడ్జెస్ట్ అటయ్యి అర్దం చేసుకుంటూంటే మధ్యలో ట్విస్ట్ లు . 

 కొత్త కాన్సెప్టుని పాతగా అంటే అర్దమయ్యేలా చెప్పాలి. పాత కాన్సెప్టుని కొత్త స్క్రీన్ ప్లే తో చెప్తూ ఆశ్చర్యపరిచాలి అనే రూల్ ని మర్చిపోయినట్లున్నారు. ఇవన్నీ చాలదన్నట్లు   కొన్ని చోట్ల మరీ అరవ అతి ఎక్కువై అది కథపై మన క్యూరియాసిటీని కిల్ చేసే పోగ్రాం పెట్టుకుంది.  టైమ్ ట్రావెల్ థీమ్, భారీ యాక్షన్ సీన్స్ , సైన్స్ ఫిక్షన్ అంశాలు, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ మనకు నచ్చుతుంది. మిగతాదంతా మామూలుగా ఉంటుంది.   తండ్రీ, కొడుకుల మ‌ధ్య సాగే  ఎమోష‌న‌ల్ మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.  80-90 ద‌శ‌కంలో ఓ ఊపు ఊపిన సిల్క్ స్మిత పాత్ర‌ను కూడా ఇందులో చూపించటం బాగుంది. ఆమె పాత్ర స్పెష‌ల్ సాంగ్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం కానీ అదేమీ ఉండదు. ఫస్టాఫ్ కాస్త భారంగానే అనిపిస్తుంది. సెకండాఫ్ కు వచ్చేసరికి మనకు అసలేం జరుగుతోందో అర్దమై ఆ డ్రామా తెలిసి, ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే అదీ పాక్షికంగానే. అనుకున్న స్దాయిలో కామెడీ అయితే వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ జస్ట్ ఓకే.సెకండాఫ్ ఓకే అన్నట్లు సాగుతుంది. 

Mark Antony


ఎవరెలా చేసారంటే...

సినిమా హోల్ అండ్ సోల్ గా  వెర్సటైల్ డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ ఎస్ జే సూర్య దే. అతను విలన్ అయినా హీరోలా అనిపిస్తాడు. తన నట విశ్వరూపం చూపించాడంటే అతి శయోక్తి కాదు. విశాల్ లుక్ డిఫరెంట్ గా ట్రై చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో గుండుతో స్టైల్ గా నడుచుకుంటూ రావటం గమ్మత్తుగా ఉంటుంది.కానీ ఎస్ జై సూర్య ముందు తేలిపోయాడు.  సునీల్ మనకు కొత్త అనిపించడు. తమిళవాళ్లకు నచ్చుతాడేమో మరి. టైమ్ ట్రావెల్  ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త పాత్రలో సెల్వ రాఘవన్ గెటప్ బాగుంది కానీ చేయటానికి ఏమీ లేదు. హీరోయిన్ రీతూ వర్మ నామ్ కే వాస్తే. YG మహేంద్రన్ పాత్ర అయితే పరమ చెత్త. 

Mark Antony Trailer


టెక్నికల్ గా చూస్తే...

ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ శాతం మన నెత్తిమీద కర్ర పుచ్చుకు కొడుతున్నట్లు ఉంది. పాట‌ల్లో గుర్తుంచుకొనే ట్యూన్ ఒక్క‌టీ లేదు. ఒక్క పాట హిట్ట‌యినా….థియేట‌ర్లో ఆ కిక్, మూడ్ వేరే విధంగా ఉండేది. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు. అవి ఎక్కువై వెగటు కలిగిస్తాయి.  సినిమాటోగ్ర‌ఫీ, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌.. బాగున్నాయి. 


Final Thoughts

ఈ సినిమా నిజానికి ఓ పిచ్చి(MAd) ప్రపంచం. అందులోకి పూర్తిగా వెళ్లగలిగితేనే ఎంజాయ్ చేస్తాం. లేకపోతే ఈ సినిమా ఏంటి ఇంత గజిబిజిగా,లౌడ్ గా ఉందేంటి అని తలపట్టుకు బయిటకువస్తాం. 

Rating:2.5
సూర్య ప్రకాష్ జోశ్యుల

న‌టీన‌టులు: విశాల్, ఎస్‌.జె.సూర్య‌, సునీల్, సెల్వ రాఘ‌వ‌న్‌, రీతూ వ‌ర్మ‌, అభిన‌య‌, కింగ్ స్లే, వై.జి.మ‌హేంద్ర‌న్ త‌దిత‌రులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్
డి.ఓ.పి: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్
నిర్మాత: ఎస్ వినోద్ కుమార్
విడుదల  తేదీ : సెప్టెంబ‌ర్ 15, 2023

Latest Videos

click me!