నాని 'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ

First Published | Aug 29, 2024, 1:50 PM IST

 నాని నమ్మి ఇచ్చిన ఆ అవకాశాన్ని దర్శకుడు వివేక్ ..వివేకంతో వినియోగించుకున్నాడా లేదా అన్నది రివ్యూ లో చూద్దాం.
 

Nani, Saripodhaa Sanivaaram, Movie Review

ఒక హీరో తనకు ప్లాఫ్ ఇచ్చినా సరే ఆ దర్శకుడుతో మరో సినిమా అదీ భారీ బడ్జెట్, అది కూడా తను సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇచ్చాడంటే ఎంత నమ్మకం ఉండాలి. ఆ డైరక్టర్ టాలెంట్ ను హీరో ఎంత విశ్వసించి ఉండాలి. అదే నాని, వివేక్ ఆత్రేయ విషయంలో జరుగుతోంది. తనకు అంటే సుందరానికి వంటి సినిమా ఇచ్చినా సరే పిలిచి మరి మరో కర్షియల్ ప్రాజెక్టుకు అవకాసం ఇచ్చి ఓ దర్శకుడులో ఉన్న టాలెంట్ ని సంపూర్తిగా ప్రపంచానికి తెలియచేయాలనుకోవటం నాని గొప్పతనం. మరి నాని నమ్మి ఇచ్చిన ఆ అవకాశాన్ని దర్శకుడు వివేక్ ..వివేకంతో వినియోగించుకున్నాడా లేదా అన్నది రివ్యూ లో చూద్దాం.
 

Saripodhaa Sanivaaram review

స్టోరీ లైన్

ఎల్ ఐ సీ ఏజెంట్ ...చిన్ను అలియాస్ సూర్య (నాని)కి చిన్నప్పటి నుంచీ విపరీతమైన కోపం. ఆ కోపాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి చాయా దేవీ (అభిరామి) ప్రయత్నాలు చేస్తుంది. ఈ లోగా ఈలోగా కాన్సర్ తో ఆమె తన కొడుక్కు దూరం అయ్యే పరిస్దితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో కోపం నుంచి తన కొడుకుని దూరం చెయ్యకపోతే కష్టమని ఓ కండీషన్ లాంటి మాట తీసుకుంటుంది. ప్రతీ రోజు , ప్రతీ క్షణం కోపం చూపెట్టడం కన్నా ... వారంలో  ఓ రోజు అతని కోపాన్ని ప్రదర్శించమని అడుగుతుంది.తల్లికి ఇచ్చిన మాట ప్రకారం శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించటానికి  సూర్య ఫిక్స్ అవుతాడు. వారంలో జరిగిన విషయాలను చూసుకుని శనివారం నాడు తన కోపం ప్రదర్శించాలా వద్దా అని చూసుకుని ముందుకు వెళ్తూంటాడు. ఓ రకంగా యాంగర్ మేనేజ్మెంట్ అన్నమాట.  
 


Nani


ఇదిలా ఉంటే సోకులపాలెంలో విలన్  ఎస్సై దయానంద్ (ఎస్ జే సూర్య) కోపిష్టి మనిషి, అలాగే ఓ సైకో మనస్తత్వం ఉన్నవాడు. తన అధికారన్ని అడ్డం పెట్టుకుని శాడిజం జనాలపై చూపిస్తూంటాడు. తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ (మురళీ శర్మ)తో ల్యాండ్ సమస్యలు ఉంటాయి. దాంతో అతన్ని ఏమి చేయలేక, అతనికి ఓట్లేసిన సోకులపాలం జనాలపై తన ప్రతాపం చూపెడుతూంటాడు. 

Saripodhaa Sanivaaram


ఇక మన హీరో సూర్య ని   చారులత(ప్రియాంక మోహన్) ఇష్టపడుతూంటుంది. ఆమె ఎస్సై దయానంద్ స్టేషన్ లో పనిచేస్తూంటుంది. ఆమెకు మిత మీరిన హింస అంటే పడదు. ఆమె తమ ఎస్సైను అసహ్యించుకుంటుంది. ఈ క్రమంలో సూర్య శనివారం సీక్రెట్ తెలిస్తుంది ఆమెకు. ఈ క్రమంలో దయానంద్ ని  ఎదుర్కోవాలని సూర్య ఫిక్స్ అవుతాడు. చారులత సాయింతో సూర్య ఓ ప్లాన్ చేసి దయానంద్ ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏమైంది. ఈ ప్లాన్ లో దయానంద్ సోదరుడు ఎమ్మల్యే కూర్మాచలం ని ఇంక్లూడ్ చేస్తాడు. అప్పుడు ఏమైంది. సైకోలాంటి దయానంద్ ని సూర్య ఎదిరించగలిగాడా..అలాగే దయానంద్ కు ...సూర్య కేవలం శనివారం మాత్రమే రివేంజ్ కు దిగుతాడు అనే విషయం ఎప్పుడు తెలిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

Saripodhaa Sanivaaram

 


ఎలా ఉంది

వాస్తవానికి ఇది కొత్త కథేమీ కాదు. కానీ నాని క్యారక్టరైజేషన్ లో కేవలం శనివారం మాత్రం తన కోపాన్ని ప్రదర్శిస్తాడు అనే విషయాన్ని  ఎస్టాబ్లిష్ చేయటమే కొత్త మ్యాటర్. అలాగే విలన్ దయానంద్ పాత్రను సైతం బాగా డిజైన్ చేసారు. ఈ రెండు పాత్రల నడుమ కథ ను నడిపించారు. పై నుంచి చూస్తే విలన్ ,హీరో కథే. అయితే రెండు క్యారక్టరైజేషన్స్ మధ్య జరిగిన కథగా చూస్తే కొత్తగా అనిపిస్తుంది. అయితే కథను సెటప్ చేసి, క్యారక్టర్స్ పరిచయం చేసేందుకు ఫస్టాఫ్ మేగ్జిమం టైమ్ తీసుకుని, ఇంటర్వెల్ కు కాంప్లిక్ట్ లో కి కథని తీసుకొచ్చారు. దాంతో ఫస్టాఫ్ పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. సెకండాఫ్ లోనే మొత్తం కథ అంతా నడుస్తుంది. 

Saripodhaa Sanivaaram


అయితే అక్కడ కూడా విలన్ కు హీరో కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించే పోగ్రామ్ పెట్టుకుంటాడనే విషయం తెలియటానికి టైమ్ తీసుకున్నాడు. నిజానికి అదే కథలో పెద్ద మలుపు. అలాగే అది తెలిసిన తర్వాత కూడా హీరో అంత తేల్చటానికి వారంలో మిగతా రోజులను విలన్ ఉపయోగించుకోడు. అలాగే మొదటి నుంచితండ్రి పాత్ర ..హీరో కోపాన్ని అదుపు చేయాలని చూసి చివర్లో వెళ్లు రెచ్చిపో అనటం కూడా చాలా సార్లు చూసిందే కావటంతో పెద్దగా ఎక్సైటింగ్ గా అనిపించదు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ సాయికుమార్ తో నడుస్తూ విసిగిస్తుంది. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే... నవలలో లాగ అధ్యాయాలుగా సినిమాలను విడగొట్టి చూపించటం. సినిమా టైటిల్స్ నుంచి... “మొదలు, మలుపు, పీటముడి, ఆటవిడుపు, ముగింపు” అంటూ  కార్ట్స్ వేస్తూ ముందుకు వెళ్తాడు. ఈ విషయం విభిన్నంగా అనిపిస్తుంది. 


టెక్నికల్ గా...

సినిమా రైటింగ్ పరంగా కొత్తగా ట్రై చేసే ప్రయత్నం చేసారు దర్శకుడు. శాస్త్రోక్తంగా రూల్స్ ప్రకారం సినిమా స్క్రిప్టుని రాసుకుని, విభజించి ముందుకు వెళ్ళారు కానీ కొన్ని ఎపిసోడ్స్ లెంగ్త్ ఎక్కువ అవుతున్నాయి. బోర్ కొడతాయనే విషయం పట్టించుకోలేదు.  అంటే సుందరానికి తరహాలోనే మంచి ఎపిసోడ్స్ కూడా కొన్ని సాగతీసిన ఫీలింగ్ వచ్చాయి.  సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా కలిసి రాని వ్యవహారమే. ఇక స్క్రిప్టు విషయం ప్రక్కన పెడితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజిలో ఉంది. మురళి సినిమాటోగ్రఫీ అద్బుతం కాదు కానీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త షార్ప్ ఉండాలనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి.

Actor Nani starrer new film titled Saripodha Sanivaaram


నటీనటుల్లో 

నాని ఎప్పటిలాగే సినిమాని మోసాడు అనలేం. ఎందుకంటే అతనికి పోటీగా ఎస్ జే సూర్య అదరకొట్టారు. సైకో పోలీస్ గా నట విశ్వరూపం చూపెట్టారు. కొన్నిసార్లు నాని కనపడలేదు. సూర్యనే హైలెట్ అవుతారు. ఇక ప్రియాంక మోహన్ పెద్దగా గుర్తుండే పాత్ర కాదు. మురళి శర్మ, అజయ్ ఘోష్, సాయి కుమార్ వంటి ఆర్టిస్ట్ లు ఎప్పటిలాగే ఫెరఫెక్ట్ గా చేసుకుంటూ పోయారు.
 

Nani, Saripodhaa Sanivaaram, Movie Review

ఫైనల్ థాట్

వివేక్ ఆత్రేయలో ఉన్న విషయాన్ని ...,డిటేలింగ్  హైలెట్  కానివ్వటం లేదు. ఎంత తక్కువలో ఎంత ఎక్కువ విషయం చెప్పాలమన్నదే నిజమైన ఆర్ట్. 

నాని కోసం, ఎస్ జె సూర్య కోసం చూడచ్చు, శనివారం ఏదో జరుగుతుందని మాత్రం ఎక్కువ ఎక్సపెక్ట్ చేయద్దు.

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.75

Nani, Saripodhaa Sanivaaram, Movie Review

తెర వెనుక..ముందు

నటీనటులు: నాని, ప్రియాంక మోహన్‌; అభిరామి, అదితి బాలన్‌, పి.సాయికుమార్‌,  మురళీ శర్మ, అజయ్‌ తదితరులు;

సంగీతం: జేక్స్‌ బిజోయ్‌;

ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌;

సినిమాటోగ్రఫీ: జి.మురళి;

నిర్మాత: డీవీవీ దానయ్య;

రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ;

విడుదల: 29-08-2024

Latest Videos

click me!