గురి తప్పిన ...‘గాండీవధారి అర్జున’రివ్యూ

First Published | Aug 25, 2023, 12:55 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ లో  విజువల్స్, మేకింగ్ వీడియోలు చూస్తుంటే ఏదో మంచి స్పై థ్రిల్లర్ చూడబోతున్నారని అంచనాలుకు వస్తాం. కానీ నిజానికి సినిమాలో ఉన్నదేంటి

Gandeevadhari Arjuna movie review


మన సినిమాలు ఇప్పుడు ప్యాన్ ఇండియా స్దాయిలో తయారై ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో అందరినీ ఆకట్టుకునే కథాంశాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం ఫిల్మ్ మేకర్స్. అయితే అందరినీ..అన్ని ప్రాంతాల వారిని మెప్పించాలనే ప్రయత్నంలో కొందరు తడబడుతున్నారు.  కొందరు సక్సెస్ అవుతున్నారు. ఈ సినిమా కూడా అదే విధంగా వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. వారి టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవుతారా... ఏ మేరకు ఈ సినిమా వర్కవుట్ అవుతుంది. అసలు కథేంటి?

Gandeevadhari Arjuna Review


స్టోరీ లైన్

లండన్ లో ఈ కథ ఎక్కువ శాతం జరుగుతూంటుంది. అక్కడ జరిగే ఎన్విరాల గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనటానికి  సెంట్రల్ మినిస్టర్  ఆదిత్య రాజ్ బహాదుర్ (నాజర్)  వెళ్తారు. ఆ సమ్మిట్ లో ఆయన సబ్మిట్ చేసే ఓ రిపోర్ట్ తో ఓ భారీ కంపెనీ మూత పడే పరిస్దితి ఉంటుంది. దాంతో ఆ కంపెనీ ఓనర్  రణ్‌వీర్ (వినయ్ రాయ్) ఎలర్ట్ అవుతాడు. ఆదిత్య రాజ్ ని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా ఆపాలనుకుంటాడు. ఆయనపై ఎటాక్ లు చేయటం మొదలెడతాడు. అప్పుడు ఆయనకు సెక్యూరిటీగా  అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ని నియమిస్తారు. ప్రముఖులకు బాడీగార్డ్‌లను నియమించే ESSAY అనే సంస్థలో అర్జున్ ఓ సభ్యుడిగా కనిపిస్తారు. సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌.  ఆయన్ను రక్షించే క్రమంలో తాను కేవలం ఆయన్నే కాకుండా దేశంలో చాలా మంది ప్రాణాలు రక్షించబోతున్నానని తెలుసుకుంటాడు. తన ప్రాణం అడ్డు పెట్టైనా   ఆ రిపోర్ట్ ని ఆ సమ్మిట్ లో ప్రెజెంట్ చేసాలా చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో విలన్ రణ్ వీర్ ఏం చేసారు... అతన్ని నుంచి మినిస్టర్ ని ఎలా రక్షించాడు. అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది ...అతని లవర్ ఐరా (సాక్షి వైద్య)కు అర్జున్ కు మధ్య బ్రేకప్ కు కారణమేంటి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
 


Gandeevadhari Arjuna Review


విశ్లేషణ

నిజానికి ఈ సినిమాలో తీసుకున్న పాయింట్ చాలా గొప్పది. మనమంతా ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వస్తువులు కొని వాడేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ ఎక్కడికి పోతుందో ఆలోచించడం లేదు.అలాగే మెడికల్  వేస్టేజి కూడా బాగా ఎక్కువైంది. అందుకు మార్గం వెతకాలి. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి ఆ వేస్టేజ్ ని తీసుకొచ్చి మనలాంటి దేశాల్లో డంప్ చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్ కూడా కొంచెం అటూ ఇటూగా సూర్య 'సింగం 3'లో టచ్ చేసారు. అయితే అక్కడ నేరేషన్ వేరు. ఇక్కడ వేరు. కానీ ఇక్కడ  ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా కథను నడిపించారు. అదే విసుగెత్తించింది. పాయింట్ గా బాగున్నా..విస్తరణలో ప్రక్కదారి పట్టేసింది. సగటు ప్రేక్షకుడుని ఆకట్టుకునే విథంగా డిజైన్ చేయలేదు.   పూర్తిగా ప్లాట్ గా సాగే స్క్రీన్ ప్లే నేరేషన్ విసిగిస్తుంది. అలాగే నేటివిటి సమస్య కూడా ఈ సినిమా కు కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా తీయాలనే తాపత్రయంలో లొకేషన్స్ మనవి కావు..అలాగే  ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడించటం చేసారు. దాంతో ఏదో వేరే భాష డబ్బింగ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. 

Gandeevadhari Arjuna Review


ఇక ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు 10 కారణాలున్నాయంటూ కొన్ని రోజుల కిత్రం మేకర్స్‌ ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేశారు. అవేంటంటే: యాక్షన్‌, స్టోరీ, లవ్‌, ఛేజింగ్స్‌, క్యారెక్టర్స్‌, ఇంటర్నేషనల్‌ లోకేషన్స్‌, ఫైట్స్‌, గన్స్‌, ఎమోషన్స్‌, ఘర్షణలు. అయితే ఈ సినిమాలో ఈ పది ఉన్నాయి కానీ అవి ప్రోపర్ గా కథను అనుసరించి లేవు. ముఖ్యంగా ఫైటింగ్స్ ఉన్నాయి ఉన్నాయి కానీ విలన్ ,హీరో  కలుసుకునే లాస్ట్ షాట్ దాకా (క్లైమాక్స్ లో...) విలన్ కు ఇతనెవరో తెలియదు. అంటే తనను ఫలానా వాడు చంపాలని తిరుగుతున్నాడనే విషయం విలన్ కు తెలియనప్పుడు అతను హీరోని ఎలా టార్గెట్ చేయగలుగుతాడు. అది జరగనప్పుడు హీరో,విలన్ మధ్య రియల్ కాంప్లిక్ట్స్ ఎలా ఉంటుంది. అప్పుడు బోర్ కొట్టక ఏం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా విలన్ ని చేసే దుర్మార్గపు పనిని ఆపి దేశాన్ని రక్షించే కథే. అప్పుడు హీరో టార్గెట్ విలనే. విలన్ ఇంటర్నేషనల్ గా పెద్ద వ్యక్తే. కానీ అతన్ని చేరుకునేటప్పటికే కథ అయ్యిపోతే ఎలా...గాండీవం పట్టుకుని ఎవరిని గురి చూసి కొట్టాలో తెలియక దిక్కులు చూసి చివర్లో మమ అనిపించినట్లు గా ఇంటర్నేషనల్ స్దాయి బిజినెస్ చేసే  విలన్ ని వీధిరౌడిని చంపినట్లు చంపేసారు. 

Gandeevadhari Arjuna Review


ఫస్ట్ హాఫ్ ప్లాష్ బ్యాక్  లో వచ్చే హీరో లవ్ ఎపిసోడ్  సీన్లు ఏమీ అలరించవు.  అలాగే విలన్ ట్రాక్ కూడా  చాలా ఇరిటేషన్ గా తయరయ్యాయి. సెకండాఫ్ లో ఫన్ కోసం పెట్టిన అభినవ్ గోమటం సీన్స్ అయితే ఎందుకు పెట్టారో అర్దం కావు.  నిఖిల్ స్పై చూసి రాసుకున్నట్లున్నారు ఆ ఎపిసోడ్స్ అనిపిస్తుంది. అక్కడా గోమఠం తోనే నడిపారు. అదే ఇక్కడా రిపీట్ అయ్యింది.  ఇక హీరోయిన్  ట్రాక్ ఐతే శుద్ధ దండగ. గ్లామర్ వైజ్ కలిసిరాలేదు. కథకు కలిసి రాదు. హీరోతో ప్రేమ అపార్దం..చివరకు కలవటం.  ప్రతి సీన్ లో వరుణ్ తేజ్ కనిపిస్తుంటారు తప్పితే అందులో ఏమీ జరిగినట్లు వుండదు.  ఫస్ట్ ఆఫ్‌ అంతే ..సెకండాఫ్ చూసేది మన అంతే.

Gandeevadhari Arjuna Review

టెక్నికల్ గా..

ఈ సినిమాలో ఏకైక హైలెట్ కెమెరా వర్క్. హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు.  ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రీరికార్డింగ్ బాగుంది  కానీ కంటెంట్ లో అందుకు తగ్గ ఎమోషన్ లేదు. పాటలు అయితే అసలు గుర్తే ఉండవు.   డైలాగులు సోసోగా ఉన్నాయి. క్లైమాక్స్ లో నాజర్ స్పీచ్ అయితే ఉపన్యాసమే. సినిమా అనే విషయం మర్చిపోయారు.  ఎడిటింగ్ ఓకే.  స్క్రిప్టు బాగోనప్పుడు డైరక్షన్ గురించి ఏమీ మాట్లాడటానికి ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బాగా ఖర్చు పెట్టారు.

Gandeevadhari Arjuna Review

 
నటీనటుల్లో ..

ఇందులో ఎక్కడా వరుణ్ తేజ్ చాలా స్టైలిష్ గా కొత్తగా కనిపించాడు. ఇలాంటి పాత్ర చేయడం అతనికి కొత్త అయినా నల్లేరు మీద‌ నడకలా సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక నాసర్, విమలారామన్, వినయరాయ్ వంటి తెలుసున్న ఆర్టిస్ట్ లు ఉండటం కొంత కలిసి వచ్చింది. వాళ్ల ఎక్సపీరియన్స్ సీన్స్ లో పెద్ద విషయం లేకపోయినా నడిచిపోయేలా చేసింది. 

 
ప్లస్ లు 

వరణ్ తేజ్
క్యూట్ గా అనిపించే సాక్షి వైద్య
సినిమాలో చెప్పటానికి ప్రయత్నించిన మెసేజ్

మైనస్ లు
బోర్ కొట్టే స్కీన్ ప్లే
ఎక్కడా ట్విస్ట్ లు, టర్న్ లు లేని ప్లాట్ నేరేషన్

ఫైనల్ థాట్

 సినిమా కాన్సెప్టు దేశ దేశాల చెత్తను భారతదేశంలో పోసేసి మనకు హాని చేస్తున్నారని, అయితే ఈ  ప్రాసెస్ లో తాము చెత్తగా అనిపించే కథను ఈ సినిమా పేరు చెప్పి మన మీదకు విసురుతున్నామని భావించినట్లు లేరు. 
--సూర్య ప్రకాష్ జోశ్యుల

రేటింగ్ : 2 /5
 


ఎవరెవరు..

నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, వినయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్‌, రోషిణి ప్రకాష్‌ తదితరులు
ఛాయాగ్రహణం : ముఖేష్ జి
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023

Latest Videos

click me!