రానా, వెంకటేష్ 'రానా నాయుడు' తెలుగు రివ్యూ

First Published | Mar 10, 2023, 4:09 PM IST


నీవు పుట్టిన తర్వాత నేను ఐదేండ్లు ముడ్డి కడిగాను. అక్కడ నీకు ఎంత మగతనం ఉంటుందో.. ఎంత చెడు ఉంటుందో నాకు తెలుసు అంటూ వెంకీ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇంకా ఇలాంటివి ఈ సీరిస్ లో ఏమన్నా ఉన్నాయా...

Rana Naidu review

కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ క్రేజీగా ఉంటాయి. అందులోనూ తెర వెనక బంధుత్వం ఉన్న స్టార్స్  తెరపై కలిపి నటిస్తూంటే ప్రేక్షకులు కిక్ ఫీలవుతూంటారు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రానా, తన బాబాయ్ స్టార్ హీరో వెంకటేష్ తో కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో రానా హీరోగా చేసిన కృష్ణం వందే జగద్గురుం లో వెంకి గెస్ట్ గా కనిపించారు. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరు కలిసి అవకాసం ఇన్నాళ్లు దాకా రాలేదు. ఈసారి ఓ వెబ్ సీరిస్ రూపంలో ఈ కాంబో మన ముందుకు వచ్చింది.  నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్  అవుతున్న ఈ సిరీస్‌లో రానా, వెంకటేష్ తొలిసారి నటిస్తుండటంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ బాబాయ్..అబ్బాయ్ ఆ క్రేజ్ ని నెక్ట్స్ లెలివ్ కు తీసుకెళ్లారా... ఫ్యామిలీ, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సీరిస్ ఎలా ఉందంటే..

స్టోరీ లైన్:

రానా నాయుడు(రానా) బాలీవుడ్ లో వచ్చే ఎలాంటి  స్కాండిల్ ని అయినా చాలా ఈజీగా ఫిక్స్ చేస్తూంటాడు.సెలబ్రెటీలు అతనికి పెద్ద పెద్ద ఎమౌంట్స్ ఇచ్చి పోషిస్తూంటారు. అతని క్లైయింట్స్ ని సేవ్ చేయటానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. ఎలాంటి పనికైనా ఒడిగడతాడు. అయితే ఎంత పెద్ద సమస్యను అయినా చిటికెలో పరిష్కరించగలిగే అతనికి తన తండ్రి నాగ నాయుడు (వెంకటేష్ ) పెద్ద సమస్యగా మారతాడు.  హైదరాబాద్ చంచల్ గూడా జైలు నుంచి ఐదేళ్లు ముందే బయిటకు వచ్చి, ముంబైలో వెలిగిపోతున్న తన కొడుకు రానా దగ్గరకు వస్తాడు.  అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... నాగను జైలుకు పంపింది అతని కొడుకే.  గతంలో  ఒక అమ్మాయిని హత్య చేసినట్లు   తండ్రిపై తప్పుడు కేసు పెట్టి ఇరికించి జైలుకు పంపుతాడు. వాస్తవానికి, ఇది బాలీవుడ్ స్టార్ ప్రిన్స్ (అనుజ్ ఖురానా)  యాక్సిడెంటల్ గా చేసిన హత్య.  ఈ విషయం తెలిసిన నాగ తన కొడుకుని ఎలా డీల్ చేసాడు. అసలు రానా కు తన తండ్రినే జైలుకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది. తన ప్యామిలీ విషయంలో చాలా ప్రేమగా ఉండే రానా తన తండ్రి విషయంలో ఎందుకు అంత కఠినంగా వ్యవహించాడు వంటి విషయాలు తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.
 

Latest Videos


Rana naidu

విశ్లేషణ:

రానా నాయుడు వెబ్ సీరిస్ 2013 లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సీరిస్  Ray Donovan కు రీమేక్ గా వచ్చింది. స్కాండిల్స్, సెకండ్ థాట్ లేకుండా పేలే గన్స్ తో,కుప్పల తెప్పలుగా ఉండే డబ్బు చుట్టూ  ఈ సీరిస్ అనర్గళంగా సాగుతుంది. దాన్నే ఇండియన్ వెర్షన్ గా మార్చి చేసారు.న్యూయార్క్ కాస్తా ఇక్కడ ముంబై గా రూపొందింది. అయితే కథగా ఇది మనకు ఇంతకు ముందు చూడనది. రెగ్యులర్ గా ఇంగ్లీష్ వెబ్ సీరిస్ లు చూసేవారికి ఇబ్బంది కాదు కానీ తెలుగులో చూద్దామనుకుని కూర్చునే వారికి రానా, వెంకటేష్ లను ఆ పాత్రలలో చూసి జీర్ణించుకోవటం కాస్త ఇబ్బంది. అలాగే  ఈ సీరిస్ ఏ నేపధ్యంలో సాగుతోంది అని మనకు అర్దం కావటానికి కొంత టైమ్ పడుతుంది. ఒకటిన్నర లేదా రెండు ఎపిసోడ్స్ జరిగేదాకా మనకు క్లారిటీ రాదు. అక్కడ నుంచి మనం ఎంగేజ్ అవుతాము. అయితే ఓ సారి కనెక్ట్ అయితే మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అలాగే కథ ముందుకు వెళ్ళే కొలిది కొత్త మలుపులతో మరింత డెప్త్ గా  అర్దమవుతుంది. క్యారక్టర్స్ మనస్సు లోతుల నుంచి ఈ కథ కనెక్ట్ అయ్యి ఉంటుంది. 

Image: Still from the teaser


పైపైన చూస్తే క్యారక్టర్  డైనమిక్స్ అర్దం కావు. ముఖ్యంగా అసలు హీరో ఎవరు..విలన్ ఎవరు..తండ్రి, కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి..ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అనేది తెలియాలంటే టైమ్ పడుతుంది. చివరి రెండు ఎపిసోడ్స్ లోకి కథ ప్రవేశించేసరికి మనకు డ్రామా పూర్తిగా ఎలివేట్ అయ్యి..ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చో బెడతారు. అయితే ఇదంతా ఈ పాత్రలు మనకు కనెక్ట్ అయ్యితేనే. లేకపోతే ఏదో హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టిమనకు చివరి రెండు ఎపిసోడ్సే ఎనర్జిటిక్ గా ఇంట్రస్టింగ్ గా ఉన్నట్లు అనిపించటంలో వింతేమీ లేదు. మొదటి ఎనిమిది ఎపిసోడ్స్ రకరకాల పాత్రలు, వాటి మధ్య రిలేషన్స్, కాంప్లిక్ట్స్ లను ఎస్టాబ్లిష్ చేస్తుంది. కొన్ని పాత్రలు అయితే సడెన్ గా ప్రత్యక్ష్యం అయ్యి..అంతే సడెన్ గా మాయమైపోతూంటాయి.కొన్ని పాత్రలు అయితే మనకు వింతగా కూడ అనిపిస్తాయి. ముఖ్యంగా స్పిరుట్యువల్ గురు పాత్ర అయితే మరీను. అలాగే మరికొన్ని పాత్రలు అయితే ముందు ఎపిసోడ్స్ లో ఏదన్నా ప్రత్యేకత కలిగి ఉంటాయేమో అన్నట్లు బిహేవ్ చేస్తూంటాయి. అంత ఏమీ లేదని మెల్లి మెల్లిగా అర్దమవుతుంది. 

క్లైమాక్స్ ఈ సీరిస్ కు ప్రాణం

దాదాపు ప్రతీ సినిమాకు ,సీరిస్ కు క్లైమాక్స్ ప్రాణంగా నిలుస్తూంటుంది. ఈ సీరిస్ కు అలాగే జరిగింది. క్లైమాక్స్ బాగుండటంతో అప్పటిదాకా జరిగినదంతా ఎలా ఉన్నా చివర్లో పూర్తి గా హ్యాపీ ఫీలవుతాము. మనం మన సిస్టమ్ లేదా ల్యాప్ టాప్ ని ఓ చిన్న స్మైల్ తో మూస్తాము. కొన్ని మైనస్ లు ఉండవచ్చు కానీ క్లైమాక్స్ వాటన్నటినీ కవర్ చేస్తుంది. కొంత స్టీరియో టైప్ ని మనం మర్చిపోగలిగితే మనని ఈ సీరిస్ నిరాశ పరచదు. అక్కడక్కడా సర్పైజ్ లుతో ఉన్న ఈ సీరిస్ ..మనకు రెగ్యులర్ వెబ్ సీరిస్ లకు భిన్నంగా ఉంది అనిపిస్తుంది.

టెక్నికల్ గా...

నెట్ ప్లిక్స్ మంచి స్టార్డర్డ్స్ ఉన్న టెక్నీషియన్స్ తో ఈ ప్రొడక్షన్ చేసింది. అందులోనూ రీమేక్ కావటంతో దర్శకుడు ఒరిజనల్ ని ఇంప్రవైజ్ చేసి అందించారని అర్దమవుతుంది.  ఇది ఫెరఫెక్ట్ రాసిన స్క్రిప్టు. రెండు ప్రధాన పాత్రలను బాలెన్స్ చేసారు. క్రైమ్ డ్రామాని జాగ్రత్తగా డీల్ చేసారు. డైలాగులో రూపంలో కాస్త ఓవర్ అయ్యారు కానీ మిగతాదంతా ఓకేనే. ఇందులో ఉన్న ప్రెడిక్టుబల్ టర్న్ లు, ఓటిటి డ్రామా అని గుర్తు చేసే సీన్స్  కొంత ఇబ్బంది పెడతాయి. ఎడిటింగ్ రెండు మూడు ఎపిసోడ్స్ తీసేసినా బాగుండును అనిపిస్తుంది. రానా పాత్ర మరింత  తక్కువ సీన్స్ తో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా చూడాల్సింది .   కెమెరా వర్క్, రైటింగ్ బ్రిలియంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి నెట్ ప్లిక్స్ వైపు నుంచి ప్రత్యేకంగా చెప్పేదేముంది. 

Rana Naidu review

రానా .. భళ్లాళ దేవ స్దాయిలో

రానా ఈ సీరిస్ లో గతంలో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు. చాలా నెగిటివ్ గా కనిపించే పాత్ర వెనక ఉండే ఎమోషన్ ని తన కళ్లతో పలకిస్తాడు. తండ్రి,కొడుకుల సంక్లిష్టమైన కెమిస్ట్రీని బాగా పండిచారు. అదిరిపోయే ఫెరఫార్మెన్స్ అంటారే అది వెంకీ,రానాలు ఇద్దరూ పోటీ పడి మరీ ఇచ్చారు. ఇండియన్ వెర్షన్ కు రానా తగ్గ ఈ రీమేక్ లో మరొకరు మనకు కనపడరనే అంతలా పండించాడు.

వెంకీ అదిరిపోయే ఫామ్ లో ..

ఓ డిఫరెంట్ ఫాధర్ క్యారక్టర్ వెంకటేష్ ది. తన కొడుకు మీదే రివేంజ్ తీర్చుకోవాలని తరహతహలాడిపోయే ఆ పాత్రను సజీవంగా మన ముందు నిలబెట్టారు వెంకటేష్. ఈ రెండు పాత్రల్లో ఎవరు బాగా చేసారు అంటే ఇద్దరూ అని చెప్పాల్సి ఉంటుంది. అక్కడక్కడా బూతులు వెంకటేష్ చేత మాట్లాడించటం మనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని చూడకుండా అందుకే ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు.
 


హైలెట్స్:
రానా పాత్ర
వెంకటేష్ ఫెరఫార్మెన్స్
కొత్తగా అనిపించే ప్లాట్

మైనస్ లు:
స్లో నరేషన్
చాలా చోట్ల వినిపించే బూతులు
రెగ్యులర్ వ్యూయర్స్ కు డైజస్ట్ కాని కథ
 

 
ఫైనల్ థాట్

మనకు రెగ్యులర్ వచ్చే చాలా  వెబ్ సీరిస్ ల కన్నా బాగుంది.  స్లో నేరేషన్ ని ఆస్వాదిస్తూ... ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకపోతే ఇంకా బాగుందనిపిస్తుంది. 

Rating:3
 

click me!