Ant Man and the Wasp Quantumania
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కొత్త సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ఆ తరహా సినిమాలు చూసేవారికి ఉత్సాహమే. అయితే గత కొంతకాలంగా మార్వెల్ సినిమాలు ఏమీ అడటం లేదు. దాంతో ఓ ప్రక్క ఈ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమాం పీకుతుంది.ఏదైతేనేం ఎదురుచూస్తున్న ‘యాంట్ మ్యాన్ అంట్ ది వాస్ప్: క్వాంటమేనియా (Ant Man And The Wasp: Quantumania)’ వచ్చేసింది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటీ అంటే నెక్ట్ వచ్చే ‘అవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ (Avengers: The Kang Dynasty)’లో మెయిన్ విలన్ కాంగ్‌ను ఈ సినిమాలోనే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు. అవేంజర్స్ ఎదుర్కోబోయే విలన్ ను ఇక్కడే చూడటం మాత్రం పండగే కాబట్టి...ఈ సినిమా ఎలా ఉందో ..అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
Image: Ant-Man And The Wasp: Quantumania Trailer Still
కథాంశం:
కాలక్రమంలో అన్నీ దాటుకుని అవెంజర్ గా మారిన స్కాట్ లాంగ్ /యాంట్ మ్యాన్ (పాల్ రడ్) ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సెలబ్రెటీగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. పర్శనల్ లైఫ్ కు ప్రయారిటీ ఇస్తూ... కుటుంబ బంధాలను తిరిగి దక్కించుకుంటున్నాడు. తన కూతురు కేసీ (కేథరిన్ న్యూటన్) ని కలవటం, తను ఇష్టపడ్డ హోప్ వాన్ డైన్‌తో (ఎవాంజెలిన్ లిల్లీ) కు దగ్గరవటం వంటి పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు హోప్ పేరెంట్స్ హ్యాంక్ పిమ్ (మైకేల్ డగ్లస్), జానెట్ వాన్ డైన్ (మిషెల్ ఫైఫర్)లు కూడా స్కాట్ ని ఓకే చేస్తారు.హోప్ లో రొమాంటిక్ లైఫ్ నడుస్తోంది అయితే ఇక్కడే కొత్త ట్విస్ట్ పడుతుంది. కుమార్తె కేసీ క్వాంటమ్ రెల్మ్ వరల్డ్ కు కనెక్ట్ అయ్యిది ఆ ప్రయోగాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో చేసిన ఓ కొత్త ఎక్సప్మెంట్ తో వీళ్లంతా క్వాంటమ్ రెల్మ్ ఇరుక్కుపోతారు. అప్పుడు పరిచయం అవుతాడు మార్వెల్ లో రాబోతున్న అతి పెద్ద విలన్ కాంగ్: ది కాంకరర్ (జొనాథన్ మేజర్స్) (Kang: The Conquerer). అతను కూడా అక్కడే ఉండి బయిట ప్రపంచంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ కాంగ్ బయిటకు వచ్చాడా విశ్వం మొత్తం మటాషే. ఈ విషయం తెలిసి, అక్కడే ఉన్న యాంట్ మెన్ అయిన స్కాట్ ఏం చేసాడు. కాంగ్ ని జయించాడా..కాంగ్ ఈ ప్రపంచంలోకి వచ్చాడా..అతన్ని ఆపగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Image: Marvel Studios Twitter
విశ్లేషణ:
‘యాంట్‌మ్యాన్’ సిరీస్‌లో మూడో చిత్రం ఇది. 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి భాగం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ఈ సిరీస్‌లో మార్వెల్ స్టూడియోస్ నుంచి ‘యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్’ వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్‌లో ముచ్చటగా మూడో చిత్రంగా ‘యాంట్- మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా’వచ్చింది.యాంట్ మెన్ సినిమా గతంలో వచ్చిన సినిమాలు వాటిల్లో ఉన్న ఫన్ తో బాగా వర్కవుట్ అయ్యాయి. అందులో పెద్దగా యాక్షన్ కు ప్రయారిటీ ఇవ్వరు. అయితే ఇందులో ఆ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. అలాగే చివరిసారిగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’లో ప్రేక్షకులను అలరించిన పాల్ రడ్, ఎవాంజలిన్ లిల్లీ ప్రధాన పాత్రల్లో నటించటం కలిసొచ్చింది.
Ant Man and the Wasp Quantumania
వారి మధ్య రొమాన్స్ సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయని చెప్పాలి. అయితే యాక్షన్ సీన్స్ ఎక్కువ కావటంతో సినిమాలో కావాల్సిన,రావాల్సిన ఫన్ ఫ్యాక్టర్ వర్కవుట్ కాలేదు. పుట్టలేదు.యాక్షన్ సీన్స్ కు విసిగొస్తూంటే మరో ప్రక్క ఎక్కువగా పాత్రలు మాట్లాకుంటూనే ఉండటం కూడా డ్రామా పండటానికి అడ్డం గా మారింది. మొదటి రెండు భాగాలతో సమానంగా చేయాలని ఈ సినిమాలో చేసిన ప్రయత్నమే దెబ్బ కొట్టింది. అయితే మార్వెల్ సంస్ద దృష్టి మొత్తం కాంగ్ పాత్ర మీదనే పెట్టింది. తర్వాత మార్వెల్ ప్రపంచంలో వచ్చే ఈ విలన్ కు ఇచ్చిన ప్రయారిటీ ఏ పాత్ర మీద కానీ,స్క్రిప్టు మీద కానీ పెట్టలేదని చెప్పచ్చు. ధానోస్ దాటే పాత్రే కానీ ...ఈ సినిమాని పాడు చేసిన పాత్ర కూడా ఇదే.
Ant Man and the Wasp Quantumania
ఎవరెలా చేసారు..
పాల్ రడ్ కు ఈ యాంట్ మ్యాన్ పాత్ర కొత్తేమీ కాదు. కాబట్టి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. ఇక కాంగ్ పాత్ర చేసిన జొనాథన్ మేయర్స్ అదరకొట్టాడు. అతనికే ప్రయారిటీ రాసుకున్నారు. కాబట్టి అనకున్నట్లుగానే ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. జానెట్ పాత్రలో మిషెల్ ఫైఫర్ ఎప్పటిలాగే ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులందరూ మామూలే.
Ant Man and the Wasp Quantumania
టెక్నికల్ గా...
ఈ సినిమాలో పెద్ద హైలెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. జీన్ క్రిస్టోఫీ బెక్ సినిమాని పట్టుకుని లేపాడు. విలన్ కనపడినప్పుడల్లా మామూలుగా లేదు. ఆ తర్వాత చెప్పుకోదగినది విలియం పోప్ సినిమాటోగ్రఫీ. విజువల్ చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఎడిటర్ పెద్ద ధాంక్స్ చెప్పాడు. ఎక్కువ సాగతీయకుండా రెండు గంటల ఐదు నిమిషాల్లో సినిమాని తేల్చేసినందుకు. ఇక దర్శకుడు పేటన్ రీడ్ ఈ సినిమాని కాంగ్ కోసమే తీసినట్లున్నాడు. అంతకు మించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ...అద్బుతంగా ఉన్నాయి.
Ant Man and the Wasp Quantumania
ఫైనల్ థాట్
‘అవెంజర్స్ ’ సీరిస్ పాలో అయ్యేవారు ఖచ్చితంగా ఈ విలన్ కోసమైనా చూస్తారనేది ప్రొడక్షన్ హౌస్ ఆలోచన కావచ్చు. అదే నిజం కూడా కావచ్చు.
Rating:2.5
Image: Marvel Studios Twitter
నటీనటులు : పాల్ రడ్, ఎవాంజెలిన్ లిల్లీ, కేథరిన్ న్యూటన్, జొనాథన్ మేయర్స్, మైకేల్ డగ్లస్, మిషెల్ ఫైఫర్ తదితరులు
ఛాయాగ్రహణం : విలియం పోప్
సంగీతం : జీన్ క్రిస్టోఫీ బెక్
నిర్మాణం : మార్వెల్ స్టూడియోస్
రచన : జెఫ్ లవ్‌నెస్
దర్శకత్వం : పీటన్ రీడ్
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2023