L2 Empuraan Movie Review: `ఎల్‌2 ఎంపురాన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

L2 Empuraan Review: మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ `ఎల్‌ 2 ఎంపురాన్‌`. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

L2 Empuraan movie review in telugu arj
l2 Empuraan movie, lucifer 2

L2 Empuraan Review: మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఎల్‌2 ఎంపురాన్‌`(లూసిఫర్‌ 2). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇందులో మరో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. 2019లో వచ్చిన `లూసిఫర్‌`కిది సీక్వెల్. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ మూవీ పెద్దవిజయం సాధించింది.

తెలుగులో చిరంజీవి దీన్ని `గాడ్‌ ఫాదర్‌`గా రీమేక్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత సీక్వెల్‌ వస్తుంది. ఇందులో అభిమాన్యు సింగ్‌, టోవినో థామస్‌, మంజు వారియర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించా. ఆశిర్వాద్‌ సినిమాస్‌,

శ్రీ గోకులమ్‌ మూవీస్‌ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆంటోని పెరుంబవూర్‌, గోకులమ్‌ గోపాలన్‌ నిర్మాతలు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. నేడు గురువారం (మార్చి 27)న ఈ చిత్రం విడుదలయ్యింది. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

L2 Empuraan movie review in telugu arj
l2 Empuraan movie review, lucifer 2, mohanlal

కథః 
కేరళాలో పీకేఆర్‌ (సచిన్‌ ఖేడ్కర్‌) వారసుడిగా జితిన్‌ రామ్‌దాస్‌(టోవినో థామస్‌) సీఎంగా బాధ్యతలు చేపడతాడు. కానీ పీకేఆర్‌ ఆశయాలను అమలు చేయడంలో విఫలమవుతాడు. స్వార్థపరుడిగా మారి అవినీతికి పాల్పడుతుంటాడు. అంతేకాదు ఐయూఎఫ్‌ పార్టీని కాదని కొత్తగా ఐయూఎఫ్‌ పీకేఆర్‌ అనే పార్టీ పెడతాడు. బాబా బజరంగీ(అభిమాన్యు సింగ్‌) పార్టీతో కలిసి తాను పనిచేయబోతున్నామని ప్రకటిస్తారు.

ఇది కేరళాకి ప్రమాదకరమని, లూసిఫర్‌ తిరిగా రావాలని, ఈ విషయం స్టీఫెన్‌కి తెలియజేయాలని ఒక జర్నలిస్ట్ ప్రయత్నిస్తుంటాడు. జితిన్‌ నిర్ణయాన్ని సిస్టర్‌ ప్రియదర్శిని రామ్‌ దాస్‌(మంజు వారియర్‌) వ్యతిరేకిస్తుంది. సీఎంకి వ్యతిరేకంగా వెళ్తుంది. దీంతో ఆమెని చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఆమెని కాపాడేందుకు వస్తాడు స్టీఫెన్‌(మోహన్‌లాల్‌). ఆమెని కాపాడతాడు.

అంతేకాదు ఇకపై ఏం చేయాలో గైడ్ చేస్తాడు. బుక్‌లో రాసిన విధంగా చేయాలని చెబుతాడు. దీంతో ప్రియదర్శిని బాధ్యతలు చేపడుతుంది. అంతలోనే పలు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి ఆమెని కాపాడేందుకు స్టీఫెన్‌ వచ్చాడా? జితిన్‌ ఆటలు కట్టడి చేసేందుకు స్టీఫెన్‌ ఏం చేశాడు?

ఇందులో సయ్యీద్‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) పాత్రేంటి? స్టీఫెన్‌కి ఎందుకు సపోర్ట్ గా ఉన్నాడు? 2002లో ఏం జరిగింది? ఆయనకు బాబా భజరంగీపై పగకి కారణమేంటి? బాబా భజరంగీ గతంలో ఏం చేశాడు? ఇంతకి స్టీఫెన్‌ ఎవరు? లూసిఫర్‌ ఎవరు? ఖురేషి అక్బర్‌ ఎవరు? ఆయన ఎక్కడుంటాడు? అనేది మిగిలిన కథ. 
 


l2 Empuraan movie review, lucifer 2, mohanlal

విశ్లేషణః
ఆరేళ్ల క్రితం వచ్చిన `లూసిఫర్‌` చిత్రానికి కంటిన్యూగా దీన్ని తెరకెక్కించారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. పీఆకేఆర్‌ వారసత్వంగా వచ్చిన జితిన్‌ తప్పుదారి పట్టడం, రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేసి తాను స్వలాభం పొందే ప్రయత్నం చేయగా దాన్ని లూసిఫర్‌, ప్రియదర్శిని రామ్‌ దాస్‌ ఎలా ఎదుర్కొన్నారనేది ఈ మూవీ సారాంశం. ప్రారంభంలో 2002 నాటి మత కలహాలు చూపించారు.

ఆ సమయంలో సయ్యాద్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూపించి కథలో అటెన్షన్‌ క్రియేట్‌ చేశారు. లూసిఫర్‌ ఎంట్రీకి సంబంధించిన ముందస్తు ప్రణాళిక, ఆయన రావాల్సిన రాజకీయ పరిణామాలను క్రియేట్‌ చేసిన తీరు బాగుంది. మరోవైపు స్టీఫెన్‌గా మోహన్‌లాల్‌ ఎంట్రీ సీన్లు అదిరిపోయాయి. అయితే ఆయన ఎంట్రీ కోసం చాలా టైమ్‌ తీసుకోవడమే కొంత అసహనంగా అనిపిస్తుంది.

బాగా లాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ మోహన్‌ లాల్‌ ఎంట్రీ సీన్‌ మాత్రం అదిరిపోయింది. లేట్‌గా అయినా వాహ్‌ అనిపించేలా ఆయన ఎంట్రీ ఉండటం విశేషం. భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌తో కూడిన ఆ సీన్లు బాగున్నాయి. హైలైట్‌గా నిలిచాయి. ఓ వైపు స్టీఫెన్‌ విదేశాల్లో మాఫియాని అంతం చేస్తూ రావడం, మరోవైపు కేరళా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలను చూపించిన తీరు బాగుంది.

ఆద్యంతం ఎంగేజ్‌ చేసేలా ఉంది. ఇంటర్వెల్‌లో స్టీఫెన్‌ కి సంబంధించిన సన్నివేశాలను చూపించి ఉత్కంఠకి గురి చేశారు. ట్విస్ట్ తో క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు. సెకండాఫ్‌లో ఆ ట్విస్ట్ రివీల్‌ చేసిన తీరు బాగుంది. జితిన్‌ని కిడ్నాప్‌ చేసి ఆయన వార్నింగ్‌ ఇవ్వడం, కేరళా రాజకీయాల్లో మంజు వారియర్‌ కీలకంగా మారడం వంటి సీన్లు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. 
 

l2 Empuraan movie review, lucifer 2, mohanlal

సినిమాలో చాలా వరకు కేరళా రాజకీయాలను ప్రతిబింబించేలా రూపొందించారు. వాటి చుట్టూనే కథంతా సాగుతుంది. రాజకీయ పరిణామాలను ఉత్కంఠభరితంగా నడిపించారు. కామన్‌ ఆడియెన్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. మంజు వారియర్‌ రాజకీయక్రియా శీలక ఎంట్రీ కూడా అదిరిపోయింది.

అయితే సినిమాలో చాలా లేయర్లు ఉంటాయి. వాటిని లింక్‌ చేసే విషయంలో విఫలమయ్యాడు దర్శకుడు. ఒక కథకి, మరో కథకి సంబంధం లేదు. అదే ఆడియెన్స్ ని డీవియేట్‌ చేస్తుంది. ప్రారంభంలో చూపించిన కథకి, లూసిఫర్‌ కథకి సంబంధం లేదు. కేవలం పృథ్వీరాజ్‌ పాత్ర కోసం ఆయా సీన్లు పెట్టినట్టుగా ఉంది. అలాగే డైలాగులు పెద్ద మైనస్‌. క్రిస్టియన్‌ పదాలను ఒరిజినల్‌గా ట్రాన్స్ లేట్‌ చేయడంతో సహజత్వం మిస్‌ అయ్యింది.

క్రిస్టియన్‌ని ఫాలో అయ్యేవారికి మాత్రమే అర్థమయ్యేలా ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు నెటివిటీని ఫాలో కావాల్సింది. మరోవైపు స్టీఫెన్‌, లూసిఫర్‌ పాత్రల్లో ఉన్న సస్పెన్స్ కూడా కొంత కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ అవుతుంది. విదేశాల్లో జరిగే సీన్లు, లోకల్‌ పాలిటిక్స్ కి లింక్‌ చేసే సీన్లు కూడా కొంత కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేసేలా ఉన్నాయి.

l2 Empuraan movie review, lucifer 2, mohanlal

`లూసిఫర్‌` మూవీ చాలా వరకు స్థానిక రాజకీయాలపై సాగుతుంది. కనెక్టివిటీ ఉంది. కానీ `ఎల్‌2 ఎంపురాన్‌`లో మాత్రం మోహన్‌లాల్‌ పాత్ర విదేశాల్లోనే ఉంటుంది. ఆయన ఎందుకు పోరాడుతున్నాడు? దేనికోసం పోరాడుతున్నాడనేది క్లారిటీ మిస్‌ అయ్యింది. దీనికితోడు ఎలివేషన్లు ఓవర్‌గా ఉన్నాయి. మోహన్‌లాల్‌ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి ఎలివేషన్ ఇవ్వడం టూ మచ్‌గా ఉంటుంది.

అలాగే యాక్షన్‌ సీన్లు, ఆయన పాత్రలోని సన్నివేశాలు విదేశాల్లో సాగడంతో హాలీవుడ్‌ సినిమాలను, బాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ని తలపిస్తాయి. మన అనే ఫీలింగ్‌ మిస్‌ అయ్యింది. అయితే స్టయిలీష్‌ గా వాటిని తీర్చిదిద్దడం, మోహన్‌లాల్‌ పాత్రని కూడా అంతకు మించి స్టయిలీష్‌గా చూపించడం అదిరిపోయింది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి.

కానీ రియాలిటీకి దగ్గరగా సినిమా కథని నడిపిస్తే బాగుండేది. ఇంటలిజెంట్‌ స్క్రీన్‌ప్లే కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశమని చెప్పొచ్చు. పాన్‌ ఇండియా మోజులో పడి మూలాలను మర్చిపోయినట్టుగా ఈ మూవీ ఉంది. మనవైన అంశాలకు, ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కనీసం బ్యాలెన్స్ చేసినా బాగుండేది. విలన్‌ రోల్‌ కూడా బలంగా లేదు. సరళమైన కథనంతో సినిమాని నడిపిస్తే బాగుండేది. కానీ స్టయిలీష్‌ టేకింగ్‌ బాగుంది. ఆడియెన్స్ అది మాత్రమే సరిపోదు.

l2 Empuraan movie review, lucifer 2, mohanlal

నటీనటులుః
కంప్లీట్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటనతో ఆయన తోపు. ఇందులో ఆయన ఖురేషిగా, స్టీఫెన్‌ గా, లూసీఫర్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కనిపిస్తే చాలు పూనకాలే అనేలా ఓ రేంజ్‌లో ఎలివేషన్లు ఉన్నాయి. ఉన్నంత సేపు సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టారు. యాక్షన్‌ సీన్లలోనూ తన జోరు చూపించారు.

ఆయన కనిపించేది తక్కువే అయినా సినిమా మొత్తం ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  సయ్యాద్‌గా ఫర్వాలేదనిపించారు. ఇందులో డైరెక్షన్‌ చేస్తూ నటించడం పెద్ద టాస్క్. కానీ ఆయన అవలీలగా చేసేశారు. పాత్రలను రక్తికట్టించారు. టోవినో థామస్‌ జతిన్‌ రామ్‌ దాస్‌గా సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. డిఫరెంట్‌ షేడ్స్‌ చూపించారు.

పొలిటీషియన్ గా ఆయన ఎత్తులు, పై ఎత్తులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మంజు వారియర్‌ సైతం మరోసారి ఆకట్టుకున్నారు. ఆమె పొలిటికల్‌ లీడర్‌గా బాగా చేశారు హుందాగా కనిపించారు. ఆమె ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. ఇక బాబా భజరంగీగా అభిమాన్యు సింగ్‌ తన పాత్ర పరిధి మేరకు అదరగొట్టాడు. ఇతర పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు.
 

l2 Empuraan movie review, lucifer 2, mohanlal

టెక్నీషియన్లుః 
ఈ సినిమాకి దీపక్‌ దేవ్‌ సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్‌ హైలైట్‌ అని చెప్పాలి. ముఖ్యంగా బీజీఎం విషయంలో ఇరగదీశారు. మాస్‌, స్టయిలీష్‌ బీజీఎంతో పూనకాలు తెప్పించారు. యాక్షన్‌ సీన్లలో ఆ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోప్‌ వాహ్‌ అనిపిస్తుంది. ఎడిటర్‌ అఖిలేష్‌ మోహన్‌ ఓకే అనిపించారు. ఇంకా క్లారిటీగా ట్రిమ్‌ చేయాల్సింది. కథనాన్ని స్పీడ్‌గా చేయాల్సింది.

సుజీత్‌ వాసుదేవ్‌ కెమెరా వర్క్ బాగుంది. లావిష్‌ విజువల్స్ కనువిందు చేసేలా ఉన్నాయి. దర్శకుడు పృథ్వీరాజ్‌.. డైరెక్టర్‌గా ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన మ్యాజిక్‌ చేశారు. మొదటి సినిమాని మించి దీన్ని తీర్చిదిద్దారు.

మోహన్‌ లాల్‌ ఎలివేషన్లు ఒక రేంజ్‌లో చూపించారు. యాక్షన్‌ సీన్లు హైలైట్‌గా తీర్చిదిద్దారు. డైలాగుల విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. స్క్రీన్‌ ప్లే నడిపించే విషయంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. అందరికి అర్థమయ్యేలా తెరకెక్కిస్తే బాగుండేది.
 

l2 Empuraan movie review, lucifer 2, mohanlal

ఫైనల్‌గాః  సాగదీతగా సాగే స్టయిలీష్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఎలివేషన్లే ఎలివేషన్లు.

రేటింగ్‌ః 2.75

 

Latest Videos

vuukle one pixel image
click me!