దానికి మాళవిక, నా కొడుకుని కాపాడడానికి తనేవారు, నీకు, నాకు, ఆదికి మధ్య తనెవరు ఏదో పరాయి వ్యక్తి అయినా నాకు ఏమైనా అయితే ఆది నిన్ను క్షమించడు అని అంటుంది. దానికి యష్ బెదిరిస్తున్నావా అని అంటూ తిరిగి చూసేసరికి అక్కడ వేదా ఉంటుంది. సరే నేను తర్వాత చేస్తాను చెప్తే అర్థం కావడం లేదా అని కోపంగా ఫోన్ పెట్టేసి, ఏంటో ఈ వసంత్ గాడు వేళా పాల లేకుండా అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు అని తిట్టుకుంటూ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు వేదా ఆ టేబుల్ మీద కూర్చుంటుంది. అదే సమయంలో మాళవిక యష్ కి మెసేజ్ చేసి, నువ్వు నాతో తోడుగా ఉంటా అన్నావు కదా.