#Prince:శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ రివ్యూ

First Published | Oct 21, 2022, 1:48 PM IST


తమిళ హీరో శివ కార్తికేయన్ స్ట్రెయిట్ తెలుగు చిత్రం‘ప్రిన్స్’.ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. 'జాతి రత్నాలు' తరహాలో నవ్వించిందా? లేదా? సినిమా ఎలా ఉంది (Prince Telugu Review)? 
 


'జాతిరత్నాలు' సినిమాతో  కోవిడ్ టైమ్ లో హిట్ కొట్టాడు అనుదీప్. నవీన్ పొలిశెట్టి - ఫారియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు అనుదీప్ 'ప్రిన్స్' అంటూ మరో సినిమాతో రెడీ అయ్యాడు.   ‘ప్రిన్స్’ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కింది. దీనికి జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్ ,ట్రైలర్ అన్నీ కూడా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. శివకార్తికేయన్ డాక్టర్, డాన్ లాంటి బ్లాక్‌బస్టర్లతో మంచి ఊపుమీదున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి.అందుకే ప్రిన్స్ పై అంచనలు ఏర్పడ్డాయి. వాటిని ఈ చిత్రం ఏ మేరకు రీచ్ అయ్యింది..అసలు ఈ చిత్రం కథేంటి, ఈ సినిమా కూడా 'జాతిరత్నాలు' స్దాయిలో ఆడుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 


కథాంశం:

  ఆనంద్ (శివ కార్తికేయన్) కు ఊరు బహిష్కరణ శిక్ష వేస్తారు. ఊరివారంతా అతనో పెద్ద తప్పు చేసాడని నిందిస్తూంటారు. అయితే అతను ఏం తప్పు చేసాడు అని ప్లాష్ బ్యాక్ లోకి వెళ్తే...ఆనంద్ ఓ స్కూల్ లో టీచర్ గా చేస్తూంటాడు. తన స్కూల్ కు ఇంగ్లీష్ టీచర్ గా వచ్చిన  బ్రిటిష్ అమ్మాయి జెస్సికా తో ప్రేమలో పడతాడు. రెగ్యులర్ గా స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు చెక్కేసే చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న ఆనంద్....ఆమె వచ్చాక రెగ్యులర్ గా స్కూల్ కు వెళ్తూంటారు. ఆమె కూడా కొద్ది రోజులకు మన ఆనంద్ అమాయకత్వం, కొంటెతనం,తింగరితనం చూసి ప్రేమలో పడుతుంది. అయితే వీళ్లిద్దరు పెళ్లికి ఆనంద్ తండ్రి  విశ్వనాథం (సత్యరాజ్)  ఒప్పుకోడు.అందుకు కారణం విశ్వనాధం తాత ఆ రోజుల్లో స్వతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వాళ్ల చేతుల్లో మరణిస్తాడు. దాంతో ఆయనకు కు బ్రిటీష్ వాళ్లు అంటే కోపం, అసహ్యం, చిరాకు.ఏ దేశం,ఏ ప్రాంతం, ఏ కులం, ఏ మతం అమ్మాయినైనా చేసుకో కానీ బ్రిటీష్ వాళ్లకు మాత్రం ఓకే చెప్పనంటాడు. అప్పుడు తన తండ్రిని ఎలా ఒప్పించాడు. ఏ పరిస్దితిలు...ఆనంద్ ని ఊరు బహిష్కరణ శిక్ష వేసే దిసగా ప్రేరేపించాయి. ఇందులో ప్రేమ్ జీ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

Latest Videos



స్క్రీన్ ప్లే  విశ్లేషణ:

 ఈ సినిమానుంచి ఏది ఎక్సెపెక్ట్ చేసి ప్రేక్షకుడు వస్తారో అదే చేసారు. దర్శకుడు  సినిమాని పూర్తిగా ఫన్ పై దృష్టి పెట్టి చేసారు. జోక్స్ వరసగా పేలుతూ సినిమా కథను ముందుకు నడుపుతాయి. ఓ రకంగా ఇది జాతిరత్నాలు ఫార్మెట్ ని గుర్తు చేసినా, కష్టమైన పని. వరసగా జోక్స్ వేసి మెప్పించటం అంటే మామూలు విషయం కాదు. ఆ జోక్స్ రొటీన్ కాకూడదు. డైలాగ్స్ అతి అనిపించకూడదు. ఆ విషయంలో దర్శక,రచయిత అనుదీప్ ది అందె వేసిన చేయి అనే చెప్పాలి. ఈ సినిమాలో అదే చేసారు. కొన్ని హిలేరియస్ జోక్స్ తో స్క్రీన్ ప్లేని అల్లుకుంటూ ముందుకు వెళ్లారు. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. రెగ్యులర్ రొమాంటిక్ కామెడీలా కాకుండా ఓ కొత్త తరహాలో అనిపిస్తుంది. దానికి తగ్గట్లు పాయింట్ కూడా కొత్తదికావటం, సైటైర్ నెక్ట్స్ లెవిల్ లో ఉండటం కలిసొచ్చే అంశం. ఈ సినిమాని ఫస్ట్ టైమ్ ఇదేంటిరా వరస జోక్స్ అనిపించినా, తర్వాత అదే రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కు తేగలుగుతుంది. అనుదీప్ ఈ విషయంలో మాస్టరీ చేసారనిపిస్తుంది. శివకార్తికేయన్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ ఫన్ ని తీసుకొచ్చారు. అలాగే సత్యరాజ్ తో హీరో సీన్స్ కూడా భలే నవ్విస్తాయి. ఇక సెకండాఫ్ లో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమాకే హైలెట్ అనిపిస్తుంది.  


 
అయితే ఫస్టాఫ్ ఉన్నంత స్పీడు సెకండాఫ్ లో ఉండదు. అందుకు కారణం కథలోకి పూర్తిగా వెళ్లటమే. అలాగే ఎమోషన్ సీన్స్ కూడా బాగా పండాయి. హీరోయిన్ తో హీరో చేసే ఫన్ అయితే థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నెగిటివ్ క్యారక్టర్ ప్రేమ్ జీ ...కొత్తగా అనిపిస్తారు. కొత్తతరహా మేనరిజంతో మనకు నచ్చుతాడు. ఏతావాతా క్యారక్టర్స్ మధ్య పుట్టే నవ్వులకు, కొన్ని సిట్యువేషన్స్ తోడు అవుతాయి. కొంత సిట్యువేషన్ కామెడీకు సైతం చోటు ఇచ్చారు. ఇక హీరోయిన్ నాయనమ్మ పాత్రతో ఎమోషన్ కు ప్లేస్ ఇచ్చారు.

  
టెక్నికల్ ఫెరఫార్మెన్స్:

మనోజ్ పరమహంస వంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు పనిచేసారు. ఆ వర్క్  ఓ రేంజిలో ఉంది. విలేజ్ ఎట్మాస్మియర్ ని ఆయన చూపించిన తీరు అద్బుతం. ఆర్ట్ వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ఓ కే అన్నట్లుగా ఉన్నాయి.  దర్శకుడుగా అనుదీప్ మార్క్ అయితే చాలా చోట్ల కనపడింది. డైలాగులు బాగా పేలాయి. క్లైమాక్స్ లో నేనొక్కడ్నే నిజమైన దేశ భక్తుడిని.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేది పాటించి బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను అని శివకార్తికేయన్ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉన్నాయి.  తమన్ సంగీతం అందించడంతో పాటు పాడిన జెస్సికా, బింబిలిక్కి పాటలు బాగానే వర్కవుట అయ్యాయి. వాటి అందంగా చిత్రీకరించినా కథకు బ్రేక్ లు వేసుకుంటూ పోయాయి.  

Prince Movie Review


నటీనటుల్లో ...శివకార్తికేయన్ మొత్తం తన భుజంపై మోసాడు. అతనికి ఇలాంటి కామెడీ పాత్రలు చాలా చాలా మామూలు. ఇక హీరోయిన్ నుంచి ఆశించకపోతే నచ్చుతుంది. సత్యరాజ్ తన పాత్రవరకూ బాగానే చేసారు. కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ల్యాండ్ కబ్జా మాఫియా డాన్ పాత్రలో ప్రేమ్ జి బాగా చేసారు కానీ మనకు పరిచయం కానీ ఫేస్ కావటంతో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.
   

Prince Movie Review

  
బాగున్నవి:
జోక్స్, కామెడీ డైలాగులు
శివకార్తికేయన్ కామెడీ టైమింగ్
 
బాగోలేనివి:
  తెలుగు నేటివిటి మిస్సైనట్లు అనిపించటం
సెకండాఫ్  లో కొన్ని సీన్స్ 


ఫైనల్ థాట్: 

  ఫన్ సినిమాలకు ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు ఉంటారు. క్లీన్ కామెడీ, అసభ్యత ,అశ్లీలత లేదు  కాబట్టి ఫ్యామిలీలుకు నచ్చుతుంది. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3

Prince Movie Review

ఎవరెవరు:

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్,  శాంతి టాకీస్
నటీనటులు: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.
డీవోపీ: మనోజ్ పరమహంస
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ : నారాయణ రెడ్డి
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సమర్పణ: సోనాలి నారంగ్
 రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి
సహ నిర్మాత:  అరుణ్ విశ్వ
నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు
రన్‌టైమ్:  2 గంటల 23 నిమిషాల
విడుదల తేదీ: 21,అక్టోబర్ 2022.

click me!