`బెదురులంక 2012` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Aug 25, 2023, 8:59 AM IST

`ఆర్‌ఎక్స్ 100` తర్వాత కార్తికేయకి సరైన హిట్‌ పడలేదు. ఇప్పుడు హిట్‌ కోసం `బెదురులంక2012` అనే సినిమాని తెరకెక్కించాడు. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌. నేడు శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కార్తికేయ హీరోగా తొలి చిత్రం `ఆర్ఎక్స్ 100`తోనే పెద్ద హిట్‌ కొట్టి బ్రేక్‌ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఏడు సినిమాలు చేశాడు, అందులో రెండు విలన్‌ రోల్స్ కూడా చేశాడు. ఒక్క మూవీ కూడా ఆడలేదు. ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ సారి `బెదురులంక 2012` అంటూ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్ తో వస్తున్నాడు. యుగాంతం అనే కాన్సెప్ట్ కి వినోదాన్ని మేళవించి చేసిన చిత్రమిది.  క్లాక్స్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన `డీజే టిల్లు` ఫేమ్‌ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. నేడు శుక్రవారం(ఆగస్ట్ 25)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా అలరించిందా? కార్తికేయకి హిట్‌ పడిందా? అనేది రివ్యూ(Bedurulanka 2012 Movie Review)లో తెలుసుకుందాం. 
 

కథః 

యుగాంతం అనే వార్త బెదురులంక గ్రామంలో ఎలాంటి అలజడి సృష్టించిందనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. శివ శంకర వరప్రసాద్‌(కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తాడు. తను ముక్కుసూటి మనిషి. అది తెచ్చిన సమస్యతో జాబ్‌ మానేసి ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం తన బెదురులంక గ్రామానికి వస్తాడు. ఆమె ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్‌ చేసుకోవాలనుకుంటారు ఊరు పెద్దలు. ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) లు యుగాంతం ఆగాలంటే ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారం కరిగించి శివలింగం, శిలువ తయారు చేయించి గంగలో వదిలేయాలని చెబుతారు. ప్రాణ భయంతో అందుకు ఒప్పుకుంటారు ఊరి ప్రజలు. దీన్ని వ్యతిరేకించిన శివని ఊరి నుంచి వెలివేస్తారు. దీంతో శివ యుగాంతం పేరుతో దోచుకోవాలనుకుంటున్న పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన (Bedurulanka 2012 Movie Review) సినిమా.
 


విశ్లేషణః 
యుగాంతం నేపథ్యంలో ఇతర దేశ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. అయితే అవన్నీ యాక్షన్‌, థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్‌ పెట్టాడు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దాడు. అదే సమయంలో ఇందులో మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్‌, (Bedurulanka 2012 Movie Review) థ్రిల్లర్‌ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్‌ చేశాడు. 
 

సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. కాసేపు హీరో కార్తికేయ పాత్ర తీరుతెన్నులను చూపించి, అనంతరం సినిమాని బెదురులంకకి షిఫ్ట్ చేశాడు. అక్కడే ప్రేమ, అక్కడే భయాలు, అక్కడే కుట్రలు, అక్కడే ఎమోషన్స్, కామెడీని మేళవించి `బెదురులంక`తో చక్కని ప్రయత్నం చేశారు. మరికొన్ని రోజుల్లో చనిపోతున్నామని తెలిసినప్పుడు జనాలు ఎలా ప్రవర్తిస్తారు, ఎంత వింతగా ఉంటుంది, అంతకు ముందు కారాలు మిర్యాలు నూరే వారు, ఎలా మారిపోయారు, ఈ క్రమంలో పుట్టే ఫన్‌ని హైలైట్‌ చేశాడు దర్శకుడు, అవన్నీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి.  అయితే తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడంతో కథలో వేగం మిస్‌ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. 

ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్‌, బ్రహ్మం, డేనియల్‌ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. వారి ఆట కట్టించేందుకు హీరో చేసే ప్లాన్ అదిరిపోయింది. సత్య, వెన్నెల కిషోర్‌ ఎంట్రీతో సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. కామెడీ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. సినిమా క్లైమాక్స్ 20 నిమిషాల ముందు నుంచి కామెడీ డోస్‌ పెంచారు. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని తగ్గిస్తుంది. అయితే (Bedurulanka 2012 Movie Review) సినిమాకి పాటలు పెద్ద మైనస్‌. అవి ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. దీనికితోడు కార్తికేయ అంటే యాక్షన్‌ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అవి కూడా పెద్దగా లేవు. కొంత స్లో నెరేషన్‌ ఇబ్బంది పెట్టే అంశం. అదే సమయంలో నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్‌ ట్రాక్‌ని బలంగా చూపించలేదు, వీరిద్దరు ఒకరికొకరు ఎందుకు అంతగా ఇష్టపడుతున్నారనేది బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్‌ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్‌ అవుతుంది. వాటిని పక్కన పెట్టి చూస్తే ఇదొక మంచి సందేశాన్నిచ్చే, ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్ అవుతుందని చెప్పొచ్చు.
 

నటీనటులుః 
శివ పాత్రలో కార్తికేయ అదరగొట్టాడు. బాడీ లాంగ్వేజ్‌ కూడా కాస్త కొత్తగా ట్రై చేశాడు. హీరోయిజానికి పోకుండా సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ఓ పాటలో సిక్స్ ప్యాక్‌ కూడా చూపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయిగా నేహ శెట్టి కనిపించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే, అయినా ఉన్నంత(Bedurulanka 2012 Movie Review) సేపు మెప్పించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. అజయ్‌ ఘోష్‌, రాంప్రసాద్, గోపరాజు రమణ, సత్య, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను పాత్రలు మంచి వినోదాన్ని పంచాయి. కసిరాజు పాత్రలో నటించిన రాజ్‌కుమార్‌ కసిరెడ్డి కామెడీ హైలైట్‌ అవుతుంది. ఎల్బీ శ్రీరామ్‌ మెప్పించారు.
 

టెక్నీషియన్ల పనితీరుః
`బెదురులంక` చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. కానీ ఆయన మ్యూజిక్‌ వర్కౌట్‌ కాలేదు. పాటలు ఆకట్టుకునేలా లేవు. బీజీఎం ఫర్వాలేదు. పాటలు బాగుంటే సినిమాకి హెల్ప్ అయ్యేది. సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగ్‌, సన్నీ కూరపాటి కెమెరా వర్క్ బాగున్నాయి. నైట్‌ ఎఫెక్ట్స్ లోనూ బాగా తీశారు. వారు పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటర్‌గా విప్లవ్‌ న్యాసదం పనితీరు ఫర్వాలేదు, కానీ కొన్ని అనవసరమైన సీన్లని లేపేయాల్సింది, ఇంకా క్రిస్పీగా ఉండేది. డైలాగులు (Bedurulanka 2012 Movie Review) బాగున్నాయి. దర్శకుడు క్లాక్స్ ఆలోచింప చేసే డైలాగులు రాశాడు. కథని తీసుకెళ్లిన తీరు కూడా బాగుంది. కానీ ఫస్టాఫ్‌ని మరింత ఎంటర్‌టైనింగ్‌ చెబితే ఇంకా బాగుండేది. డ్రామా, ఎమోషన్స్ పరంగా మరింత ఫోకస్‌ పెట్టాల్సింది. ఇలాంటి సినిమాలకు ఫన్‌తోపాటు ఎమోషన్స్ కూడా ముఖ్యమే.  బట్‌ తొలి సినిమా అయినా బాగా డీల్‌ చేశాడు. కొత్త దర్శకుడు అనే ఫీలింగ్‌ లేదు, టెక్నీకల్‌గా తనకున్న కమాండ్‌ కనిపిస్తుంది. రవీంద్ర బెనర్జీ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా స్థాయికి మించిన క్వాలిటీ కనిపిస్తుంది. 
 

ఫైనల్‌గాః `బెదురులంక 2012` నవ్విస్తూ సందేశాన్నిస్తుంది.

రేటింగ్‌ః 2.75

నటీనటులుః కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీశ్రీరామ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు. 
సంగీతంః మణిశర్మ
సినిమాటోగ్రాఫర్‌ః సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
ఎడిటింగ్‌ః విప్లవ్‌ న్యాసదం
పాటలుః సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విప్సా ప్రగడ, కృష్ణ చైతన్య
నిర్మాతః రవీంద్ర బెనర్జీ ముప్పానేని
దర్శకత్వంః క్లాక్స్. 
 

Latest Videos

click me!