`బచ్చల మల్లి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. అల్లరి నరేష్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?

Published : Dec 20, 2024, 08:04 AM IST

అల్లరి నరేష్‌ చేసిన కామెడీ సినిమాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో మళ్లీ యాక్షన్ ట్రాక్‌ ఎక్కాడు. ఇప్పుడు `బచ్చల మల్లి` సినిమాతో వచ్చాడు. ఈ మూవీ నేడు విడదలైంది. ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
16
`బచ్చల మల్లి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. అల్లరి నరేష్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?

అల్లరి నరేష్‌ కామెడీ సినిమాలతో హీరోగా ఎదిగాడు. ఒకప్పుడు కామెడీనే ఆయన బలం. కానీ ఇప్పుడు అదే ఆయన మైనస్‌గా మారింది. ఇటీవల ఆయన చేసిన కామెడీ సినిమాలు వర్కౌట్‌ కావడం లేదు. కానీ యాక్షన్‌ థ్రిల్లర్స్ తో మెప్పిస్తున్నారు. `నాంది` చిత్రంతో హిట్‌ కొట్టాడు. మళ్లీ `ఉగ్రం`తో ఫర్వాలేదనిపించాడు. ఇటీవల `నా సామిరంగా`తోనూ ఎమోషనల్‌ పాత్ర చేసి మెప్పించాడు.

దీంతో తన సక్సెస్‌ ఫార్మూలాని ఫాలో అవుతూ ఇప్పుడు `బచ్చల మల్లి` అనే సినిమా చేశాడు నరేష్‌. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(డిసెంబర్‌ 20)న విడుదలైంది. మరి నరేష్‌ ఈ సారైనా హిట్ కొట్టాడా? మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడా? అనేది తెలుసుకుందాం. 
 

26

కథః 
బచ్చల మల్లి(అల్లరి నరేష్‌) 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంగ్‌తో పాస్‌ అవుతాడు. ఆ ఆనందాన్ని తండ్రి సెలబ్రేట్‌ చేసుకుంటాడు. కానీ అంతలో సాడ్‌ న్యూస్‌. తండ్రి మరో మహిళతో రిలేషన్‌ పెట్టుకుంటాడు. ఆమెకి ఓ కొడుకు(అంకిత్‌) కూడా. భార్యతో ఉండాలా? ఉంచుకున్న భార్యతో వెళ్లాలా? అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆమెతోనే వెళ్లిపోతాడు. ఇది చూసిన బచ్చల మల్లి తట్టుకోలేకపోతాడు. రెబల్‌గా తయారవుతాడు. కాలేజీలో లెక్చరర్స్ ని ఎదురించి చదువు మానేస్తాడు.

తాగుడికి బానిస అవుతాడు. ట్రాక్టర్‌ కొని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. తనకు నచ్చినట్టు బతుకుతుంటాడు. ఈ క్రమంలో తన అన్న కూతురు(హరితేజ) పెళ్లిలో ఓ అందమైన అమ్మాయి కావేరి(అమృత అయ్యర్‌) ని చూసి ఇష్టపడతాడు. ఆమె కోసం సిగరేట్‌, మందు, అమ్మాయిలు మానేస్తాడు. బుద్దిగా తనపని తాను చేసుకుంటాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆమె కోసం బస్తాల వ్యాపారం కూడా పెడతాడు.

కట్‌ చేస్తే లాజ్జ్ లో అమ్మాయితో పోలీసులకు దొరికిపోతాడు. అందులో హెడ్‌ కానిస్టేబుల్‌(రావు రమేష్‌) కావేరి వాళ్ల నాన్న. ఆ లాజ్జ్ లో పోలీసులతో గొడవ అవుతుంది. ఈ కేసులో అరెస్ట్ చేస్తారు. మరి దీన్నుంచి ఎలా బయటపడ్డాడు? తాను ప్రేమించిన అమ్మాయి నాన్నకి ఈ విషయం తెలిసి ఆయన ఏం చేశాడు?

బచ్చలమల్లి మళ్లీ తాగుబోతుగా ఎందుకు మారాడు? తన తండ్రి చనిపోవడానికి కారణం ఎవరు? కావేరీతో పెళ్లి అయ్యిందా? లేదా? బచ్చల మల్లిలోని ఆవేశం, ముర్ఖత్వం ఆయన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఈ క్రమంలో ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా. 
 

36

విశ్లేషణః 

 ఇప్పుడు రా కంటెంట్‌ తో కూడిన చిత్రాలు, రియలిస్టిక్‌ గా ఉండే చిత్రాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. అదే కోవలో `బచ్చల మల్లి` మూవీని ప్లాన్‌ చేశారు. అయితే ఎంత రా గా ఉన్నా.  ఎంత యాక్షన్‌, ఎలివేషన్లు ఉన్నా ఎమోషన్స్ చాలా ముఖ్యం. డ్రామా పండితేనే, అవి ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతేనే సినిమా సక్సెస్‌ లేదంటే, బూడిదలో పోసిన పన్నీరే. `బచ్చల మల్లి` సినిమా సగం అటు, సగం ఇటూగా ఉంటుంది.

రియలిస్టిక్‌ అంశాలతో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. సినిమా రా గా ఉన్నా, మెయిన్‌గా వ్యక్తిలోని ముర్ఖత్వం ఎంతటి నష్టాలను తెచ్చిపెడుతుంది? జీవితాన్ని ఎంతటి అథ పాతాలానికి తీసుకెళ్తుందనేది, ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందనేదాన్ని ఈ మూవీ ద్వారా చెప్పారు దర్శకుడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. సినిమా బచ్చల మల్లి జీవితంలోని మూడు టైమ్‌ పీరియడ్లో ఏం జరిగిందనేది చెబుతుంది.

2005తో కథ ప్రారంభమవుతుంది. దెబ్బతగిలి కింద పడిపోవడంతో ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తుంది. అంటే 1985లో టెన్త్ క్లాస్‌ లో తాను ఫస్ట్ ర్యాంక్ సాధించడం, ఆ తర్వాత నాన్న మరో కాపురం పెట్టడం, ఇది తట్టుకోలేక తాగుబోతుగా, ముర్ఖుడిగా మారిపోవడం జరిగింది. అనంతరం 1995లో సాగే బచ్చల మల్లి జర్నీనే సినిమా.

ఇదొక క్యారెక్టర్‌ బేస్డ్ మూవీ. కథ పరంగా మంచి విషయం ఉన్న స్టోరీనే. కానీ దాన్ని తెరపై ఆవిష్కరించే విషయంలో, డ్రామాని రక్తికట్టించే విషయంలో, స్క్రీన్‌ ప్లే గ్రిప్పింగ్‌గా రాసుకునే విషయంలో, ఎమోషనల్ గా ఆడియెన్స్ కి కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు.
 

46

క్లవర్‌ స్టూడెంట్‌ తండ్రి చేసిన పనికి ఒక్కసారిగా తాగుబోతుగా మారడం అనేది అంత బలంగా అనిపించలేదు. మరోవైపు తాను గొడవలు పడే విషయంలోనూ అంత రియాలిటీ అనిపించదు. చాలా చోట్ల అసహజంగా అనిపిస్తుంది. ఒక సీన్‌ తర్వాత మరో సీన్‌ వస్తుంది తప్పితే సినిమాలో సోల్‌ మిస్‌ అయ్యింది. ఎమోషనల్‌గా ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోతాడు.

బచ్చల మల్లి ఎమోషన్స్, పెయిన్‌ ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కవు. దీంతో స్క్రీన్‌ ప్లే జీవం లేకుండా సాగినట్టుగా అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు ఇలానే సాగుతుంది కానీ బచ్చల మల్లి తాను ప్రేమించిన అమ్మాయి కోసం వాళ్ల నాన్నతో మాట్లాడేందుకు వెళ్లి తర్వాత నుంచి సీరియస్‌గా మారుతుంది. ముఖ్యంగా ఆమె మ్యారేజ్‌ సీన్‌ తర్వాత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక అటెన్షన్‌ స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో దాన్ని క్యారీ చేస్తూ ఎమోషన్స్ ని కాస్త పీక్‌కి తీసుకెళ్లి ముగించారు.

కథ కూడా ఓల్డ్ గానే అనిపిస్తుంది. కాకపోతే అందులో మలుపులు మాత్రం కొత్తగా ఉంటాయి. సినిమా అంతా స్లోగా రన్‌ అవుతుంది. మధ్యలో కొన్ని చోట్ల ప్రవీణ్‌, హరితేజ, వైవా హర్ష కామెడీ ఫర్వాలేదు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రమే ఆకట్టుకుంటుంది. మిగిలినదంతా బోర్‌గా అనిపిస్తుంది. ఈ విషయాలపై దృష్టి పెడితే సినిమా బాగుండేది.
 

56

నటీనటులుః 

బచ్చల మల్లిగా ఊర మాస్‌ లుక్ లో అల్లరి నరేష్‌ ఇరగదీశాడు. ఒకప్పటి `గమ్యం`, `నాంది`, `మహర్షి` వంటి పాత్రలను గుర్తు చేస్తుంది. నటన పరంగా అదరగొట్టినా, ప్రారంభం నుంచి నరేష్‌ కి సెట్‌ అయ్యే పాత్ర కాదు అనే ఫీలింగ్‌ తెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం నరేష్‌ మాత్రమే చేయగలడు అనేలా ఉంటుంది. అంతగా జీవించాడు నరేష్‌. సినిమాకి పాజిటివ్‌ ఏదైనా ఉందంటే అది నరేష్‌ నటన అనే చెప్పాలి.

కావేరిగా అమృతా అయ్యర్ ఉన్నంతలో బాగా చేసింది. బాగానే మెప్పించింది. పోలీస్‌ కానిస్టేబుల్‌గా, కావేరీ తండ్రిగా రావు రమేష్‌ మంచి పాత్ర చేశాడు. ప్రవీణ్‌, హరితేజ, వైవా హర్షల కామెడీ బాగుంటుంది. కానీవారిని ఇంకా బాగా వాడుకోవచ్చు. నెగటివ్‌ రోల్‌లో అచ్చుత్ కుమార్‌ తనకు బాగా సెట్‌ అయ్యే పాత్ర చేసి మెప్పించాడు. బచ్చల మల్లి ఫ్రెండ్స్ గా చేసిన కొత్త కుర్రాళ్లు ఆకట్టుకున్నారు. అమ్మగా రేవతి జీవించింది. తమ్ముడిగా అంకిత్‌ మెప్పించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. 
 

66

టెక్నీకల్‌గాః 
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. రిచర్డ్ ఎం నాథన్‌ కెమెరా వర్క్ చాలా బాగుంది. ఈ పీరియడ్ లుక్‌ని ఆవిష్కరించింది. ఆర్ట్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది. ఎడిటర్‌ చోటా కె ప్రసాద్‌ కాస్త షార్ప్ చేయాల్సింది. కాస్త వేగంగా కథ నడిస్తే క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యేది. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలు గుర్తిండిపోకున్నా, థియేటర్లో చూస్తున్నంత సేపు ఆహ్లాదకరంగా అనిపించాయి.

బీజీఎం కూడా బాగానే ఉంది. శృతి మించిన డబ్బా కొట్టుడుకి పోకుండా డీసెంట్‌గా చేశాడు. ఇక నిర్మాణ విలువలకు కొదవలేదు. క్వాలిటీగా నిర్మించారు. దర్శకుడు సుబ్బు మంగదేవి రాసుకున్న కథ బాగుంది. ఇలాంటి స్టోరీస్‌ ఇరవై ఏళ్ల క్రితమే వచ్చినా, కొన్ని మలుపులు ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా ముర్ఖత్వం కారణంగా ఎలాంటి అనర్థాలు జరుగుతాయి. జీవితాలు ఎలా నాశనం అవుతాయి, సరిదిద్దుకోలేని తప్పులు జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయనేది చెప్పిన తీరు బాగుంది. డ్రామాని మాత్రం రక్తికట్టించలేకపోయాడు. ప్రారంభం నుంచి ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తే బాగుండేది.

ఫైనల్‌గాః ఓన్లీ క్లైమాక్స్, అల్లరి నరేష్‌ నటన. 

రేటింగ్‌ః 2.25 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories