`దిల్‌ రూబా` మూవీ రివ్యూ, రేటింగ్‌

Dilrub Movie Review: `క` వంటి బిగ్‌ సక్సెస్‌ తర్వాత `దిల్‌ రూబా` అనే సినిమాతో వస్తున్నాడు కిరణ్‌ అబ్బవరం. అయితే ఈ సారి కమర్షియల్‌ ఫార్మాట్‌లో మూవీ చేశాడు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

dilruba movie review rating in telugu arj
dilruba movie review

Dilrub Movie Review: కిరణ్‌ అబ్బవరం `క` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. కెరీర్‌ పరంగా బౌన్స్ బ్యాక్‌ అయ్యాడు. మార్కెట్‌ పరంగా, ఇమేజ్‌ పరంగానూ ఆయన రేంజ్‌ పెరిగింది. ఈ క్రమంలో కిరణ్‌ నుంచి వచ్చే సినిమాలపై ఆడియెన్స్ లోనూ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన `దిల్‌ రూబా` అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.

రుక్సార్‌ థిల్లాన్‌, క్యాతీ డేవిసన్‌ హీరోయిన్లుగా నటించారు. శివమ్‌ సెల్యులూయిడ్స్, ఏ యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రవి, జోజో జోష్‌, రాకేష్‌ రెడ్డి, సారెగమ సంయుక్తంగా నిర్మించిన `దిల్‌ రూబా`హోలీ పండుగని పురస్కరించుకుని నేడు శుక్రవారం(మార్చి 14)న విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? కిరణ్‌ మరో హిట్‌ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

dilruba movie review rating in telugu arj
Dilrub Movie Review

కథః 
సిద్ధార్థ్‌(కిరణ్ అబ్బవరం) చిన్నప్పట్నుంచి మ్యాగీ(క్యాతీ డేవిసన్‌), తను కలిసే పెరుగుతారు. ప్రేమించుకుంటారు. కానీ సడెన్‌గా మ్యాగీ సిద్ధుకి హ్యాండిస్తుంది. వదిలేసి వెళ్లిపోతుంది. వేరే పెళ్లి చేసుకుంటుంది. చాలా రోజులు ఆ బాధలోనే ఉంటాడు సిద్దు. కాలేజీ కూడా మధ్యలోనే మానేస్తాడు. ఇలానే ఉంటే ఇక లాభం లేదని, మ్యాగీ ఒత్తిడి మేరకు తాను మారాలనుకుంటాడు. అందుకోసం బెంగుళూరు వెళ్లి అక్కడ ఎంఐటీ కాలేజీలో చేరతాడు.

కానీ వెళ్లే రోజే ఓ పబ్‌ లో అంజలి(రుక్సార్‌ థిల్లాన్‌)ని ఓ రౌడీ నుంచి సేవ్‌ చేస్తాడు. దీంతో ఆమె సిద్దుకి పడిపోతుంది. కట్‌ చేస్తే సిద్దు చేరిన కాలేజీలోనే, అదే క్లాస్‌లోనే అంజలి కూడా స్టూడెంట్‌. ఇంకా చెప్పాలంటే ఒకే బెంచ్‌ మేట్‌ కూడా. అప్పట్నుంచి అంజలి.. సిద్దు వెంటపడుతూనే ఉంటుంది. ఆయన నో చెబుతాడు. కనీసం ట్రీట్‌ ఇస్తానన్నా నో చెబుతాడు. ఆయన కోసం ఏం చేయడానికైనా అంజలి సిద్ధపడుతుంది.

చివరికి వేశ్యగా రోడ్డుపై నిలబడటానికి కూడా రెడీ అవుతుంది. దీంతో ఆమెకి ఫిదా అయిపోతాడు సిద్దు. ఇద్దరు ప్రేమించుకుంటాడు. కానీ ఆ రోజు పబ్‌లో సిద్దు కొట్టిన రౌడీ కూడా ఇదే కాలేజీలో స్టూడెంట్‌. వీరిద్దరు ప్రేమించుకోవడం అతనికి ఇష్టం లేదు. దీంతో ఎలాగైనా విడగొట్టాలనుకుంటారు. అనేక గొడవలు పెడతాడు. చివరికి విడిపోతారు.

వీరిద్దరు విడిపోవడానికి సారీ నే పెద్ద సమస్య. సిద్దు సారీ చెప్పడానికి ఇష్టపడడు, సారీ కాదు థ్యాంక్స్ కూడా చెప్పను అంటాడు. మొత్తానికి సిద్దుకి బ్రేకప్‌ చెబుతుంది అంజలి. ఈ విషయం తెలిసిన సిద్దు మాజీ లవర్‌ మ్యాగీ వీరిద్దరిని కలిపేందుకు అమెరికా నుంచి తిరిగి వస్తుంది. ఆమె ప్రెగ్నెట్‌. ఆ తర్వాత ఏం జరిగింది? అంజలి గురించి సిద్దు తెలుసుకున్న నిజాలేంటి?

సిద్దు ఎందుకు సారీ, థ్యాంక్స్ చెప్పడు? అసలు మ్యాగీ, సిద్దు ఎలా విడిపోయారు? సిద్దు అమ్మాయిలకు, మనుషులకు ఎందుకు దూరంగా ఉండాలనుకున్నాడు? దాని వెనుకున్న కథేంటి? అంజలి, సిద్దు మళ్లీ కలిశారా? అందుకు మ్యాగీ ఏం చేసింది? సారీ, థ్యాంక్స్ లకు ఉన్న విలువేంటి? అది ఇప్పుడు ఎలా మిస్‌ యూజ్‌ అవుతుందనేది? ఈ సినిమా మిగిలిన కథ. 
 


dilruba movie review

విశ్లేషణః 
కాలేజీలో ప్రేమ కథ, అమ్మాయి కోసం కాలేజీలో గొడవలు పడటం వంటి కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. దాని పరంగా చూస్తే `దిల్‌ రూబా` కొత్త కథేం కాదు. కానీ మాజీ ప్రేమికురాలు తిరిగి రావడం, ప్రస్తుతం ప్రేమని కలిపేందుకు ఆమె సపోర్ట్ చేయడం ఈ సినిమాలో కొత్త పాయింట్‌. దీనికోసం కిరణ్‌ అబ్బవరం తన ప్రతి సినిమాలో ఏదో కొత్త పాయింట్‌ని డిస్కస్‌ చేస్తుంటాడు.

అలానే ఇందులో సారీ, థ్యాంక్స్ అనే పదాలకు ఉన్న విలువని తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అంతా సారీ, థ్యాంక్స్ అనే పదాలను చాలా ఈజీగా వాడుతున్నారు. వాటి విలువ తీసేస్తున్నారు. కానీ వాటికి చాలా వ్యాల్యూ ఉంటుందని తెలియజేసే మూవీనే `దిల్‌ రూబా`. పాయింట్‌ పరంగా కొత్తగా ఉంటుంది. కానీ సినిమా నడిపించిన తీరు చూస్తుంటే అది రెగ్యూలర్‌గానే అనిపిస్తుంది. రెగ్యూలర్‌ లవ్‌ స్టోరీలాగే ఉంది.

 నేటి యువతని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రేమని కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా క్రేజీ లవ్‌ స్టోరీగా తీర్చిదిద్దారు. సినిమాలో తన ఫస్ట్ లవర్‌ హ్యాండివ్వడంతో పిచ్చోడు అయిపోవడం, ఆ తర్వాత మూవ్‌ ఆన్‌ కావడం కోసం మరో కాలేజీకి వెళ్లడం కామనే.

అయితే అక్కడ అంజలి లవ్‌ స్టోరీనే ప్రారంభంలో కాస్త క్రేజీ అనిపిస్తుంది. ఆ తర్వాత రొటీన్‌లోకి వెళ్లిపోతుంది. తాను ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాననేది చెప్పే స్టోరీ బాగుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంది. కానీ సారీ చెప్పను అనే దానికి బలమైన ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. ఆయా సీన్లని మరింత బలంగా రాసుకోవాల్సింది. 
 

dilruba movie review

ఫస్టాఫ్‌లో అమ్మాయి హీరో వెంటపడటం, ఆయన అవాయడ్‌ చేయడం, ఆ తర్వాత ఆమెకి ఓ దశలో కనెక్ట్ కావడం, ఇద్దరు ప్రేమించుకోవడం, తర్వాత విలన్‌ ఎంట్రీ ఇవ్వడం, వీరిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేయడం వంటి సీన్లు రెగ్యూలర్‌గానే ఉన్నా ఎంగేజ్‌ చేస్తాయి. ఇంటర్వెల్‌ ఫైట్‌ వేరే స్థాయిలో ఉంటుంది. పెద్ద మాస్‌ హీరోల రేంజ్‌లో దాన్ని డిజైన్‌ చేశారు. దానికి బలమైన కారణం మిస్‌ అయ్యింది.

ఇక సెకండాఫ్‌లో హీరో మాజీ లవర్‌ వచ్చి వారి ప్రేమని కలిపే ప్రయత్నం చేయడం కొత్తగా ఉంది. అదే సమయంలో ఆయా సన్నివేశాలు కొంత ఫన్నీగా ఉంటాయి. ఆ ఫన్‌ ని ఎక్కువ పెట్టాల్సింది. సత్య పాత్ర ఉన్న కామెడీ పరంగా మరింతగా వాడుకోవాల్సింది. ఇక సెకండాఫ్‌లో మరో విలన్‌ ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో వైపు టర్న్ తీసుకుంటుంది.

అదంతా కొంత రాంగ్‌ రూట్‌ లా ఉంటుంది. కానీ యాక్షన్‌ సీన్లని మాత్రం బాగా డిజైన్‌ చేశారు. కాకపోతే ఆ ఎపిసోడ్‌ మొత్తం రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌ని తలపిస్తుంది. క్లైమాక్స్ కూడా అనే పంథాలో వెళ్తుంది. సారీ, థ్యాంక్స్ ల ప్రస్తావన రావడం, అందుకు కారణాలు, వాటి విలువని తెలియజేసిన తీరు బాగుంది.

ఈ విషయంలో అందరిని ఆలోచింప చేసే మూవీనే. ప్రేమలో డెప్త్ చూపించాల్సింది. మరోవైపు బలమైన ఎమోషన్స్ ఇందులో మిస్‌ అయ్యాయి. సారీ, థ్యాంక్స్ విషయంలోనూ ప్రేమ విషయంలోనూ ఆ డోస్‌ పెంచాల్సింది. అయితే సినిమాలో బిగ్గెస్ట్ అసెట్‌ మ్యూజిక్‌, డైలాగ్‌లు. త్రివిక్రమ్‌, పూరీ జగన్నాథ్‌ కలిసి డైలాగ్స్ రాస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆకట్టుకున్నాయి. ఆలోచింప చేసేలా ఉన్నాయి. 
 

dilruba movie review

నటీనటులుః
సిద్దు పాత్రలో కిరణ్‌ అబ్బవరం బాగా చేశాడు. నటుడిగా కొంత ఓపెన్‌ అయ్యాడని చెప్పొచ్చు. `క` సినిమా నుంచి ఆయనలో మార్పు కనిపించింది. అది ఇందులోనూ ఉంది. ముఖ్యంగా లుక్‌ పరంగా చాలా కొత్తగా కనిపించాడు. ఇంకా చెప్పాలంటే మరో కిరణ్‌ని చూస్తారు. లుక్‌, డైలాగ్‌ డెలివరీ చాలా మారిపోయింది. నటనతోనూ మెప్పించాడు.  ఆయన పాత్ర మీదనే సినిమా అంతా సాగుతుంది.

అందుకోసం తను కూడా అంతే కష్టపడ్డాడని తెలుస్తుంది. ఈ సినిమాతో మాస్‌ హీరో ఇమేజ్‌ కోసం ప్రయత్నించాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ సీన్లలో రెచ్చిపోయాడు. ఇక అంజలి పాత్రలో రుక్సార్‌ బాగా సూట్‌ అయ్యింది. అంతే బబ్లీగా చేసింది. అలరించింది. కనిపించినంత సేపు అందరి దృష్టి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

మ్యాగీ పాత్రలో క్యాతీ ఓకే అనిపించింది. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌గా కనిపించి కాసేపు అలరించింది. సత్య పాత్ర కాసేపు నవ్విస్తుంది. కానీ ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు. ఇక అంజలి తండ్రిగా `ఆడుకాలం` నరేన్‌ బాగా చేశాడు. ఆయన పాత్ర కొత్తగా ఉంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. 
 

dilruba movie review

టెక్నీషియన్లుః
సినిమాకి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌. విజయ్‌ బుల్గానిన్‌ పాటలు అదిరిపోయాయి. పెద్ద సినిమాల రేంజ్‌లో ఉంది. ఇక బీజీఎం విషయంలోనూ రెచ్చిపోయాడు. ముఖ్యంగా యాక్షన్లలో ఆర్‌ఆర్‌ బాగుంది. అలరించేలా ఉంది. కొన్ని చోట్ల పూనకాలు తెప్పిస్తుంది. ఆ తర్వాత డైలాగులు మరో పెద్ద అసెట్‌. ప్రతి డైలాగ్‌ ఆకట్టుకుంది. ఆలోచింప చేస్తుంది. బాగా చెప్పాడనే ఫీలింగ్ కలుగుతుంది.

కెమెరా వర్క్ బాగుంది. డేనియల్‌ విశ్వాస్‌ ప్రతి ఫేమ్‌కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఇక ఎడిటింగ్‌ పరంగా కొంత ట్రిమ్‌ చేయోచ్చు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా ఖర్చు చేశారు. సినిమా మొత్తం రిచ్‌గా ఉంది.

ఇక దర్శకుడు విశ్వ కరుణ్‌ రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమా అయినా ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. సారీ, థ్యాంక్స్ అనే పాయింట్లు బాగున్నాయి. ఆలోచింప చేసేలా ఉన్నాయి. సినిమాని నడిపించిన తీరు కమర్షియల్‌ వేలోనే ఉంది. అయితే ప్రేమలో డెప్త్, ఎమోషన్స్ పరంగా మరింత కేర్‌ తీసుకోవాల్సింది. 

ఫైనల్‌గాః `దిల్‌ రూబా` పక్కా కమర్షియల్ లవ్‌ స్టోరీ. ఇకపై సారీ, థ్యాంక్స్ చెప్పడం అంత ఈజీ కాదు బ్రో. 

రేటింగ్‌ః 2.75
 

read  more: Court Movie Review: `కోర్ట్` మూవీ రివ్యూ, రేటింగ్‌

Latest Videos

click me!