Brinda
త్రిష నటించిన సినిమాలు ఓటిటిలో చూసాం కానీ ఇప్పుడు త్రిష మొదటి సారిగా నటించిన వెబ్ సీరిస్ ని ఓటిటీలో చూస్తున్నాం. త్రిషకు ఉన్న గ్లామర్ వేరు. కెరీర్ మొదలై ఇంతకాలం అయ్యినప్పటికి ఆమెలో గ్లామర్ తగ్గలేదు. క్రేజ్ అంతకన్నా తగ్గలేదు. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన కనపిస్తూ అలరిస్తూనే ఉన్నారామె. రీసెంట్ గా లియోలో కనిపించిన ఆమె అజిత్ లేటెస్ట్ చిత్రంలోనూ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఇంత బిజి టైమ్ లోనూ ఆమె వెబ్ సీరిస్ లో చేసింది అంటే ఎంతో అద్బుతమైన కథ అయ్యిండాలి. తనను ఎలివేట్ చేసే పాత్ర అయ్యిండాలి. అలాంటిదేనా ఈ ‘బృంద’, అసలు ఈ వెబ్ సీరిస్ కథ ఏమిటి..చూడదగినదేనా వంటి విశేషాలు చూద్దాం.
‘Brinda' on SonyLiv
కథేంటి
హైదరాబాద్ సిటీలో ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న బృంద (త్రిష) తన పనేదో తాను చేసుకుని వెళ్తిపోతూంటుంది. అయితే ఆమెకు ఎన్ని శక్తి సామార్ధ్యాలు ఉన్నా మహిళ అనే కారణంతో పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు తోటి వాళ్లు. ఓ రోజు తమ స్టేషన్ పరిధిలో ఓ డెడ్ బాడీ దొరుకుతుంది. స్దానిక చెరువులో దొరికిన ఆ శవం ..గుండు కొట్టేసి ఉంటుంది. అలాగే గుండెల్లో చాలా కసితో పొడిచినట్లుగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది మామూలు వాళ్లు చేయరని..ఓ సీరియల్ కిల్లర్ పని ఆమె అనుమానం పడుతుంది. అది రైల్వే ఎంప్లాయ్ తిలక్ డెడ్‌బాడీగా బృంద కనిపెడుతుంది.
Actor Trishas Brinda
తిలక్ హత్యకు సంబంధించి ఎలాంటి క్లూలు లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేయమని సీఐ సాల్మన్ ఆర్డర్ వేస్తాడు. కానీ లెక్కచేయకుండా బృంద ఇన్వేస్టిగేషన్ చేస్తుంది, తిలక్ మాదిరిగానే రాష్ట్రంలో కొన్ని ఏళ్లుగా ఒకే తరహాలో ఓ సీరియల్ కిల్లర్ హత్యలకు పాల్పడుతున్నాడని బృంద ఇన్విస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇదే తరహాలో మొత్తం 16 మంది అతి దారుణంగా హత్య చేయబడ్డారని తెలుసుకుంటుంది. ఆ మర్డర్స్ కు సైకాలజీ ప్రొఫెసర్ కబీర్ ఆనంద్ (ఇంద్రజిత్ సుకుమారన్) లింక్ ఉందని అనుమానిస్తుంది. ఆ దిసగా ఇన్విస్టిగేషన్ చేస్తుంది. ఈ క్రమంలో మరో షాక్ ఇచ్చే నిజం తెలుస్తుంది. అది ఏమిటి...ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు చేస్తున్నారు. బృంద ఆ కిల్లర్ ని పట్టుకోగలిగిందా..ఈ క్రమంలో ఆమెకు వచ్చే అడ్డంకులు ఏమిటి వంటి విషయాలుతో ఈ సీరిస్ నడుస్తుంది.
Brinda Trisha starrer web series
ఎలా ఉంది
సీరిస్ ప్రారంభం చాలా ఉత్కంఠపరిచే సన్నివేశంతో ప్రారంభం అవుతుంది. మనం ఎలర్ట్ అయ్యి సీరిస్ మొత్తం ఇలాగే ఉంటుందేమో అనుకుంటాం. అయితే ఆ స్దాయి లో ఉండదు కానీ ఇంటెన్స్ సీన్స్ ని చాలా వరకూ డిజైన్ చేసారు. మెల్లిగా పోలీస్ స్టేషన్ అక్కడ పాత్రలు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తారు. కథలోకి వెళ్లి..సైకో కిల్లర్ సీన్ లోకి వచ్చేదాకా స్పీడ్ అందుకోదు. బాడీ చెరువులో దొరకగానే అందరూ సూసైడ్ అంటే బృంద మాత్రం మర్డర్ అని పాయింట్ రైజ్ చేస్తుంది. అక్కడ నుంచి సైకో ను పట్టుకోవటం దిసగా కథను నడిపారు. అలాగే సైకో ని రివీల్ చేసి...బృంద పట్టుకోగలుగుతుందా లేదా అన్నట్లు cat-and-mouse గేమ్ తో మిగతా ఎపిసోడ్స్ రన్ అవుతాయి.
Brinda
ప్రతీ సీన్ లోనూ ఏదో ఒక విశేషం ఉండేలా ప్లాన్ చేసుకుని రాసిన స్క్రిప్టు ఇది. అలాగే ప్రతీ ఎపిసోడ్ లోనూ బృంద గతం చెప్తూ, ఓ ప్రక్కన ఇన్విస్టిగేషన్ ని నడుపుతూండటంతో ఇంట్రస్ట్ గా అనిపిస్తుంది. ఇది స్క్రీన్ ప్లే లో తీసుకున్న జాగ్రత్తే. బృంద పాత్ర డిజైన్ కూడా క్లారిటీగా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా,తెలివైన పోలీస్ అధికారిగా చేసారు. ఆమె పాత్రను మనకు పూర్తి క్లారిటీ ఇవ్వటంతో ఆమె ఎలా ఆలోచిస్తుంది..ఏం చేస్తుంది..చేయబోతోందనే ఆసక్తితో ముందుకు తీసుకెళ్లారు. ఇదంతా పాజిటివ్ సైడ్.
Brinda
కాకపోతే ఎంత బాగా తీసినా ఏం చేసినా ఇలా సైకో కిల్లర్ మర్డర్స్, వాళ్ళని పట్టుకునే పోలీస్ లు కథలు చాలా వచ్చేసాయి. దాంతో కొంత ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. అలాగే డిటైలింగ్ మరీ ఎక్కువైందనిపించింది. కథకు సంభందించిన అంశంమైనా మరీ అంత లోతుగా ప్రేక్షకుడు కూడా బోర్ కొట్టే స్దాయిలో వెళ్లాల్సిన పనిలేదు. ఇక సీరిస్ లో డ్రామా బాగానే పండింది. చివరి ఎపిసోడ్స్ లో ఇంటెన్స్ గా నడపటం కలిసొచ్చే అంశం.
Brinda
టెక్నికల్ గా ...
ఈ సీరిస్ టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారు. దర్శకుడు సూర్య మనోజ్ కథలో ఇంటెన్స్ తో పాటు ఎమోషన్ ని అందించాలని చూసారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు. కాకపోతే కొంత రొటీన్ ప్రాసెస్ ని తగ్గించాల్సింది. లాస్ట్ రెండు ఎపిసోడ్స్ కూడా కొంత లాగిన ఫీలింగ్ వచ్చింది. శక్తికాంత్ కార్తీక్ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. జయ్ కృష్ణ డైలాగులు ఫెరఫెక్ట్..ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. త్రిష నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండిపోయింది. ఎలాంటి క్యారక్టర్ అయినా అదరకొడుతోంది.
Brinda
చూడచ్చా
క్రైమ్ , థ్రిల్లర్ , ఇన్విస్టిగేషన్ ఇలాంటి సీరిస్ లు సినిమాలు చూడటం ఆసక్తి ఉన్నవారికి ఇది పండగే. త్రిషలాంటి ఆర్టిస్ట్ ఉండటంతో మరింత ఉత్సాహంగా చూసేయచ్చు. ఆ జానర్స్ ఆసక్తి లేనివాళ్లకు పెద్దగా ఏమీ అనిపించదు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Brinda Trisha starrer web series to premiere
ఎక్కడ చూడచ్చు
స్ట్రీమింగ్ వేదిక: సోనీలివ్ తెలుగులో ఉంది
నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాకేందుమౌళి;
రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల;