విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కానీ వెంకీ వదులుకున్న సూపర్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలని మాత్రం వెంకీ రిజెక్ట్ చేసి తప్పు చేశారు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ సినిమాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నారు కానీ.. వాస్తవానికి వెంకీ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు. వెంకటేష్ తన కెరీర్ లో లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని జోనర్స్ లో సినిమాలు చేశారు. కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకటేష్ తన కెరీర్ లో కొన్ని అద్భుతమైన సినిమాలని చేజేతులుగా వదులుకున్నారు. ముఖ్యంగా రెండు సినిమాలని వదిలేసి పెద్ద తప్పు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
26
సంతోషం
నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సంతోషం మూవీ ఆఫర్ ముందుగా వెంకటేష్ కి వచ్చింది. దశరథ్ ఈ కథని వెంకటేష్ కి చెప్పారు. అయితే భార్య చనిపోవడం.. ఆ తర్వాత మరో పెళ్లి లాంటి కథాంశాలతో టాలీవుడ్ లో బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. దీనితో వెంకటేష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఇదే కథ నాగార్జున వద్దకు వెళ్ళింది. రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే.
36
రోజా
ఇండియన్ సినిమాలో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో మణిరత్నం తెరకెక్కించిన రోజా ఒకటి. అసలు ఈ చిత్రాన్ని వెంకీ ఎలా వదులుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. రోజా మూవీ కోసం మణిరత్నం ముందుగా వెంకటేష్ ని హీరోగా అనుకున్నారు. వెంకీని సంప్రదించి కథ కూడా చెప్పారు. కశ్మీర్, టెర్రరిస్టులు, ఆర్మీ ఇలాంటి అంశాలు కథలో ఉండడంతో వెంకీకి ఈ చిత్రం ఎక్కలేదు. దీనితో వెంకీ రోజా మూవీపై ఆసక్తి చూపలేదు. దీనితో మణిరత్నం అరవింద్ స్వామిని హీరోగా ఎంచుకున్నారు. అరవింద్ స్వామి కెరీర్ ని ఈ చిత్రం పూర్తిగా మార్చేసింది. రోజాకి బదులుగా వెంకీ ఆ సమయంలో చంటి చిత్రాన్ని ఎంచుకున్నారు. రోజా మూవీని వెంకటేష్ చేసి ఉంటే అప్పట్లోనే ఆయనకి పాన్ ఇండియా క్రేజ్ దక్కేది.
పాన్ ఇండియా రేంజ్ లో వెలిగిపోయే అవకాశాన్ని మరోసారి వెంకీ చేజార్చుకున్నారు. డైరెక్టర్ శంకర్ సంచలన చిత్రం ఒకే ఒక్కడు చిత్రంలో నటించే ఛాన్స్ వెంకీకి ముందుగా వచ్చింది. తనకి ఈ పొలిటికల్ డ్రామా సెట్ కాదని వెంకీ రిజెక్ట్ చేశారు. రజనీకాంత్ కూడా ఈ కథని వద్దనుకున్నారు. మొత్తంగా ఒకే ఒక్కడు మూవీ అర్జున్ కి మాత్రమే రాసిపెట్టి ఉంది. వన్ డే సీఎం గా అర్జున్ ఈ చిత్రంలో విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
56
క్రాక్
డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యని దృష్టిలో పెట్టుకుని క్రాక్ కథ రెడీ చేశారు. కానీ బాలయ్య ఈ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత వెంకటేష్ కి గోపీచంద్ మలినేని కథ వినిపించారు. ఎందుకో వెంకీకి కూడా క్రాక్ స్టోరీ ఎక్కలేదు. ఫైనల్ గా ఈ చిత్రాన్ని రవితేజ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.
66
కృష్ణం వందే జగద్గురుమ్
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర కథని వెంకటేష్ కోసమే సిద్ధం చేసుకున్నారు. కానీ వెంకటేష్ తనకి ఈ కథ సెట్ కాదని రిజెక్ట్ చేశారు. బాబాయ్ రిజెక్ట్ చేసిన సినిమా అబ్బాయి రానా చేతుల్లోకి వెళ్ళింది. ఈ మూవీలో రానా నటనకి ప్రశంసలు దక్కాయి.