The Warrior Review: `ది వారియర్‌` మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. తెరపై రామ్‌ చెడుగుడు ?

First Published | Jul 13, 2022, 11:14 PM IST

రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ కాస్టింగ్‌, లింగుస్వామి నుంచి వస్తోన్న సినిమా కావడంతో `ది వారియర్‌`పై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి ట్విట్టర్‌లో టాక్‌ వైరల్‌ అవుతుంది. మరి `ది వారియర్‌` మూవీ ట్విట్టర్‌ టాక్‌ ఎలా ఉందో చూద్దాం. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని(Ram Pothineni) ఇప్పుడు `ది వారియర్‌`(The Warrior Movie)తో ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. ఆయన చేసిన మరో పూర్తి యాక్షన్‌ చిత్రమిది. అంతేకాదు ఫస్ట్ టైమ్‌ పోలీస్‌ పాత్రలో నటించిన చిత్రం కూడా. తమిళ దర్శకుడు లింగుస్వామి బైలింగ్వల్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. యంగ్‌ సెన్సేషన్‌ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. క్రేజీ కాస్టింగ్‌, లింగుస్వామి వంటి డైరెక్టర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో `ది వారియర్‌`పై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి ట్విట్టర్‌లో టాక్‌ వైరల్‌ అవుతుంది. మరి `ది వారియర్‌` మూవీ ట్విట్టర్‌(The Warrior Movie Twitter Talk) టాక్‌ ఎలా ఉందో చూద్దాం. 
 

సినిమాకి వస్తోన్న ముందస్తు టాక్‌ ప్రకారం, సెన్సార్‌ రిపోర్ట్ ప్రకారం, ట్విట్టర్‌లో వస్తోన్న టాక్‌ ప్రకారం.. సినిమా పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తెలుస్తుంది. రామ్‌ తమిళంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకుగానూ దర్శకుడు లింగుస్వామి `ది వారియర్‌` కథని అంతే పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశారట. అంతకు మించి తెరపై పవర్ ఫుల్‌గా ఆవిష్కరించారని తెలుస్తుంది. The Warrior Review)


సినిమా ఫస్టాఫ్‌ సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ సూపర్‌ గా ఉంటుందట. మొదటి భాగం సూపర్‌ హిట్ అంటున్నారు. ఇక సెకండాఫ్‌ మాత్రం ఊరమాస్‌ గా సాగుతుందని, యాక్షన్‌ ఎపిసోడ్‌లు పూనకాలు తెప్పించేలా ఉంటాయట. రామ్‌ అభిమానులకు మంచి కనువిందు చేసే చిత్రమని, దర్శకుడు లింగుస్వామికిది మంచి కమ్‌ బ్యాక్‌ చిత్రమవుతుందని ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు నెటిజన్లు. 
 

ఇక సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్‌ పొందింది.సినిమా నిడివి 155 నిమిషాలుగా తేల్చారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం కూడా సినిమా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉందని, సినిమా చూస్తున్నంత సేపు వారంతా ఎంజాయ్‌ చేశారని తెలుస్తుంది. వారు సినిమా సూపర్‌ హిట్ అంటూ తమ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడం విశేషం. 

సినిమాలో చాలా వరకు బరువైన యాక్షన్‌, డ్రామా ఎలిమెంట్స్ ఉంటాయట. అవే ఆడియెన్స్ ని కట్టిపడేస్తాయని, రామ్‌ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడని, తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు. పాటలు, రామ్‌, కృతిల డాన్సులు మరో హైలైట్‌గా ఉంటాయని, యాక్షన్‌ సీన్లతోపాటు నటీనటుల పనితీరు బాగుందని, అందరి మెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. రామ్‌ డీఎస్పీ సత్యగా పోలీస్‌ యూనిఫామ్‌ వేసినంత సేపు ఉర్రూతలూగించేలా ఉంటుందని టాక్‌. The Warrior Review.
 

మొదటి భాగంలో రెండు పాటలుంటాయని, సీన్లు కూడా వినోదాత్మకంగా సాగుతాయని ట్వీట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విట్‌ వాహ్‌ అనేలా ఉంటుందట. బుల్లెట్‌ సాంగ్‌, విజిల్‌ సాంగ్‌ లు సెకండాఫ్‌లో వస్తాయని, రెండో భాగంలో వినోదం, యాక్షన్‌ మేళవింపుగా ఉంటుందని, ముఖ్యంగా రామ్‌, ఆది పినిశెట్టిల మధ్య వచ్చే ఫైట్‌ సీన్లు, హొరాహొరీగా పోరాడే సన్నివేశాలు గూస్‌బంమ్స్ తెప్పిస్తాయని, వారి మధ్య వచ్చే సవాళ్లు హైలైట్‌గా నిలుస్తాయని ట్విట్టర్ టాక్‌. 

ఇక రామ్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించగా, శ్రీ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. సుమారు 43కోట్ల బిజినెస్‌తో ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుంది. గురువారం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ముందస్తు బుకింగ్‌ ఆశించినస్థాయిలో లేదనే టాక్‌ ఉంది. అయితే యూఎస్‌ ప్రీమియర్స్ కూడా పడటం లేదట. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో రేపు(గురువారం) పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

Latest Videos

click me!