శ్రీవిష్ణు ‘స్వాగ్’ (Swag) సినిమా రివ్యూ, రేటింగ్!

First Published | Oct 4, 2024, 1:36 PM IST

 శ్రీవిష్ణు అయిదు పాత్రల్లో రకరకాల గెటప్పులతో నటించగా  తెరకెక్కిన సినిమా ‘స్వాగ్’.

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

జనాలకు నవ్వటం ఇష్టం..అలాగే తమను నవ్వించిన ఫన్నీ సీన్స్ లేదా జోక్స్ లేదా డైలాగులను సంవత్సరాల తరబడి గుర్తు చేసుకుని మరీ నవ్వుకోవటం ఇష్టం. అక్కడే కామెడీ సినిమాలు సక్సెస్ అవుతూంటాయి. అయితే ఆ హాస్యం...అపహాస్యం కానంతవరకే. అలాగే కామెడీ సినిమా చేయటం నవ్వినంత ఈజీకాదు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

బలమైన నేపధ్యం, పూర్తిగా డవలప్ అయిన పాత్రలు, సరైన టైమింగ్ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ అవసరం అవుతూంటాయి. రీసెంట్ గా సామజవరగమన అంటూ నవ్వించిన శ్రీవిష్ణు మరోసారి తను గట్టిగా నవ్విస్తానంటూ వైవిధ్యమైన కథ, టైటిల్ తో మన ముందుకు వచ్చారు. అయితే అనుకున్న స్దాయిలో నవ్వించారా...లేక మనకి మనమే కితకితలు పెట్టుకుని నవ్వుకునే స్దితికి తెచ్చాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

రిటైర్డ్ ఎస్సై భవభూతి (శ్రీవిష్ణు)  కు పెన్షన్ బెనిఫిట్స్ ఏమీరావు. అందుకు  ధనలక్ష్మి అనే ఓ మహిళా అధికారి అడ్డుకుంటుంది. ఏం చేయాలో తేల్చుకోలేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైమ్ లో అతనికి ఓ విషయం తెలుస్తుంది.  తాను సామాన్యుడుని కాదని,  శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అందుకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అందులో భాగంగా  వంశవృక్ష నిలయానికి వెళతాడు భవభూతి. అక్కడ వారసత్వం తెలియచేసే పలక సొంతం చేసుకోవాలి. 
 

Latest Videos


Meera Jasmine starrer Swags first look out

మరో ప్రక్క సింగ(శ్రీవిష్ణు) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అతను ప్రేమించిన అమ్మాయి(దక్ష నగర్కర్)ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇతని తండ్రి ఎవరు అనే ప్రశ్న వస్తుంది. దీంతో ఇతనికి కూడా శ్వాగణిక వంశం, వారసత్వ సంపద గురించి తెలుస్తుంది. అయితే ఆ సంపదని దక్కించుకోవాలంటే ఆ వంశం గుర్తు ఉన్న పలక ఉండాలి. అయితే  ఆ పలక ఎవరి దగ్గర ఉంది అంటే...   మగాళ్లని అసహ్యంచుకునే అను(రీతూ వర్మ) దగ్గర ఉంటుంది. 

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

ఆ క్రమంలో భవభూతికి... అనుభూతి (రీతూ వర్మ) కనిపిస్తుంది. శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి కావాల్సిన రాగి పలక ఆమె దగ్గర ఉంటుంది. నిధిని దక్కించుకోవడం తప్పించి తనకు వేరే  మార్గం లేదని గ్రహించిన  భవభూతి   ఎన్నో పన్నాగాలు పన్నుతాడు కానీ ఏవీ వర్కవుట్ అవ్వవు.

అతనికి అడ్డుపడుతున్నది ఎవరు..అలాగే 1551లో పురుషులు ముసుగులు వేసుకొనేలా చేసి మహిళా సాధికారత అంటే ఏమిటో చూపించిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతు వర్మ) కథేంటి. ఆమెకు చెక్ చెప్పిన  భవభూతి మహారాజు (ఒకటవ శ్రీవిష్ణు) స్కెచ్ ఏమిటి... రేవతి (మీరా జాస్మిన్), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరికి దక్కింది? అనేది మిగతా సినిమా.

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

విశ్లేషణ

కామెడీ జానర్ ఉద్దేశ్యం నవ్వించటమే అయినా చాలా సార్లు అది సోషల్ ఇష్యూలపై మాకింగ్ చేయటం, మూఢ నమ్మకాలుని వేలు ఎత్తి చూపించటం, సెటైర్, ఫార్స్ ఇలా రకరకాల ఎలిమెంట్స్ తో నిండి మనని అలరిస్తూంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదేదో చేద్దామని ప్రయత్నమైతే చేసిందని అర్దంమవుతుంది. అయితే అదేంటో సరిగ్గా అర్దం కాదు. శ్రీవిష్ణు ...కమల్ దశావతరాలు టైప్ లో మంచి టైమింగ్ తో కామెడీ చేస్తూంటాడు కానీ నవ్వురాదు. ఎందుకంటే ఆ జోక్ అర్దం కావటానికి చాలా టైమ్ పడుతుంది. అంత కన్ఫూజ్ గా కథను రాసుకున్నాడు దర్శకుడు. 
 

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

సింపుల్ పాయింట్ ని అంతే సింపుల్ గా చెప్తే బాగుండుదని కాంప్లికేటెడ్ గా రాసుకున్నారు. కథకు కావాల్సింది కాంప్లిక్ట్ కానీ కాంప్లికేటెడ్ ఎందుకు అని చూసేవాళ్లకు అనిపిస్తూంటుంది. కథలో ప్లాట్ ఏదో  సబ్ ప్లాట్ ఏదో అర్దంకానంత కలగాపులగం అయ్యిపోయింది.  ఆడ, మగ సమానం అని వారితో పాటు హిజ్రాలు కూడా సమాజంలో సమానం అని చెప్పే కథ ఇది.  

ఇందులో ఏకంగా నాలుగు కాలాల్లో జరిగే కథలను చూపించారు. మొదట అరగంట తెరపై ఏమి అర్దం కాదు. ఏదో కామెడీ ట్రై చేస్తున్నారని తెలుస్తూంటుంది.  సాధారణంగా కథ ముందుకు వెళ్లేకెళిదీ మలుపులతో ఇంట్రస్ట్ గా తయారువుతుంది. ఈ సినిమాలో పూర్తి రివర్స్ . ప్రారంభంలో ఉన్నట్లు కూడా తర్వాత ఉండదు. సెకండాఫ్ లో అయితే చాలా బోర్ కొట్టిస్తుంది. 

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

 ఓ క్రియేటివ్ గా అనుకున్న ఐడియా..నేరేషన్ సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బంది పెడుతుందో ఈ సినిమానే ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. డైరక్టర్ తెలివైన ఆలోచనలు అంతే తెలివిగా చూసే వాళ్లు బుర్ర పెట్టి అర్దం చేసుకోవాలంటే కష్టం కదా. ఓపినింగ్ సీక్వెన్స్  ఓ డిఫరెంట్ సినిమా చూస్తున్నామని నమ్మకం కలిగిస్తుంది. ఓ మూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మూడ్ అనే పదానికే విపరీతార్దం వచ్చేలా మారిపోతంది.

కామెడీ సీన్స్ వస్తూంటాయి. కానీ అవి కామన్ సీన్స్ లాగానే మిగిలిపోతూంటాయి. శ్రీవిష్ణు కష్టం చివరి దాకా చూసేలా నిలబెడుతుంది. ఫస్టాఫ్ చూసి, ఇంటర్వెల్ తర్వాత అయినా సినిమా సరిగ్గా అర్దమయ్యి నవ్వుకుంటాంలే అని ఆశ పెట్టుకుంటాము. అయినా డైరక్టర్ మనని క్షమించడు. సెకండాఫ్ లో కూడా  చెప్పుకోదగ్గ స్దాయిలో నవ్వించడు. రాసి, తీసిన డైరక్టర్ కు క్లారిటీ లేదో, చూసిన మనకు క్లారిటీ లేదో అర్దం కాక తలపట్టుకుని బయిటకు వస్తాము. 

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

టెక్నికల్ గా...

ఈ సినిమాలో ఎక్కువ కష్టం శ్రీవిష్ణుదే.  భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ  ఇలా డిఫరెంట్ పాత్రల్లో చేసుకుంటూ పోయాడు. శ్రీవిష్ణు ఐదు రోల్స్, ఏడు లుక్కుల్లో కనిపించటం అంటే మాటలుకాదు.   రీతూ వర్మ..జస్ట్ ఓకే.  దక్ష కంటే కూడా మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ వి మంచి క్యారక్టర్స్ . మిగతా కీ రోల్స్ లో  సునీల్, రవిబాబు..ల పాత్రలు నడిపిస్తారు. 

డైరక్టర్ గా హసిత్ గోలీ..స్క్రిప్టు దశలోనే డ్రాప్. దాంతో డైలాగులు ఎంత బాగా రాసుకున్నా, మేకింగ్ ఎంత బాగున్నా బూడిదలో పోసిన పన్నీరే కదా. ఇక వేదరామన్ శంకరన్ కెమెరా వర్క్ నీట్ గా డీసెంట్ గా ఉంది. ఈ సినిమాకు పీరియడ్ లుక్ ఇవ్వటంలో జీఎమ్ శేఖర్ ఆర్ట్ వర్క్ చెప్పుకోదగ్గ పాత్ర.

ఎడిటింగ్ చేసిన విప్లవ్ నైషుధం ..సెకండాఫ్ ని అసలు ఎడిట్ చేయలేదేమో అనే డౌట్ వస్తుంది. చేసినా అలా ఉందంటే...ఇంక చెప్పలేము. మ్యూజిక్ విషయానికి వస్తే... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. పాటలు అయితే ఒక్కటి కూడా వినసొంపుగా లేవు. అదేంటో పీపుల్స్ మీడియా వాళ్లు భారీగానే ప్రతీ సినిమాకు ఖర్చు పెడుతున్నారు. కానీ అవుట్ ఫుటే అయోమయంగా మిగిలిపోతోంది. 

#Ritu Varma, #Sree Vishnu, #Swag, review

ఫైనల్ థాట్

కాస్త అర్దమయ్యేటట్లు సినిమా తీస్తే నీ సొమ్మేం పోయింది బాస్? శ్రీ విష్ణు కష్టం మొత్తం స్వాగ్ లో కలిపేసావే.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Ratinig:2
  

click me!