Devara, NTR, JahnaviKapoor, Koratala siva, review
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. ఎన్టీఆర్ సోలో హీరోగా బాక్సాఫీస్ ‘దేవర’ అవుతానంటూ మన ముందుకు వచ్చేసాడు. ఈ నేపధ్యంలో అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపులకు `దేవర` సమాధానం చెప్పారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర`లో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటించింది. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. నేడు శుక్రవారం (సెప్టెంబర్ 27న) విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. .
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
Devara movie review
కథేంటి
1996లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచులు జరిగే స్టేడియాలపై బాంబు దాడి ప్లాన్ చేస్తాడు యతి అనే గ్యాంగస్టర్. దాంతో శివం (అజయ్) తన టీమ్ తో కలిపి యతి కోసం వెతుకుతూ ఆంధ్ర,తమిళనాడు బోర్డర్ లోని రత్నగిరి వెళ్తాడు. అక్కడ యతి కోసం వెతుకుతుంటే.. ముందు మీరు దేవర (ఎన్టీఆర్) గురించి తెలుసుకోవాలంటూ సింగప్ప(ప్రకాష్ రాజ్) అంటాడు. 12 ఏళ్ళ క్రింతం ఆ ప్రాంతంలో భయమంటే ఏంటో చూపించిన దేవర గురించి చెప్పటం మొదలెడతాడు. దేవర మామూలోడు కాదు. చిన్నప్పుడే సొర చేపను చంపి ఒడ్డుకు తెస్తాడు.
తన వాళ్లు రాయప్ప(శ్రీకాంత్), భైరా (సైఫ్ అలీఖాన్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) తో కలిసి సముద్రంపై వేటకు వెళ్తుంటాడు. అయితే జీవితం ఎక్కవ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. ఈ క్రమంలో వారికి మురగ (మురశీ శర్మ) పరిచయం అయ్యి వారికి భారీగా డబ్బు ఆశ పెట్టి ఓ పని ఇస్తాడు. అదేమిటంటే సముద్రంలో వెళ్లే పెద్ద పెద్ద షిప్స్ నుంచి అధికారుల కళ్లు గప్పి సరుకును దొంగలించడం. వీళ్లకు మురగ ఇచ్చే ఆఫర్ నచ్చి అదే పని మీద ఉంటారు.
అయితే దేవర ఓ సారి ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుంటాడు. ఇక దొంగతనం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. తన వాళ్లకు చెప్తాడు .మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ల కూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. , కానీ వాళ్లు వినరు. అప్పుడు అయినా వినని వారిని భయపెడతాడు.
ఎంతలా అంటే ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్లీ సముద్రంలోకి వెళ్లాలంటే భయపడాలని. అయితే ఇదంతా నచ్చని దేవరను మట్టు పెట్టడానికి భైర ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏమిటి, దేవర తన వాళ్లను భయపెట్టడానికి ఏం చేసాడు. ధైర్యవంతుడైన దేవర కొడుకు వరా (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? కథలో తంగం(జాన్వీ కపూర్) పాత్ర ఏమిటి? చివరికి శివంకి యతి దొరికాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
కొరటాల శివ దర్శకుడుగా కంటే రైటర్ గా ఎక్కువ మార్కులు వేయించుకుంటారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఎలివేషన్ ట్రెండ్ లోనే ఓపెన్ చేసాడు. కథను నడిపే విధానం, సీన్స్ డిజైన్ చేసిన విధానం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. కథలో టెన్షన్ ఎలిమెంట్స్ పెట్టి ఎక్కడా డ్రాప్ అవకుండా ఉండేలా ప్లాన్ చేసారు. యతి అనే గ్యాంగస్టర్ తో కథ మొదలెట్టి, దేవర పాత్రని పట్టుకుని కథలోకి వెళ్లటం టెక్నిక్ బాగుంటుంది.
అందుకే ఫస్టాప్ పరుగెడుతుంది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి ఎన్టీఆర్ తో రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేసారు. అప్పటిదాకా భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చూసి ఒక్కసారి కథ జానర్ మారినట్లుగా రొమాంటిక్ మూడ్ లోకి రావటం కాస్త ఇబ్బది పెడుతుంది. అక్కడ డ్రాప్ అయితేనే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎలివేట్ అవుతుందని ఇలా చేసారనిపిస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ లు కూడా బాగా పేలాయి.
అయితే దేవర పాత్రను , అతని సమస్యను పరిచయం చేయటానికే దాదాపు ఫస్టాఫ్ వాడుకున్నారు. ఎంగేజింగ్ గా యాక్షన్ సీన్స్ తో వెళ్లిపోవటంతో సమస్య రాలేదు కానీ లేకపోతే ఇబ్బంది అయ్యిపోయేది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ దాకా సినిమా నెక్ట్స్ లెవిల్ అనిపిస్తుంది. అందుకే ఇంటర్వెల్ చూసి బయిటకు వెళ్లి వచ్చిన ప్రేక్షకుడు అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే రెండో ఎన్టీఆర్ వర పాత్రతో సెకండాఫ్ ప్రారంభమై ,లవ్ స్టోరీతో నడుస్తూ స్పీడు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది.
జాన్వి కపూర్ పాత్ర ను, ఆమెను ప్రెజెంట్ చేసిన విధానం కాస్త వెనక రోజులకు వెళ్లినట్లు అనిపించినా సాంగ్స్ బాగుండటం కలిసొచ్చింది. ఫస్టాప్ ఉన్నట్లు సెకండాఫ్ లేకపోవడంతో ఆడియెన్స్ లో నిరాశ కలుగుతుంది. కథ పరంగానూ ఎంచుకున్న నేపథ్యం వేరుగానీ, స్క్రీన్ ప్లే పరంగా రొటీన్‌గానే ఉంటుంది. ముందుగా ఊహించినట్టుగానే సీన్లు ఉండటం పెద్ద మైనస్. దేవరని చంపేసేందుకు భైర చేసే ప్లాన్ అవన్నీ రొటీన్‌గానే ఉంటుంది. దాన్ని నడిపించిన తీరులో కూడా కొత్తదనం లేదు.
`ఆచార్య`లో పాదగట్టం, `దేవర`లో ఎర్రసముద్రం అంతే తేడా అనేలా ఉంది. కొరటాల గత చిత్రాల మార్క్ చూపించలేకపోయాడు. హీరోయిజానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో అసలు కథ పలుచనైపోయింది. పైగా ఊహించేలా స్క్రీన్ ప్లే ఉండటం పెద్ద మైనస్. బాహుబలిని గుర్తు చేసేలా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కు లీడ్ వదిలిన విధానం బాగుంది. కానీ అందులోనే హింట్ ఇచ్చాడు. ఇప్పటికే బయట జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ట్విస్ట్ ఉండటంతో అసలు లీక్‌ని దర్శకుడే ఇచ్చాడనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా తేలిపోయిందనే చెప్పాలి.
టెక్నికల్ గా
ఎన్టీఆర్, కొరటాల శివ స్దాయి స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాకు టెక్నికల్ గా లోటేముంటుంది. అందులోనూ ఇండస్ట్రీ టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేసారు. అయితే ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది యాక్షన్ కొరియోగ్రఫీ, అనిరిధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రత్నవేలు కెమెరావర్క్. సముద్రం ఎన్ని సార్లు చూసినా అదే అయినా దాన్ని ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయటం బాగుంది.
అలాగే కొరటాల డిజైన్ చేసిన సీన్స్ అనిరుథ్ ఎలివేట్ చేశాడు. కానీ కథలో బలం లేకపోవడం వల్ల ఏం చేసినా అది చప్పగానే మారిపోయింది. పాటల్లో ఇప్పటికే రెండు సూపర్ హిట్స్. కొరటాల డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పదేముంది. మిగతా క్రాప్ట్ కూడా సినిమాకు బాగా కలిసొచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టెక్నికల్‌గా సినిమా బాగుంది. కానీ దానికి కథ, స్క్రీన్ ప్లే కూడా బలంగా ఉంటే సినిమా బాగుండేది. కానీ కొరటాల తన మార్క్ ని మిస్ అయ్యాడు.
ఎన్టీఆర్ ఎలా చేసారంటే
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా ఆయన తన పాత్రను ఓన్ చేసుకుని చేసుకుంటూ వెళ్లిపోయారు. తండ్రిగా,కొడుకుగా లుక్స్ లో పెద్ద తేడా లేకపోయినా, నటనలో వైవిధ్యం చూపించారు. దేవరగా చాలా కాలం ఎన్టీఆర్ గుర్తుంటారు. సైఫ్ ...ఎన్టీఆర్ కు పోటీ గా చేసారు. జాన్వీ గ్లామర్ కే పరిమితం అయ్యింది. మిగతా పాత్రల్లో శ్రీకాంత్, చాకో గుర్తుంటారు.
ప్లస్ లు
ఫస్టాఫ్
ఎన్టీఆర్ అదిరిపోయే పర్‌ఫెర్మెన్స్
యాక్షన్ సీక్వెన్స్ లు
రత్నవేలు ఫోటోగ్రఫీ, అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva, OTT
మైనస్ లు :
రొటీన్ గా అనిపించి స్టోరీ
సాగినట్లు అనిపించిన సెకండాఫ్
ఊహించేలా ఉండే స్క్రీన్‌ప్లే
జాన్వీ కపూర్ పాత్ర అనుకున్న స్దాయిలో లేదనిపించటం
సెకండ్ పార్ట్ కు లీడ్ తేలిపోవడం
పూర్తి కథని చూసిన ఫీలింగ్ మిస్ కావడం
Junior NTR Devara
ఫైనల్ థాట్
దేవర...ఎన్టీఆర్ సినిమాగా ఓ మెట్టు పైనే ఉంది. అయితే ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టి చూస్తే కథలో పెద్దగా ట్విస్ట్ లు కనిపించవు, కొన్ని చోట్ల పాత సీన్స్ తో , రొటీన్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్ అయితే మరీను.. అయితే ఓవరాల్ గా చూస్తే ఫర్వాలేదు. కానీ ఎన్టీఆర్ రేంజ్ మూవీ అనిపించుకోదు.
ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడ ఏ మేరకు నిలదొక్కుకుంటుంది, ఎంత పే చేసి ముందుకు వెళ్తుందనేదే అసలైన క్వచ్చిన్.
Rating: 2.5
బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫి: రత్నవేలు
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
రచన, దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: నందమూరి కల్యాణ్ రామ్
రిలీజ్ డేట్: 2024-09-2024