టామ్‌ క్రూజ్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకొనింగ్‌’ రివ్యూ

First Published | Jul 13, 2023, 7:02 PM IST

 ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) 'ది ఎంటిటీ' సోర్స్ కోడ్  ని కంట్రోల్ చేయాలంటే 'కీ' కావాలి. ఆ 'కీ' తమ చేతికి చిక్కితే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చని కొందరు ప్రయత్నిస్తారు. ఇలాంటి ఓ గమ్మత్తన కథలో..యాక్షన్ తో రూపొందిన చిత్రం ఇది

Mission Impossible Dead Reckoning

 స్పై యాక్షన్‌ థ్రిల్లర్స్‌   అంటే ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ ’ సిరీస్‌ అనే స్దాయిలో పేరు తెచ్చుకున్న ఈ సినిమాలుకు ఆదరణకు ఎప్పుడూ లోటు లేదు. ఈ హాలీవుడ్ చిత్రానికి మన దేశంలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఇవి గమనించి ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఐడియాతో తెరకెక్కిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టామ్‌ క్రూజ్‌ (Tom Cruise)ఈ సినిమాల్లో చేసే విన్యాసాలకు అయితే వీరాభిమానులు ఉన్నారు. ఈ  సీరిస్ లో ఇప్పటివరకూ   6 చిత్రాలు రాగా, ఆఖరి చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒక భాగమే ‘డెడ్‌ రెకొనింగ్‌:పార్ట్‌1’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ కొత్త చిత్రంలో హీరోకు ఇచ్చిన  మిషన్‌ ఏంటి? ఎలా ఉంది, మనవాళ్లకు నచ్చే కథాంశమేనా చూద్దాం. 
 

Mission Impossible Dead Reckoning

స్టోరీ లైన్

రాబోయే రోజుల్లో యుద్దం తీరే మారిపోతుంది.  సముద్రంలో శత్రు దేశాల రాడార్‌లకు కూడా చిక్కకుండా తిరిగే సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌ ని తయారు చేస్తారు. అందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ‘ది ఎంటిటీ’ సోర్స్ కోడ్ ఉంటుంది. దాన్ని కంట్రోలు చేయాలంటే ఓ కీ కావాలి. దాని కోసమే ఈ కథలో అందరూ ప్రయత్నిస్తూంటారు.  అయితే ఆ కీ కు ఓ ప్రత్యేకత ఉంటుంది.  రెండు ‘కీ’లను కలిపి ఒకటిగా చేసి మాత్రమే దాన్ని అన్‌లాక్‌ చేసి, నియంత్రించగలేలా డిజైన్ చేస్తారు. ఊహించని విధంగా  ఆ సబ్‌మెరైన్‌ పేలిపోయి మునిగిపోతుంది. అందులోని వారందరూ చనిపోతారు.  ఆ రెండు ‘కీ’లు సముద్రంలో నుంచి మాయం అవుతాయి. వాటిని దక్కించుకుని ‘ది ఎంటిటీ’ని నియంత్రించగలిగితే  ప్రపంచాన్ని శాసించే శక్తిని సొంతం చేసుకోవచ్చు. 

ఏ టెక్నాలజీనైనా సులభంగా హ్యాక్‌ చేయవచ్చు.  ఆ కీ ను చేజిక్కించుకుని, ఈ ప్రపంచాన్ని శాసించాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. దీంతో ఆ తాళాలు విలన్స్  చేతిలో పడకుండా కాపాడే బాధ్యత మిషన్‌ ఇంపాజిబుల్‌ సీక్రెట్‌ ఏజెంట్‌  ఈథన్ హంట్ (టామ్ క్రూజ్)కు వస్తుంది. అప్పుడు ఈధన్ ఎలాంటి ఫైట్ చేసాడు ? ఆ క్రమంలో ఎదురైన ప్రమాదాలు ఏమిటి? ఈ జర్నీలో కలిసిన గ్రేస్ (హైలీ యాట్‌వెల్), మాజీ ఏజెంట్ ఎల్సా (రెబెక్కా) ఎవరు, వారి క్యారక్టర్స్ ఏమిటి? అలాగే సినిమాలో కీలకమైన వైట్ విడో (వనేసా కొర్బీ), గాబ్రియేల్ (ఇసై మోరల్స్) ఎవరు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.  
 

Latest Videos



ఎనాలసిస్ ...

సినిమాలో స్క్రీన్ ప్లే రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్స్ కు రాసినట్లే రాసినా..ఎక్కడా బోర్ కు అవకాసం ఇవ్వకుండా పరుగెట్టించారు. సినిమా ప్రారంభంలోనే విలన్ లాంటి ‘ది ఎంటిటీ’ వల్ల సబ్‌మెరైన్‌ ఎలా మునిగిపోయిందో చెబుతూ, దాని పవర్ ని చూపించారు.అక్కడ నుంచి ఆ ‘ది ఎంటిటీ’ని కంట్రోలు చేసే  ‘కీ’ చుట్టూ సినిమా తిప్పారు. ఏదో నిధి వేట కోసం ఉంటే రెండు తాళాలు లేదా మ్యాప్ రెండు ముక్కలు చేస్తే ఒకటి ఒకరి దగ్గరా మరొకరి దగ్గరా ఉన్నట్లుగా ...తాళాన్ని రెండు బాగాలుగా చేసి రెండు కలపాలి అని ఎస్టాబ్లిష్ చేసారు. ఆ రెండు తాళాల  కోసం హీరో ఈథన్‌ హంట్‌ రంగంలోకి దిగడంతో స్క్రీన్ ప్లే పరుగెడుతుంది. 

ఈ చిత్రం ఖచ్చితంగా మంచి థ్రిల్స్ ని అందించేందుకు, పరుగులు పెట్టిస్తూ యాక్షన్ ని అందించేందుకు ప్రయత్నించింది అనటంలో సందేహం లేదు. అయితే ఇలాంటి భారీ యాక్షన్‌ సీన్లు ఛేజింగ్‌లు, మాస్క్‌లతో ముఖాలను మార్చి శత్రువులను దెబ్బ తీయటం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ లు రెగ్యులర్ గా  చూసేవాళ్లకు కొత్తేమీ కాదు. వారికి అవి రొటీన్ అనిపించినా..చూస్తున్నంతసేపు మాత్రం బాగా ఎంగేజ్ చేసారు. అయితే ట్విస్ట్ లు మరికొన్ని ఉండాల్సిందేమో ..పూర్తిగా యాక్షన్ కే అవకాసం ఇచ్చారు కానీ ప్లాట్ ట్విస్ట్ లను పట్టించుకోలేదు. సెకండ్ పార్ట్ ఉందని దాచి పెట్టారేమో మరి. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) చుట్టూ కథ అల్లటం. మారుతున్న కాలంలో వస్తున్న టెక్నాలిజీ మార్పులను సినిమాలో రిప్రజెంట్ చేయటం నచ్చే అంశం. 

mission impossible Dead Reckoning

 
అయితే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ‘ది ఎంటిటీ’గురించి కాస్తైనా వివరణ ఇస్తే క్రింద స్దాయి మాస్ ప్రేక్షకులకు ఇది అర్దమై కిక్ ఇస్తుంది. లేకపోతే వాళ్లు అసలు విషయం అర్దం కాక నోరెళ్లపెట్టి యాక్షన్ సీక్వెన్స్ లను చూస్తూండిపోవాల్సి వస్తుంది.ఇక అరవై దాటిన వయస్సులోనూ యంగ్ హీరోలు కూడా సాధ్యం కానీ రీతిలో టామ్ క్రూజ్ చేసే ఎడ్వెంచర్స్ ఆశ్చర్యం అనిపిస్తాయి.   క్లైమాక్స్ లో ట్రైన్ ఎపిసోడ్ ... పసుపు రంగు కార్ లో ఛేజింగ్ సీక్వెన్స్.. లోయ లోకి హీరో డెడ్లీ బైక్ జంప్  వంటి సీన్స్ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ని రప్పిస్తాయి.   అయితే ఫస్టాఫ్,సెకండాఫ్ మొత్తం కథలో మార్పులు లేకుండా  ఒకే కీ చుట్టూ తిరగటం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించే అంశమే. సినిమాలో అదిరిపోయిన సీన్ మాత్రం ది ఎంటీటీ’ ఈథన్‌ హంట్‌  ప్రెండ్ లా మాట్లాడుతూ అతడిని తప్పుదోవ పట్టించటమే.  

Image: Mission Impossible: Dead Reckoning


టెక్నికల్ గా ...

ఈ సినిమా పూర్తి స్దాయి టెక్నాలిజీని వాడుకుంటూ చేసిన చిత్రం. అద్భుతమైన కెమెరా వర్క్, ఎక్కడా ల్యాగ్ లేకుండా పరుగెత్తించే ఎడిటింగ్ తో ఓ గేమ్ లా చిత్రంగా సినిమా పరుగెడుతుంది. ఇక  బ్యాక్ గ్రౌండ్ స్కోర్  గురించి అయితే చెప్పక్కర్లేదు. యాక్షన్ సీన్స్ కు పోటీ ఇస్తూ సాగింది. ప్రొడక్షన్ డిజైన్  కూడా చాలా బాగా చేసారు.   దర్శకరచయిత ఎలాగైనా ఈ కాలం ప్రేక్షకుడుని అలరించాలని ఫిక్సై అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు అర్దమవుతుంది.

నటీనటుల్లో ..ఈథన్‌ హంట్‌ గా టామ్‌ క్రూజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ సిరీస్‌ కోసమే పుట్టినట్లు ఉంటాడాయన.  గ్రేస్ పాత్రలో హైలే ఎట్‌వెల్,  సైమన్ పెగ్, వింగ్‌ రెహమ్స్‌లు అందరూ పోటీ పడ్డారు.  విలన్ గాబ్రియల్‌గా ఇసాయ్‌ మోరల్స్‌ అదరకొట్టాడు.  సెకండ్ పార్ట్ లో ఈ పాత్ర హైలెట్ అవుతుందనిపించేలా క్లూ వదిలుతూ ముగించారు.
 

Image: Mission Impossible: Dead Reckoning


ప్లస్ లు 
కళ్లార్పకుండా చూసేలా డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ 
టామ్‌ క్రూజ్‌ 
  సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
డైరక్షన్

మైనస్ లు

కథకు కీలమైన‘ది ఎంటిటీ’గురించి మరింత వివరణ లేకపోవటం
ఫస్టాఫ్,సెకండాఫ్ టార్గెట్ ఒకే కీ అన్నట్లు సాగటం
రన్ టైమ్ ఎక్కువ అవటం
 

Image: Mission Impossible: Dead Reckoning


ఫైనల్ థాట్

సినిమా ఎండింగ్ కు వచ్చాక ఇప్పటిదాకా చూసిన ఈ ఫస్ట్ ఫార్ట్ కేవలం కథ పరిచయం మాత్రమే... అసలు కథలో సెకండ్ పార్ట్ లో ఉంచేసారు...అని తెలిసాక..పెద్ద నిట్టూర్పు వస్తుంది.. అప్పటిదాకా వెయిట్ చేయాలా?

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3.5

Image: Mission Impossible: Dead Reckoning

నటీనటులు: టామ్ క్రూజ్, హైలీ యాట్‌వెల్, వింగ్ రైమ్జ్, సైమన్ పెగ్, రెబెక్కా, హెన్రీ చెర్నీ, వనేసా కొర్బీ, పోమ్, ఇసై మోరల్స్ తదితరులు; 
సంగీతం: లోర్న్ బెల్ఫ్; 
సినిమాటోగ్రఫీ: ఫ్రెజర్ టాగ్గర్ట్; 
ఎడిటింగ్‌: ఎడ్డీ హామిల్టన్‌;
 రచన: క్రిస్టోఫర్ మెక్ క్వారీ, ఎరిక్ జెండ్రెస్సెన్; 
నిర్మాతలు: టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్ క్వారీ;
 దర్శకత్వం: క్రిస్టోఫర్ మెక్ క్వారీ

click me!