Bhaag Saale review
క్రైమ్ కామెడీ సినిమాలకు మన తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయితే అలాంటి సినిమాలు అడపాదడపా వస్తూంటాయి. రొమాంటిక్ కామెడీలు వచ్చినంతగా ఈ తరహా సినిమాలు రావు. అందులోనూ మనకు గుర్తుండిపోయిన క్రైమ్ కామెడీలు అంటే క్షణ క్షణం, స్వామిరారా వంటి అతి తక్కువ సినిమాలు. అయితే ఈ జానర్ తో మంచి హిట్ కొట్టవచ్చని భావించి 'భాగ్ సాలే' చేసారు. ఓ కొత్త తరహా యానిమేషన్ వీడియోతో బజ్ క్రియేట్ చేసారు. సినిమాకు హిట్ టాక్ వస్తే ఓ లుక్కేద్దామని చాలా మంది వెయిటింగ్. మరి ఈ సినిమా ఎలా ఉంది. సినిమా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుందని మనకు టీజర్, ట్రైలర్ లతో తెలిసింది. ఇంతకీ ఆ ఉంగరం కథేంటి..సినిమా ఎలా ఉందో చూద్దాం.
స్టోరీ లైన్:
అర్జున్ (శ్రీ సింహ కోడూరి) కొద్దిగా కన్నింగ్, ఏదైనా చేసి ఎదిగిపోవాలనే తత్వం. అందుకోసం అబద్దాలు ఆడి ఓ పెద్దింటి అమ్మాయి మాయ (నేహా సోలంకి)ని ప్రేమలో పడేస్తాడు. ఆమె తన తండ్రికు పరిచయం చేస్తుంది. అంతా సెట్ అయ్యిపోతుందనుకునే టైమ్ లో అతని జీవితంలోకి శామ్యూల్ (జాన్ విజయ్) వస్తాడు. శామ్యుల్ తన గూండా బ్యాచ్ ని వేసుకుని షాలి సుకా గజా అనే పేరుగల డైమండ్ ఉన్న ఓ ఆ ఉంగరం కోసం వెతుకుతూంటారు. ఆ ఉంగరం గిప్ట్ గా ఇచ్చి తను ఇష్టపడే నళిని (నందిని రాయ్) ని దక్కించుకోవాలని ప్లాన్. ఆమెకు ఆ ఉంగరం అంటే ఇష్టం. దాంతో ఆ ఉంగరం కోసం గాలిస్తూన్న క్రమంలో ఆ ఇంటి వారసులు అయిన ...హీరోయిన్ మాయ కుటుంబం అని తెలుస్తుంది. దాంతో ఆమె తండ్రిని కిడ్నాప్ చేసి ..ఆ ఉంగరం తెచ్చివ్వమంటారు. ఆమె వచ్చి అర్జున్ కు చెప్తుంది..ఎలాగైనా ఆ ఉంగరం తెచ్చి ఇచ్చి తన తండ్రిని కిడ్నాప్ నుంచి బయిటకు తీసుకురమ్మని చెప్తుంది. అక్కడ నుంచి విలన్ శ్యాముల్ వెంటబడ్డ...అర్జున్ జీవితం ఏ టర్న్ లు తీసుకుంది. మధ్యల రమ్య (వర్షిణి సౌందర్ రాజన్), పోలీస్ ప్రామిస్ రెడ్డి (స్వామి రారా సత్య) కథ ఏమిటి? చివరకి, ఆ ఉంగరం తెచ్చి తన ప్రేమను సాధించుకున్నాడా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రైమ్ కామెడీలలో క్రైమ్ ఎంత ఫెరఫెక్ట్ గా స్ట్రాంగ్ గా,నమ్మశక్యంగా ఉంటుందనే విషయంపై దాన్నుంచి కామెడి ఏ స్దాయిలో పండుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలో కీలకమైన వజ్రాల ఉంగరం గురించి యానిమేషన్ వీడియోతో బాగానే ఎస్టాబ్లిష్ చేసారు. దాని నుంచి పగలబడి నవ్వేటంత కామెడీ పండలేదు కానీ కొన్ని మంచి జోక్స్ బాగానే పేలాయి. కామెడీ సీన్స్ ను కూడా బాగానే రాసుకున్నారు. టైటిల్ ని జస్టిఫై చేస్తూ ప్రారంభం నుంచి సినిమా పరుగెడుతూనే ఉంటుంది. రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. అయితే థ్రిల్లింగ్ సీన్స్, ట్విస్ట్ లు లేవు.అలాగే నాలుగైదు ట్రాక్స్ ఉన్నా క్లైమాక్స్ కంగాళీ కాకుండా బాగా డిజైన్ చేసారు. సత్య ఉన్నది కొద్ది సేపైనా బాగానే నవ్వించారు. సినిమాలో గ్యాప్ లు లేవు. వరస పెట్టి సీన్స్ వస్తూనే ఉన్నాయి.. పాయింటాఫ్ ఇంట్రస్ట్ తో సీన్స్ నడపటంతో బోర్ కొట్టే అవకాసం లేదు. అయితే ఇంకా బాగా చేస్తే బాగుంటుందనిపిస్తుంది. అయితే ప్రతీ సారి ప్రతీసినిమాకు అలాగ అనిపిస్తూనే ఉంటుంది. అయితే కాస్తంత బూతులు తగ్గిస్తే బాగుండేది. ఫన్ విషయంలో ఇంకాస్త డోస్ పెంచవచ్చు. థ్రిల్స్ కూడా పెట్టుకుని ఉంటే ఈ సినిమా మరో స్దాయికి వెళ్లేది.
టెక్నికల్ గా ...
ఈ సినిమాలో చెప్పుకోదనిది కాల భైరవ మ్యూజిక్.. పాటలు బావున్నాయి. ట్రెండీగా, పెప్పీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కెమెరా వర్క్ నీట్ గా బాగుంది. ఎడిటింగ్ కొన్ని అనవసరమైన ట్రాక్ లు తగ్గిస్తే మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రామకృష్ణ మాస్టర్ ఈ సినిమాకు యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారు. ఇందులో ఉన్న నాలుగైదు ఫైటింగ్ సీక్వెన్స్‌లు బాగా పండాయి. దర్శకుడు గతంలో సూర్యకాంతం సినిమా ,ముద్ద పప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ చేసారు. ఆ స్దాయిలోనే ఈ సినిమాని క్రైమ్ కామెడీగా మెప్పించారు.
Bhaag Saale Teaser
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ ..
శ్రీసింహాది అయితే దొంగనా కొడుకు లాంటి పాత్ర. ఆ పాత్రకు సింహా పూర్తి న్యాయం చేసారనే చెప్పాలి. వర్షిణి ఓ ఫ్రస్టేటెడ్ అమ్మాయిలా కనిపించింది. ఆమెకంటూ ప్రత్యేకమైన కారెక్టరైజేషన్ ఉండటంతో కొత్తగా ఉంది. నేహా సోలంకి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ పాత్రలో బాగా చేసింది. తమిళ నటుడు జాన్ విజయ్, 'వైవా' హర్ష కాంబినేషన్... ఫెరపెక్ట్ గా సింక్ అయ్యింది. సత్య ఉన్నది కొద్దిసేపైనా బాగానే నవ్వించారు. ఆర్జే హేమంత్ చేయటానికి ఏమీలేదు. రాజీవ్ కనకాల కూడా కొన్ని సీన్స్ లో ఫన్ బాగా చేసారు.
Bhaag Saale review
ప్లస్ లు ..
శ్రీ సింహా క్యారక్టరైజేషన్
విలన్ మేనరింజంలు
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని ఫన్ ఎపిసోడ్స్
మైనస్ లు
సినిమా పరుగెడుతూనే ఉన్నా కథ ఆ స్దాయిలో పరుగెట్టకపోవటం
ఎమోషన్స్ తో కామెడీని బాలెన్స్ చేయకపోవటం
Bhaag Saale review
ఫైనల్ థాట్
ఓ కామెడీ సినిమాగా నవ్వు కోవటం కోసం చూస్తే బాగుందనిపిస్తుంది. వీకెండ్ కు మంచి కాలక్షేపం అవుతుంది. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది
Rating:2.5
Bhaag Saale review
నటీనటులు : శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, పృథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి తదితరులు
ఛాయాగ్రహణం : రమేష్ కుషేందర్
సంగీతం : కాల భైరవ
నిర్మాతలు : అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల
కథ, కథనం, దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
విడుదల తేదీ : జూలై 7, 2023