బోయపాటి శ్రీను అంటే మాస్ సినిమాలకు కేరాఫ్. మాస్‌కే పూనకాలు తెప్పించేలా ఆయన సినిమాలుంటాయి. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆయన రామ్ హీరోగా `స్కంద` సినిమాని తెరకెక్కించారు. రామ్ ని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ లుక్‌లో చూపించారు. కల్ట్ మాస్‌గా చూపించే ప్రయత్నం చేసినట్టు టీజర్, ట్రైలర్స్ లో చూస్తుంటే అర్థమవుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయీ మంజ్రేఖర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు గురువారం(సెప్టెంబర్ 28)న విడుదలైంది. మరి బోయపాటికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ దొరికితే ఎలా చూపించాడు? `అఖండ` తర్వాత వస్తోన్న సినిమా ఆ (Skanda Movie Review) అంచనాలను అందుకుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఐటీ సంస్థ అధిపతి రామకృష్ణరాజు(శ్రీకాంత్) తన సంస్థలో అక్రమాలు, అఘాయిత్యాల ఆరోపణలతో జైలుకెళ్తాడు. ఆయన తప్పులను ఒప్పుకోవడంతో కోర్ట్ ఉరి శిక్ష వేస్తుంది. మరోవైపు ఆసుపత్రిలో ఆయన కూతురు(సాయీ మంజ్రేకర్) చావుబతుతో పోరాడుతుంది. కట్ చేస్తే.. ఏపీ సీఎం(అజయ్ పుర్కర్) కూతురుని తెలంగాణ సీఎం(శరత్ లోహితస్వా) కొడుకు పెళ్లి పీఠల మీద నుంచి లేపుకొస్తారు. తన పరువు పోయిందని భావించి తెలంగాణ సీఎం కి వార్నింగ్ ఇస్తాడు ఏపీ సీఎం. దీంతో తెలంగాణ సీఎంని చంపేందుకు తన మనిషిని పంపిస్తాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో సీఎంని ఏపీ సీఎం మనుషులు టార్గెట్ చేయగా, వారి నుంచి స్కంద(రామ్) కాపాడతాడు. ఆ తర్వాత కాలేజ్‌లో తెలంగాణ సీఎం కూతురు(శ్రీలీల)కి దగ్గరవుతాడు. తన కొడుకుతో ఏపీ సీఎం కూతురికి ఎంగేజ్‌మెంట్ చేస్తారు. ఆ ఫంక్షన్‌కి వెళ్లిన స్కంద.. అందరికి షాకిస్తూ విధ్వంసం సృష్టించి అటు ఏపీ సీఎం కూతురు, ఇటు తెలంగాణ సీఎం కూతురుని తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే ఈ ఇద్దరిని తీసుకుని స్కంద తన ఊరైన రుద్రరాజపురంకి వెళ్తారు. స్కంద ఇద్దరు సీఎం కూతుర్లని ఎందుకు తీసుకొచ్చాడు, వారితో ఆయనకున్న గొడవేంటి? రామకృష్ణరాజుకి, స్కంద ఫ్యామిలీకి ఉన్న లింకేంటి? రామకృష్ణరాజుకి, రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధమేంటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం మిగిలిన(Skanda Movie Review) కథ.
విశ్లేషణః
బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ అంశాలకు కేరాఫ్. ఆయన సినిమాలో యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. మధ్యలో ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉంటాయి. అన్నింటికి మించిన ఎలివేషన్లకు కొదవలేదు. లేకలేనన్ని యాక్షన్ సీన్లుంటాయి. ఎక్కడ సినిమా డ్రాప్ అవుతుందనిపిస్తుందో అక్కడ యాక్షన్‌తో లేపుతాడు ఆ లాజిక్కులు, మ్యాజిక్కులు బాగా తెలిసిన డైరెక్టర్. అందుకే సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. `స్కంద` సినిమా విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు. తన మార్క్ సీన్లతో మాస్ యాక్షన్ రోలర్ కోస్టర్‌లా ఈ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే బోయపాటి సినిమాల్లో యాక్షన్, సెంటిమెంట్లు సీన్లే కాదు, పవర్ ఫుల్ డైలాగులుంటాయి, పొలిటికల్ డైలాగుంటాయి. కచ్చితంగా రాజకీయ నాయకులను, రాజకీయాలను టార్గెట్ చేస్తాడు. ఇందులో ఆ విషయంలో ఇంకాస్త ఎక్కువే పెట్టాడు. డోస్ తగ్గకుండా చూసుకున్నాడు. దీంతో అన్ని అంశాలను బ్యాలెన్స్ (Skanda Movie Review) చేస్తూ తెరకెక్కించాడు.
సినిమా ప్రారంభం.. ఐటీ దిగ్గజం రామకృష్ణరాజు పాత్రలో నటించిన శ్రీకాంత్ జైల్లో మగ్గడం, ఆయనపై అనేక ఆరోపణలో కోర్ట్ ఉరిశిక్ష వేయడం అనే ప్లాష్ బ్యాక్ అంశాన్ని ప్రారంభంలో చూపించి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాడు బోయపాటి. ఆ తర్వాత సినిమాని మొత్తం పొలిటికల్ అంశాల చుట్టూ తిప్పాడు. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం అంటూ రెండు రాష్ట్రాలను ఇందులో ఇన్‌వాల్వ్ చేస్తూ, ఆయా రెండు రాష్ట్రాలకు దగ్గరగా ఉండే అంశాలను ఇందులో టచ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో రామ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. దున్నపోతు(బుల్)ని పట్టుకుని రామ్ ఎంట్రీ ఇచ్చిన తీరు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఇటు రామ్ ఫ్యాన్స్ ని, అటు బోయపాటి ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉంటుంది. ఇందులో మొదటి భాగం ఏపీ సీఎం తెలంగాణ సీఎంని చంపేసేందుకు ప్రయత్నం చేయడం, దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా రామ్ అడ్డుకోవడం వంటి సీన్లతో సాగుతుంది. ఇక ఇంట్వర్వెల్‌లో మాత్రం ఇద్దరి షాకిచ్చేలా రామ్ వ్యవహరించిన తీరు అదిరిపోయింది. ట్విస్ట్ వామ్ అనిపించేలా ఉంటుంది.
సెకండాఫ్..లో రామ్ ఎవరు? అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఐటీ దిగ్గజం శ్రీకాంత్ పాత్రకి ఉన్న సంబంధాలను చూపించారు. అందులో ఫ్యామిలీ ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇచ్చారు. ఫంక్షన్, పండుగలు, ఇంట్లో ఆడవారి హడావుడి, ఊర్లో రామ్ వెంట అమ్మాయిలు పడటం, వంటి సరదా సన్నివేశాలు, మరోవైపు ఫ్యామిలీ విలువలు, తల్లిదండ్రులు గొప్పతనం రామ్‌తో చెప్పించే సీన్లు ఎమోషన్ గా సెంటిమెంట్‌ని రగిలిస్తూ గుండె బరువెక్కించేలా ఉంటాయి. ఆ కాసేపు సరదాగా (Skanda Movie Review) తీసుకెళ్లి, ఆ తర్వాత సినిమా మళ్లీ సీరియస్ మూడ్‌లోకి వెళ్తుంది. మళ్లీ సీఎంలకు, రామ్ ఫ్యామిలీ మధ్య గొడవ ఆ తర్వాత తాడో పేడో తేల్చుకోవాల్సి రావడం వంటి అంశాలు పీక్‌లో చూపించాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పీక్‌లో ఉంటుంది. అక్కడ యాక్షన్ సీన్లు సైతం అదిరిపోయేలా డిజైన్ చేశాడు బోయపాటి. దీంతో ఆడియెన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చొని సినిమా చూసేలా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కి సంబంధించి ముందే హింట్ ఇచ్చినా, అక్కడ మాత్రం అది నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.
బోయపాటి సినిమా అంటే లాజిక్‌లు ఉండవు, ఓన్లీ మ్యాజిక్. ఆయన యాక్షన్ సీన్లు, మాస్ సీన్లు, ఫ్యామిలీ సెంటిమెంట్, ట్విస్ట్ లు వీటికే ప్రయారిటీ ఉంటుంది. అదేలా ఇదేలా అనే ప్రశ్నలకు సమాధానం ఉండదు. యాక్షన్ సీన్లలో కథని వెతుక్కోవల్సి ఉంటుంది. ఇందులోనూ అలాంటి సీన్లు చాలానే ఉంటాయి. కానీ మాస్ జాతరలో అవన్నీ లైట్ అనే ఫీలింగ్ కలుగుతాయి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బీజీఎం ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అదే సమయంలో కొంత మైనస్ కూడా. పాటలు అంతగా ఆకట్టుకోలేదు, కానీ రామ్ డాన్సులు, చివరి పాటలో రామ్, శ్రీలీల డాన్సులు అదరగొడతాయి. మాస్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. కానీ పాటలకి, ఫైట్స్ కి తేడా లేకుండా థమన్ బీజీఎం ఇవ్వడం మైనస్. సౌండ్ ఓవర్ అయిపోయింది. బోయపాటి సినిమాలను ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. నచ్చని వారికి ఓవర్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండటం, అది సస్పెన్స్ తో ఉండటంతో రెండో పార్ట్ పై ఆసక్తి రేకెత్తించేలా ఉంది.
పొలిటికల్ సెటైర్లు, వార్నింగ్‌లు..
సినిమాలో చాలా పొలిటికల్ డైలాగులున్నాయి. టీజర్,ట్రైలర్లో చూపించినట్టుగానే రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ చాలా డైలాగులు, సీన్లు పెట్టాడు బోయపాటి. అవి సినిమాని మరింత రంజుగా మార్చాయి. శ్రీకాంత్ పాత్రలో ఒకప్పటి ఐటీ దిగ్గజం సత్యం రామలింగరాజు కేసు అంశాలు, అప్పుడు జరిగిన పరిణామాలకు టచ్ చేశాడు. అలాగే ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. అక్కడి పాలన, అక్కడి తాగే లిక్కర్స్ పై గట్టి పంచ్‌లు వేశాడు. కాలేజ్‌లో రామ్ (Skanda Movie Review) పాత్ర చెప్పే డైలాగులు కూడా సీఎం జగన్‌ని టార్గెట్‌గా ఉంటాయి. మరోవైపు జైల్లో శ్రీకాంత్ ఉన్న సీన్లు, ఇద్దరు సీఎంలకు రామ్ ఇచ్చే వార్నింగ్.. చంద్రబాబుని జైల్లో పెట్టించిన సన్నివేశాలను తలపిస్తుంటాయి. మరోవైపు రచ్చ రవి పాత్రతో తెలంగాణ ప్రభుత్వంపై, ఏపీ, తెలంగాణ రాజకీయాలపై పంచ్‌లు వేయించాడు. అవన్నీ అటు ఇటుగా చెప్పినా, పంచ్‌లు, సెటైర్లు మాత్రం గట్టిగానే ఉన్నాయని చెప్పొచ్చు. అవి హాట్ టాపిక్‌గానూ ఉన్నాయి.
నటీనటులుః
రామ్ ఎనర్జీ ఈ సినిమాలో నెక్ట్స్ లెవల్. ఆయన రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో అదరగొట్టాడు. ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన ఓ రకంగా తన విశ్వరూపం చూపించాడు ఇప్పటి వరకు కాస్త లవర్ బాయ్‌గా, `ఇస్మార్ట్ శంకర్` వంటి చిత్రాల్లో మాస్ లుక్‌లో కనిపించినా, ఇందులో మాత్రం దాన్ని నెక్ట్స్ లెవల్‌లో చూపించాడు. ఆయన ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉంది. ఇక శ్రీలీల పాత్ర కాసేపు ఆకట్టుకుంటుంది, అలరిస్తుంది. ఆమె డాన్సు చివరి పాటలోనే కనిపిస్తుంది. సాయీ మంజ్రేకర్ పాత్ర (Skanda Movie Review) ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. శ్రీకాంత్‌కి మరో బలమైన పాత్ర పడింది. ఎమోషనల్‌గా శ్రీకాంత్ అదరగొట్టాడు. ఇద్దరు సీఎంలుగా అజయ్ పుర్కర్, లోహిత్ బాగా చేశారు. పృథ్వీరాజ్ పాత్ర సైతం కాస్త కామెడీని పంచేలా ఉంటుంది. రచ్చ రవి ఉన్నది కాసేపే అయినా రచ్చ చేశాడు. ఇంద్రజ, గౌతమి, ఇతర పాత్రలు ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
టెక్నీకల్ గా సినిమాకి థమన్ బీజీఎం అసెట్. కాకపోతే ఓవర్‌డోస్ అనిపించింది. పాటలు, ఫైట్స్ కి సౌండ్ విషయంలో తేడా లేకుండా కొట్టడం మైనస్. పాటల విషయంలో తేలిపోయింది. సౌండ్ తప్ప లిరిక్ వినిపించదు. అయితే థమన్‌రెగ్యూలర్‌గానే కొట్టాడు కానీ, కొత్త దనం చూపించలేకపోయాడు. దీంతో అది రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక సంతోష్ విజువల్స్ బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఆహ్లాదకరంగా అనిపించాయి. తమ్మిరాజు ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి నిర్మాణ (Skanda Movie Review) విలువలు బాగున్నాయి. చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఖర్చు విషయంలో రాజీపడలేదని అర్థమవుతుంది. దర్శకుడు బోయపాటి తనదైన మార్క్ సినిమాని చేసుకుంటూ వెళ్లాడు. తన స్టయిల్లో చేశాడు. రామ్‌ని తనకు అనుగుణంగా మార్చుకుని రఫ్ఫాడించాడు. మరో మాస్ జాతరని ఆడియెన్స్ కి అందించాడు.
ఫైనల్‌గాః బోయపాటి-రామ్ మాస్ జాతర.
రేటింగ్‌ః2.75