విజువల్ పోయిట్రీనే కానీ... ‘సప్త సాగరాలు దాటి’రివ్యూ

First Published | Sep 22, 2023, 1:32 PM IST


కన్నడలో సూపర్ హిట్  సినిమా సప్త సాగరదాచే ఎల్లో.  ప్రేమకథ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్ డ్రామాగా తెరకెక్కింది.ఇప్పుడు ఈ సినిమా తెలుగులో సప్త సాగరాలు దాటి అనే టైటిల్ తో  విడుదలైంది. 

Rakshit Shetty Sapta Sagaradaache ello


కన్నడ డబ్బింగ్ సినిమాలు ఈ మధ్యకాలంలో తెలుగులో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే  కన్నడలో హై సక్సెస్  సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో డబ్బింగ్ చేసారు. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి ఈ సినిమాలో హీరో కావటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ లవ్ స్టోరీ తెలుగు వారికి నచ్చుతుందా...ఈ టైటిల్ కి  పార్ట్-1, పార్ట్-2 అని కాకుండా సైడ్-A, సైడ్-B అని పెట్టడానికి కారణమేంటి? ‘777 చార్లీ’లాగ వర్కవుట్ అవుతుందా ? రివ్యూలో చూద్దాం.

Rakshit Shetty Sapta Sagaradaache ello

కథేంటి

మ‌ను (ర‌క్షిత్ శెట్టి), ప్రియ‌(రుక్మిణి వ‌సంత్‌) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటూంటారు.  రేపో,మాపో పెళ్లి చేసుకుందామనుకుంటారు.వాళ్ల జీవితాశయం ..బీచ్ ఒడ్డున ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండాలి. అయితే మనకు అంత సీన్ లేదు. అతను ఓ బిజినెస్ టైకూన్ శేఖర్ గౌడ(అవినాష్) దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూంటాడు. ఓ రోజు శేఖర్ గౌడ్ కొడుకు ఓ  హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు తాను బయిటపడటం కోసం మనుకు  30 లక్షలు ఎర చూపి ఒప్పిస్తారు. అడ్వాన్స్ గా 3 లక్షలు ఇస్తారు. అంతేకాదు మూడు నెలల్లో జైలు నుంచి బెయిల్ పై బయిటకు తెస్తానని గౌడ్ హామీ ఇస్తాడు. దాంతో  అన్నిటికి ఒప్పుకోవటంతో ఆ యాక్సిడెంట్ కేసులో మ‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపిస్తారు. కానీ అనుకోని విధంగా గౌడ కు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మ‌నును జైలు నుంచి విడిపిస్తాన‌ని మాటిచ్చిన  ఆయన ఆ హామీని ఎందుకు నిల‌బెట్టుకోకుండానే పైకెళ్లిపోతాడు. ఆ తర్వాత అతన్ని జైలు నుంచి బయిటకు తీసుకురావటానికి ఎవరూ ఆసక్తి చూపరు. మరో ప్రక్క జైలు నుంచి బయిటకు వస్తాడని ప్రియ ఎదురుచూస్తూంటుంది. అప్పుడు ఏమైంది...?  డ‌బ్బు కోసం చేయ‌ని నేరాన్ని మ‌ను జీవితం ఏ మలుపు తీసుకుంది? అసలు నిజం తెలిసి ప్రియ ఏం చేసింది?  జైలులో  గ్యాంగ్ లు కార‌ణంగా మ‌ను ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు? చివరకు వాళ్ల ప్రేమ కథ ఏమైంది అనేది స‌ప్త సాగ‌రాలు దాటి మూవీ క‌థ‌.
   


Rishab Rukmini Sapta sagaradaache ello director Hemanth Rao

విశ్లేషణ

ప్రియురాలి క‌ల‌ను నెర‌వేర్చ‌డం కోసం చేయని నేరాన్ని త‌న‌పై వేసుకున్న ఒకడు  ఆమెకు శాశ్వ‌తంగా ఎలా దూర‌మ‌వ్వాల్సివ‌చ్చింద‌నేది భావోద్వేగ‌భ‌రితంగా స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన ప్రయత్నం ముచ్చటేస్తుంది. వాస్తవానికి ఈ కథను ఇలాగే  చెప్పి ఏ హీరోని,నిర్మాతని ఒప్పించలేరు. కానీ డైరక్షన్ కన్విక్షన్ ని నిర్మాత కమ్ హీరో రక్షిత్ శెట్టి నమ్మారు.  పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినట్లున్నారు. దాంతో ఆ దర్శకుడు తెరపై ప్రేమ కవిత్వాన్ని విజువల్స్ తో చెప్పే ప్రయత్నం చేసారు. కవిత్వం ఎవరికి నచ్చుతుంది అనేది ఇండిడ్యువల్ ఎక్సపీరియన్స్.  చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చూసే అవకాసం ఇస్తుందీ సినిమా. కమర్షియల్ యాస్పెక్ట్ లోంచి చూస్తే మాస్ మసాలాలు ఏమీ అద్దని ఈ సినిమా అర్దం కాదు. ఆ పాత్రలతో ప్రయాణం చేస్తూ ఆ సముద్ర నేపధ్యాన్ని ఆస్వాదిస్తూ..లీడ్ పెయిర్ ఎడబాటుని,విడిపోవటంలో ఉండే విషాదాన్ని మీరు మనస్సుకు ఎక్కించుకోగలిగితేనే ఈ సినిమా నచ్చుతుంది.

sapta sagaradaache ello

 దర్శకుడు చాలా స్లోగా మనలోకి ఆ ప్రేమ ప్రవాహాన్ని నెట్టే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే కన్నడ సినిమాకు ఉండే కొన్ని క్లీషేలు మీకు ఈ సినిమాలో కనిపించవచ్చు. కొన్ని విషయానికి లీడ్ పెయిర్ ఎందుకు అలా మానసికంగా కదిలిపోతున్నారు అనిపిస్తే అది మన తప్పు కాదు..ఇన్నేళ్లుగా చూస్తున్న కమర్షియల్ సినిమాల ప్రభావమే. ఏమీ లేదు అనుకున్న చోట..ఏదో ఉంది అనిపిస్తూ ముందుకు తీసుకెళ్లటం కత్తి మీద సామే. అందుకు స్క్రిప్టు , డైరక్టర్ కు ఉన్న గ్రిప్ , ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ కలిసి వచ్చాయి. ఓ మామూలు ప్రేమ కథగా మిగిలే దాన్ని మరుపు రాని ప్రేమ కథగా మన ముందుకు తీసుకు వచ్చారు. లీడ్ పెయిర్ మధ్య ఎమోషన్స్ తో మనని కట్టిపారేసే ప్రయత్నం సామాన్యమైనది కాదు.అందులో చాలా భాగం డైరక్టర్ సక్సెస్ అయ్యారు.  అయితే ఎంత చేసినా, ఎలా ఉన్నా..మనకు ఏ మాత్రం  ఆ లవ్ స్టోరీ ఎక్కకపోయినా పూర్తి స్దాయి విసుగే. అందులోనూ పెద్దగా ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా అలా మెల్లిగా సాగుతూంటుంది. 

Sapta Sagaralu Dhaati


ఫెరఫార్మెన్స్ లు..
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగింది ,సినిమాని నిలబెట్టింది లీడ్ పెయిర్ రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మధ్య కెమిస్ట్రీ. వాళ్ల ఫెరఫార్మెన్సే. వాళ్లిద్దరూ కలిస్తే బాగుండును అనిపించేలా వారు జీవించారు అని చెప్పాలి. రియలిస్టిక్ ఎప్రోచ్ తో సినిమా నడుస్తుంది. మిగతాపాత్రలు వాళ్లకు సపోర్ట్ చేసారు.

టెక్నికల్ గా ..

ఈ సినిమాకు దర్శకుడు ...మెయిన్ హీరో. అలాగే సాగతీత మెయిన్ విలన్. అయితే హీరోనే గెలిచారు. ఇలాంటి లవ్ స్టోరీలకు కావాల్సింది మ్యూజిక్. ఆ విషయంలో చ‌ర‌ణ్ రాజ్ సక్సెస్ అయ్యారు. అయితే తెలుగుకు వచ్చేసరికి ఆ పాటలు ఇంకా జనాల్లోకి వెళ్లలేదు కాబట్టి జస్ట్ ఓకే అనిపిస్తాయి.అలాగే  బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో పెద్ద ప్ల‌స్‌.కెమెరా వర్క్ కూడా మామూలుగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఖర్చుపెట్టారు. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. డబ్బింగ్ బాగానే సెట్ అయ్యింది. 

Sapta Sagaralu Dhaati


ఫైనల్ థాట్
పెయిన్ ఈ సినిమా ప్రాణం. దాన్ని భరించగలిగాలి. అలాగే కొన్ని రిపీటెడ్ జైల్ సీన్స్, సాగతీతను తట్టుకుంటే మంచి లవ్ ఫీల్ సినిమాని ఆస్వాదించగలం. లేకుంటే ఎప్పటికి ఈ సినిమా పూర్తికాదా అని తిట్టుకుంటూ బయిటకు వస్తాం.
 
--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2.75

Sapta Sagaralu Dhaati


బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, అచ్యుత్ రావు తదితరులు
రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్
సంగీతం:  చరణ్ రాజ్  
సినిమాటోగ్రఫీ:  అద్వైత గురుమూర్తి  
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
నిర్మాత : రక్షిత్ శెట్టి 
విడుదల తేదీ : 22, సెప్టెంబర్ 2023

Latest Videos

click me!