`రుద్రం కోట` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Sep 22, 2023, 6:13 PM IST

`జానకి కలగనలేదు` వంటి విజయవంతమైన సీరియల్‌ని రూపొందించిన దర్శకుడు రాము కోన దర్శకుడిగా `రుద్రం కోట` సినిమాని రూపొందించాడు. సీనియర్‌ నటి జయలలిత ఇందులో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. అనిల్‌ ఆర్కా హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.  శుక్రవారం విడుదలైన(సెప్టెంబర్‌ 22) ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

`జానకి కలగనలేదు` వంటి విజయవంతమైన సీరియల్‌ని రూపొందించిన దర్శకుడు రాము కోన దర్శకుడిగా `రుద్రం కోట` సినిమాని రూపొందించాడు. సీనియర్‌ నటి జయలలిత ఇందులో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. అనిల్‌ ఆర్కా హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. జయలలిత సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. శుక్రవారం విడుదలైన(సెప్టెంబర్‌ 22) ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
రుద్రం కోట అనే పల్లెటూరి కోటమ్మ(జయలలిత) కంట్రోల్‌లో ఉంటుంది. ఆమె ఊరు కట్టుబాట్లని ఎవరు అతిక్రమించినా చంపేస్తుంది. ఆమెకి సహాయకుడుగా రుద్రుడు(అనిల్ ఆర్కా) ఉంటాడు. తను ఊరు శ్మాశన వాటికలో, కొండ గుట్టల్లో ఉంటూ ఎప్పుడూ ఓ మత్తులో ఉంటాడు. అమ్మాయిలకు దూరంగా ఉంటాడు, కనీసం వారిని కన్నేత్తి కూడా చూడడు. ఊర్లో మరో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ జంటని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారు. అంతటి నియమాలను పాటించే కోటమ్మ ఇంటికి సిటీ నుంచి ఆమె మనవరాలు వస్తుంది. ఆమె రుద్రుడుని చూసి మోజు పడుతుంది. ఆ విషయం తెలుసుకుని కోటమ్మకి హెచ్చరిస్తాడు రుద్రుడు. దీంతో మనవరాలిని మందలించి ఊరు నుంచి పంపించేస్తుంది. రుద్రుడిపై పగతో సవాల్‌ చేసి వెళ్తుంది. అదే సమయంలో ఊరు చివరన ఉండే శక్తి(విభీష జాను)కి రుద్రుడంటే ఎంతో ప్రేమ. తన బామ్మతో కలిసి మేకలు చూసుకుంటూ ఉంటుంది. తన బామ్మ గోదాట్లో పడి చనిపోవడంతో శక్తి ఒంటరిగా ఉంటుంది. అప్పుడు రుద్రుడు ఆమెకి తోడుగా ఉంటాడు. మరి శక్తి తన మనసులో ఉన్న ప్రేమని రుద్రుడికి చెప్పిందా? అంతలో చోటు  చేసుకున్న విషాదమేంటి? కోటమ్మ మనవరాలు చేసిన సవాల్‌ ఏంటి? రుద్రుడు అమ్మాయిలకు దూరంగా ఉండటానికి కారణం ఏంటి? కోటమ్మ ఊర్లో ఎందుకు నియమాలు పెట్టింది? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
`రుద్రంకోట` చిత్రంలో ప్రధానంగా అక్రమ సంబంధాలు అనే పాయింట్‌ని చర్చించారు. అది ఎలాంటి దారుణాలకు కారణమవుతుంది. అలా చేయడం వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయని, వాటి నుంచి దూరంగా ఉండాలనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. దాన్ని అంతే ఎంగేజింగ్‌గా, అంతే ఇంట్రెస్టింగ్‌గా, కన్విన్సింగ్‌గా తెరకెక్కించడం చాలా ముఖ్యం. ఇక్కడే దర్శకుడు అనుకున్న స్థాయిలో సక్సెస్‌ కాలేదనిపిస్తుంది. అయితే తాను చెప్పాలనుకున్న పాయింట్‌కి ఎంచుకున్న నేపథ్యంలో బాగుంది. రూట్‌ లెవల్‌లో ఆ విషయాన్ని చెప్పాలనుకోవడం బాగుంది. కోటమ్మ, రుద్రుడు పాత్రలను తీర్చిదిద్దిత తీరు బాగుంది. ఆయా పాత్రలను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. 
 

అదే సమయంలో ప్రారంభం నుంచి రుద్రుడు పాత్రలోని సస్పెన్స్ ని మెయింటేన్‌ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. రుద్రుడి పాత్ర చాలా బలంగా ఉంది. అదే సమయంలో చాలా రా గా, రస్టిక్‌గా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం పల్లెటూరులో సాగుతుంది. అక్కడ డ్రెస్సింగ్‌ స్టయిల్‌గానీ, తీరు తెన్నులు గానీ చాలా సహజంగా అనిపిస్తాయి. ఇక రుద్రుడి పాత్రలోని సస్పెన్స్ సినిమాని నడిపిస్తుంది. రాను రాను ఆసక్తిని రేకెత్తిస్తుంది. కోటమ్మ మనవరాలు పాత్ర ఎంటరైన తర్వాత కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఆమె రుద్రుడిపై మోజు పడే సన్నివేశాలు, అతన్ని కావాలనుకోవడం, అందుకు తపించడం, ఈ క్రమంలో ఆమె చేసే పనులు కొంత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తాయి. ఇందులో డ్రైగా సాగుతున్న సినిమాలో కొన్ని రొమాంటిక్‌ సీన్లు పెట్టి కథని రంజుగా మార్చే ప్రయత్నం బాగుంది. 
 

మరోవైపు శక్తి .. రుద్రుడిని ఇష్టపడుతూ, ఆయన్ని ఆరాధిస్తున్న తీరు, రుద్రుడిని చూసినప్పుడు ఆమెలో కలిగే ప్రేమ, ఆ ఫీలింగ్‌ కి సంబంధించిన సీన్లు చాలా బాగున్నాయి. ఆమె లవ్‌ స్టోరీ బాగుంది. రుద్రుడు దగ్గరయ్యాక ఆ లవ్‌ స్టోరీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అంతలోనే పెద్ద ట్విస్ట్, విషాదం సన్నివేశాలు చోటు చేసుకోవడంతో సినిమా పూర్తిగా ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. క్లైమాక్స్ కి ముందే ఆ ఎమోషనల్‌ సీన్లు చూపించారు. క్లైమాక్స్ లో మాత్రం తేలేశారు. అదే నిరాశగా అనిపిస్తుంది. అయితే సినిమా స్లోగా సాగడం పెద్ద మైనస్‌. కథ ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతుంది. సీరియల్స్ సన్నివేశాల మాదిరిగానే ఎంతసేపు చూపించిన సీన్లే చూపిస్తుంటారు. ఎలివేషన్‌ ఎఫెక్ట్ లు విసుగు పుట్టిస్తుంటాయి. ఆయా సీన్లు చూస్తుంటే సీరియల్స్ గుర్తుకొస్తుంటాయి. కథ ఎంత సేపు ముందుకు సాగదు, అది బోర్‌ తెప్పిస్తుంది. దీనికితోడు సస్పెన్స్, సీరియస్‌ గా సాగడంతో కాస్త విసుగు తెప్పిస్తుంది. కోటమ్మ తీసుకున్న నిర్ణయం, రుద్రుడు అలా ఉండటానికి కారణాలు బలంగా చూపించలేకపోయారు. దీంతో వారు చేసే పనులు కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. సినిమాలో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. దీంతో సీన్లు వచ్చిపోతుంటాయి తప్ప, వాటికి కనెక్ట్ కాలేదు. ఆ విషయంలో ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది, ఇంకా వర్క్ చేయాల్సింది. కానీ ఓవరాల్‌గా సందేశం మాత్రం బాగుంది. 
 

నటీనటులుః

రుద్రుడు పాత్రలో అనిల్‌ ఆర్కా చాలా బాగా చేశాడు. తొలి సినిమా అయినా అదరగొట్టాడు. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో అంతే సహజంగా చేశాడు. నాటు మనిషిలా పాత్రకి ప్రాణం పోశాడు. హవభావాలు బాగా పలికించాడు. నటుడిగా మంచి భవిష్యత్‌ ఉంటుంది. కోటమ్మగా జయలలిత మెప్పించింది. హుందాతనంతో కూడిన పాత్రలో మెప్పించింది. సినిమాకి ఆమె పాత్ర మరో బలం. హీరోయిన్లు విభీష జాను పల్లెటూరు అమ్మాయిలా, అమాయక ప్రేమికురాలిగా చాలా బాగా చేసింది. అదే సమయంలో నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో అలేఖ్య బాగా నటించింది. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించేలా ఉంటాయి. 
 

టెక్నీషియన్లుః 
సినిమా కెమెరా వర్క్ బాగుంది. ఆదిమల్ల సంజీవ్‌ విజువల్‌ ప్లజెంట్‌గా ఉన్నాయి. సంతోష్‌ ఆనంద్‌, యూవీ నిరంజన్‌ పాటలు ఓకే అనిపించాయి. కానీ పెద్దగా ప్లస్‌ కాలేదు. కోటీ నేపథ్య సంగీతం ఫర్వాలేదు. చాలా చోట్లు హైలైట్‌ అయ్యింది. సినిమా కథకి తగ్గట్టుగా నిర్మాణ విలువలున్నాయి. ఇక దర్శకుడిగా ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. కానీ దాన్ని అంత ఎంగేటింగ్‌గా తీయలేకపోయాడు. సీరియల్స్ ప్రభావం ఆయనపై చాలా ఉంది. అది సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల సీరియల్‌ని తలపించినట్టుగానే సాగింది. మేకింగ్‌ విషయంలో ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. 

ఫైనల్‌గాః సందేశం మాత్రం బాగుంది. 

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!