వీరుడే కానీ..... శివకార్తికేయన్ ‘మహావీరుడు’రివ్యూ

First Published | Jul 14, 2023, 5:27 PM IST

గతంలో ‘మండేలా’ అనే సందేశాత్మక సినిమా తీసిన మడోన్ అశ్విన్ ‘మహావీరుడు’కి దర్శకత్వం వహించాడు. తెలుగులో ఏషియన్ సునీల్ ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు.


తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ మెల్లిమెల్లిగా తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆయన నటించిన ‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి సినిమాలతో తెలుగులో కమర్షియల్ సక్సెస్ లు అందుకున్నారు. ఈ క్రమంలో అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తు  ఇప్పుడు ‘మహావీరుడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో మంచి సక్సెస్ సాధించిన  మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన  ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా మన తెలుగు వాళ్లను ఎలా ఆకట్టుకుంది. సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

స్టోరీ లైన్:

కార్టూనిస్ట్  సత్య (శివ కార్తికేయన్) పిరికివాడు..సమస్యలను ఆహ్వానించటానికి ఇష్టపడని వాడు. అతను గీసిన 'మాహా వీరుడు' కామిక్స్ బాగా పేలుతాయి. ఆ కామిక్స్ అన్నీ  ప్రజలను ఓ వీరుడు రక్షించినట్టు సాగుతూంటాయి. తన పిరికితనాన్ని అలాంటి సాహస గాధలతో దాటే ప్రయత్నం చేస్తూంటాడు. ఇలా కామిక్స్ తో ,  తన తల్లి,సోదరితో కలిసి ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటాడు. అయితే ఓ మనిషి ప్రశాంతంగా బ్రతకటం ప్రపంచానికి,ప్రకృతికి ఇష్టం ఉండదు కదా. దాంతో అతని జీవితం ఓ చిన్న సంఘటనతో పూర్తిగా తలక్రిందులవుతుంది..అంటే మలుపు తిరుగుతుంది. అదేమిటంటే...



తన ఉండే మురికివాడని మినిస్టర్ జయసూర్య (మిస్కిన్) ఖాళీ చేయిస్తాడు. అక్కడ వారందరికీ.. తాను కట్టించిన ప్రజాభవనం అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ఇస్తాడు. అయితే ఆ ప్లాట్స్  చాలా నాసిరకంగా కట్టడంతో .. ఆ భవనం కూలిపోతుందని సత్యకు తెలుస్తుంది. అతనికి ఒక్కడికే ఎలా తెలుస్తుంది అంటే...   సత్యకు మాత్రమే వినిపించే  ఓ అజ్ఞాత గొంతు చెబుతుంది. ఆ నిజం తెలిసిన  సత్య ఏం చేశాడు? అసలా ఆ గొంతు ఎవరిది...మినిస్టర్ ని ఈ పిరికివాడు ఎలా ఎదిరించాడు...తను గీసిన కామెక్ లోని మహావీరుడు తనే ఎలా అయ్యాడు...చివరకు ఏమైంది.. ? ఈ జర్నిలో చంద్ర (అదితి శంకర్) ఎలా పరిచయం ఏమైంది? చివరకు ఏం జరిగింది? అనేది మిగతా కథ.


Analysis:

ఈ చిత్రం దర్శకుడు మడోన్ అశ్విన్ ఇంతకు ముందు మండేలా అనే సినిమా తీస్తే 2022 లో రెండు నేషనల్ అవార్డ్ లు వచ్చాయి. అది రియలిస్టిక్ రూరల్ డ్రామా. ఓ ఇండిడ్యువల్ సిస్టమ్ కు వ్యతిరేకంగా చేసే ఫైట్ ని ఆ సినిమా సమర్దవంతంగా ఆవిష్కరించింది. అక్కడ వోట్ ను ఇక్కడ వాయిస్ గా తీసుకున్నారు. అయితే ఆ సినిమా అంత గొప్పగా కాన్సెప్ట్ వైజ్ అనిపించదు. చాలా ప్రెడిక్టుబుల్ గా కథ,కథనం నడుస్తూంటుంది.అలాగే ఈ సినిమాలో మరో పెద్ద ప్లా ఏమిటంటే.. కథలోకి వచ్చి సెటప్ పూర్తయ్యేసరికే చాలా టైమ్ పడుతుంది.శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోను, కామెడీ టచ్ ఉన్నవాడిని... పిరికివాడుగా ,కార్టూనిస్ట్ గా చూపటానికి అంతంత టైమ్ తీసుకోనక్కర్లేదు. దాంతో ప్రారంభమే డల్ గా,ఏమీజరగనట్లు అనిపిస్తుంది.  మొత్తం ఫస్టాఫ్ మొత్తం సెటప్ తోనే నడుస్తుంది. అక్కడికి యోగిబాబు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు కాబట్టి మనం ఎడ్జెస్ట్ అయ్యిపోతాం. అలాగే సత్యలోంచి రియల్ హీరో బయిటకు రావటానికి కూడా చాలా టైమ్ సెకండాఫ్ లో తీసుకున్నారు. 
 

maaveeran


ఆ హీరో కోసమే మనం ఎదురుచూస్తూంటాం.శివ కార్తికేయన్ ఫెరఫెక్ట్ గా తన భుజం మీదే మొత్తం మోసినప్పటికీ... కథ టేకాఫ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేయటం ఇబ్బందే.ఇక  ఇంటర్వెల్ సీక్వెన్స్ అద్బుతం కాదు కానీ జస్ట్ ఓకే.    సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ప్రారంభం  అయినా .. తర్వాత వచ్చే సీన్స్  సింక్ కావు. . క్లైమాక్స్ మళ్లీ సర్దుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా (Mahaveerudu) కాన్సెప్ట్ బాగున్నా .. ఎగ్జిక్యూషన్ యావరేజ్ అని చెప్పాలి. అయినా మొదట ఈ సినిమా హిట్ కోసం చూసుకోవాలి కానీ సీక్వెల్ కు లీడ్ ఇవ్వటం కోసం ఏకంగా 15 నిముషాలు పాటు సీన్స్ నడపటం ఏమిటి...అన్నిటికన్నా ప్రధానం..విలన్ భయంకరంగా ఉన్నాడు. కానీ విలన్ కు, హీరో కు మధ్య వచ్చే సీన్స్లో ఆ ఇంటెన్స్ లేదు. అవి ఉంటే సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. కాకపోతే కామెడీ చాలా వరకూ కాపాడేసింది.

Mahaveerudu Movie Review


టెక్నికల్ గా..

సినిమా స్క్రీన్ ప్లే లో సాగతీత తగ్గించి ఉంటే బాగుండేది. అలాగే లెంగ్త్ తగ్గంచాలి. ఇక సెకండాఫ్ స్లో ను కూడా ఎడిటర్ చూసుకోవాలి. తెలుగులో పాటలు గొప్పగా లేవు. జస్ట్ ఓకే. డబ్బింగ్ డైలాగులు బాగానే పేలాయి. రవితేజ ఇచ్చిన వాయిస్ డబ్బింగ్ అదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీ సీన్స్ కు ప్రాణం పోసింది. కెమెరా వర్క్ సోసోగా ఉంది.  ఇక విఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రం అసలు బాగోలేదు. దారుణంగా ఉంది. డైరక్షన్ లో డిటేలింగ్ తగ్గించి ఉంటే సాగతీసిన ఫీలింగ్ తగ్గేది.
 


నటీనటుల్లో ...

శివకార్తికేయన్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి..కాబట్టి కొత్తగా చెప్పేదేమీ లేదు.రవితేజ  వాయిస్   కీలకమై నిలిచి, మన తెలుగు ఫీల్ కలిగింది.  హీరోయిన్ అదితి శంకర్ బాగా చేసిందని చెప్పేటన్ని ఫెరఫెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ సీన్స్ లేవు.  హీరో తల్లి గా సరిత ఓకే ఓకే. , మంత్రిగా ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ఫెరఫెక్ట్. ఆయన దగ్గర సహాయకుడిగా సునీల్  బాగా చేసారు. 

ఫైనల్ థాట్

శివకార్తికేయన్ గత చిత్రాలు   ‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’స్దాయిలో ఊహించుకోకుండా ..ఓ కామెడీ చిత్రం చూడటానికి వెళ్లాం అనుకుంటే హ్యాపీగా నడిచిపోతుంది.
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

maaveeran


నటీనటులు : శివకార్తికేయన్, అదితి శంకర్, సునీల్, యోగిబాబు, మిస్కిన్, సరిత తదితరులు
ఛాయాగ్రహణం : విధు అయ్యన్న 
సంగీతం : భరత్ శంకర్
నిర్మాత : అరుణ్ విశ్వ
తెలుగులో విడుదల : ఏషియన్ సినిమాస్
రచన, దర్శకత్వం : మడోన్ అశ్విన్
విడుదల తేదీ: జూలై 14, 2023

Latest Videos

click me!