#SwathiMuthyam:బెల్లంకొండ గణేష్ 'స్వాతి ముత్యం' రివ్యూ

First Published Oct 5, 2022, 7:34 AM IST


వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం సాగుతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. కాసేపట్లో పెళ్లి, ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి?, దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? 

Swathi Muthyam Movie Review


నాగార్జున ది ఘోస్ట్, చిరంజీవి గాడ్ ఫాదర్ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని   తెలిసీ ఓ కొత్త కుర్రాడు హీరోగా చేసిన స్వాతిముత్యంని బరిలో దింపడం ఆసక్తి రేపే విషయమే. పండగ రేస్ లో ఇద్దరు సీనియర్ల మధ్య దిగడం ఖచ్చితంగా రిస్కే.  అలాగని ఈ స్వాతిముత్యం గ్రాఫిక్స్ తో ముడిపడిన గ్రాండియర్ సినిమాని కాదు. మాస్ ఎలిమెంట్స్ కూడుకున్న మసాలా మూవీ అంతకన్నా కాదు కాదు. ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా సాగే సాఫ్ట్ మూవీ. పెద్ద బ్యానర్ అనేది తప్పించి జనం మాట్లాడుకునే మ్యాటర్  రిలీజ్ కు ముందు లేదు. అయినా ధైర్యం చేసి బరిలో దిగటం ఎంతవరకూ సినిమాకు కలిసి వచ్చింది. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఆ కథేంటి... 


కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా టైటిల్ ని వాడుకుంటున్న గణేష్ హిట్ కొట్టి ఒడ్డున పడ్డాడా...రివ్యూలో చూద్దాం.  

కథాంశం : 

పిఠాపురం ఎలక్ట్రసిటి డిపార్టమెంట్ లో జూనియర్ ఇంజినీర్  బాలమురళి (బెల్లంకొండ గణేష్).  మంచి ఉద్యోగం, వయస్సు రావటంతో పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ  భాగ్య లక్ష్మి (వర్ష బొల్లమ్మ) ను చూసి అమాంతం  ప్రేమలో పడిపోతాడు. ఆమె ఓ స్కూల్ టీచర్. ఇద్దరి మధ్యా పెళ్లికు ముందు ప్రేమ నడుస్తూంటుంది. ఇక రేపో మాపో పెళ్లి అయినా ఏ ట్విస్ట్ లేకుండా హ్యాపీ...చివరకు పెళ్లి పీటల టైమ్ కి  పెద్ద ట్విస్ట్. అదేమిటంటే...పెళ్లికి ముందు చేసిన ఓ పని..పిల్లాడి రూపంలో వచ్చి వెక్కిరిస్తుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. మోసం చేసావంటూ భాగ్యలక్ష్మి,  పరువు పోయిందని ఆమె  తండ్రి (రావు రమేష్) గోలెత్తిపోతాడు. ఇంతకీ అసలు మ్యాటరేంటి..పెళ్లి కానీ ఈ కుర్రాడికి కొడుకు ఎక్కడ నుంచి వచ్చాడు. చివరకు ఈ సమస్యను ఎలా సర్దుకుని భాగ్యలక్ష్మిని తన దాన్ని చేసుకున్నాడు అనేది మిగతా కథ.

Swathi Muthyam Movie Review

విశ్లేషణ : 

నిర్మాత ముందే రివీల్ చేసినట్లు ఇది వీర్యదానం చుట్టూ తిరిగే కథ.  స్నేహితుడు  (వెన్నెల కిషోర్) బలవంతం మీద చేసిన వీర్యదానం చేస్తే అది , పిల్లాడి రూపంలో సమస్యగా మారి చుట్టుకుని, అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి కథలు హిందీలో ఇన్నాళ్లూ వస్తూండేవి. ఇప్పుడు మన కుర్రాళ్లకు సైతం అర్దమవుతున్నాయని అర్దం చేసుకుని ఈ ధైర్యం చేసినట్లున్నారు. 

Swathi Muthyam Movie Review

సాధారణంగా హీరో వీర్య దాత అన‌గానే అంద‌రికీ హిందీ బ్లాక్‌బ‌స్ట‌ర్ విక్కీ డోన‌ర్‌యే గుర్తుకు వ‌స్తుంది. ఆయుష్మాన్ ఖురానాను స్టార్‌ను చేసిన సినిమా అది. ఆ సినిమా చేసే సమయానికి వీర్య దానం బాలీవుడ్ కు కొత్తే. ఎక్కడో హాలీవుడ్ లో వచ్చే టైమ్ సినిమా అన్నారు. ఈ  సినిమా అంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. దీన్ని ప్రేక్ష‌కులు త‌ట్టుకోగ‌ల‌రా అనుకున్నారు. కానీ ఆ కాన్సెప్ట్‌ను వ‌ల్గారిటీ లేకుండా నీట్‌గా, హృద్యంగా, వినోదాత్మ‌కంగా చూపించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్నందుకున్నారు.

Swathi Muthyam Movie Review

అయితే ఇదే చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా న‌రుడా డోన‌రుడా పేరుతో రీమేక్ చేస్తే ఇక్క‌డ డిజాస్ట‌ర్ అయింది.  మరి వీర్యదానం మీద అవగాహన లేకో, లేక జనాల్లోకి సరిగ్గా ప్రమోట్ కాకో, నవ్వులు పండించకో... ఈ సినిమా ఆడలేదు. ఆ సినిమా గురించి జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌దు కాబ‌ట్టి.. ఇప్పుడు మ‌ళ్లీ ధైర్యం చేసి వీర్య దానం నేప‌థ్యంలో కామెడీ మూవీ తీసారు. ఈ దర్శకుడు తన చాతుర్యం మొత్తం ఈ పాయింట్‌ను  బాగా ఎగ్జిక్యూట్ చేయటంలోనే కనిపించింది.

Swathi Muthyam Movie Review


అలాగే ఒక చిన్న సినిమా, ఒక సాధారణ కాన్సెప్ట్, ఒక యంగ్ హీరో, పెద్ద బ్యార్  కలగలిస్తే హిందీలో వంద కోట్లు కలెక్ట్ చేశాయి. అదే “బధాయ్ హో”. ఆ హీరో ఆయుష్మాన్ ఖురానా.  ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లను కూడా తట్టుకొంటూ.. కేవలం కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొంటూ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే  ఆయుష్మాన్ మునుపటి చిత్రం “అంధా ధున్” కూడా సేమ్. రాజ్ కుమార్ రావు కూడా ఇలాంటి సినిమాలతో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు  తెలుగులోనూ ఇలాంటి సినిమాలు ఆడితే ఆ ట్రెండ్ మొదలవుతుంది. 

Swathi Muthyam Movie Review


ఇదే బ్యానర్ నుంచి వచ్చిన డీజే టిల్లు స్దాయి కామెడీ లేకపోయినా సాధ్యమైనంత వరకూ ఫన్ తో సినిమాని లాగాడు డైరక్టర్. అయితే ఇంటర్వెల్ దాకా ఏ మలుపు కనపడదు. నడుస్తూంటుంది..నడుస్తూంటుంది. ఎంత ఫన్ చేసినా ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం కాస్త ఇబ్బంది పెట్టాడనే అని అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చెప్పేసి, ఆ సమస్య నుంచి బయిటపడటానికి అంటే తను పెళ్లి చేసుకోబోయే కుటుంబాన్ని ఒప్పించే పోగ్రాం పెట్టుకున్నారు. నిజానికి ఇదే టఫ్ ఫేజ్  ఏ స్క్రిప్టుకైనా . అయితే ఇక్కడా మాగ్జిమం ఫన్ చేసుకుంటూ వెళ్లారు. ప్రీ క్లైమాక్స్ రొటీన్ అనిపించినా, మళ్లీ క్లైమాక్స్ ఫన్ తో లాగేసారు. టోటల్ గా సీరియస్ గా చూడకుండా నవ్వుకుంటూ చూసేయచ్చు అనే ధీమా ఇచ్చాడు. వీర్యదానం అనే దాన్ని ఎక్కువ హైలెట్ చేయకుండా, 

Swathi Muthyam Movie Review

దర్శకత్వం ,మిగతా విభాగాలు

డైరక్టర్ గా లక్ష్మణ్ కొత్తవాడే కానీ క్లారిటీ ఉన్నవాడు అని అర్దమవుతోంది. కాకపోతే ఫస్టాఫ్ లో అసలు విషయంలోకి రాకుండా లాగడమే ఇబ్బంది అనిపిస్తుంది. అయితే గోదావరి జిల్లా ఫన్, సైటైర్స్ తో కాలక్షేపం చేసాడు. అలాగే కొన్నిచోట్ల ఎమోషన్స్ బలవతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. అలాంటివి ప్రక్కన పెడితే కొత్త హీరోతో,కొత్త దర్శకుడు సమర్దంవంతాగానే అవుట్ ఫుట్ తీసుకున్నాడనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. రన్ టైమ్ తక్కువ ఉంచటమే ఎడిటర్ ఈ సినిమాని పరుగెత్తించటానికి ఎంచుకున్న మార్గం అని అర్దం అవుతుంది. పాటలు రెండు బాగున్నాయి. సహజమైన లొకేషన్స్ సినిమాకు అందం తెచ్చాయి. పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అనే విషయం తెరపై కనపడే రిచ్ నెస్ గుర్తు చేస్తూంటుంది.

నటీనటుల్లో ...బెల్లంకొండ గణేష్ మంచి ఈజ్ ఉంది. అయితే సిద్దు జొన్నల గడ్డ ఈ పాత్ర చేస్తే బాగుండేది అని కొన్ని సార్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఫన్ ..చాలా వరకూ ప్లస్ అయ్యింది. హీరోయిన్ గా వర్ష ఎక్కవ తక్కువా కాకుండా చేసుకుంటూ పోయింది.రావు రమేష్..నరేష్, గొపరాజు రమణ ..కామెడీకి సాయిం పట్టారు. అలాంటి సీనియర్స్ వల్లే ఈ సినిమా ఇబ్బంది లేకుండా చూడగలుగుతాం.    
 

Swathi Muthyam Movie Review


ఫైనల్ థాట్ : 

కంటెంటే ఈ సినిమాకు నిజమైన హీరో.  చిరు నాగ్ ల మధ్య రావడం కన్నా సోలోగా వస్తే   ఇంకా బాగా రిజిస్టర్ అయ్యి,  రీచ్ ఎక్కువగా ఉండేదేమో.  
RATING:2.75

Swathi Muthyam Movie Review

 బ్యానర్: సితార ఎంటర్ టైన్మెంట్స్
నటీనటులు:గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు.
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ
విడుదల తేదీ :  అక్టోబర్ 5, 2022

click me!