'టిల్లు స్క్వేర్' మూవీ రివ్యూ

First Published Mar 29, 2024, 1:15 PM IST

, 'నువ్వు నిజంగానే ఈ కొశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధికా?' వంటి డైలాగులతో టిల్లూ స్వ్కేర్ వచ్చేసాడు. ఈ సారి ఏం చేసాడంటే...

Tillu Square

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాయటం, తీయటం రెండు ఎప్పుడూ కత్తిమీద సామే. సినిమా ఎలా ఉందనేదానికన్నా ఇంతకు ముందు వచ్చిన సినిమా కన్నా బాగుందా..బాగోలేదా అని పోలీక మొదట క్షణం నుంచే మొదలవుతుంది. అదే సమయంలో సీక్వెల్స్ కు రిలీజ్ కు ముందు ఉండే బజ్ ని రీచ్ అవటం అనే ప్రెషర్ కూడా తెలియకుండా దర్శక,నిర్మాతలపై ఉంటుంది. ఇవన్నీ బాలెన్స్ చేసుకుంటూ కాస్త లేటుగా అయినా లేటెస్ట్ గా వచ్చిన సీక్వెల్ చిత్రం టిల్లు స్క్వేర్. టైటిల్ లోనే విభిన్నత చూపిన ఈ చిత్రం ఎలా ఉంది. ఈ సారి టిల్లూ ఎక్కడ ఇరుక్కున్నాడు..ఎలాంటి ఎడ్వెంచర్స్ చేసాడో చూద్దాం.
 

Tillu Square Movie Review

స్టోరీ లైన్ 

రాధిక అనే అమ్మాయితో ప్రేమలో పడి..తర్వాత మర్డర్ కేసులో ఇరుక్కుని ,ఓ స్కెచ్ వేసి బయిటపడ్డ టిల్లు (సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌) ఈ సారి కాస్తంత ప్రశాంత జీవితం గడుపుతూంటాడు. తనకు సెట్ అయ్యే విధంగా ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ న‌డుపుతూ తన పనేదో తను చేసుకుంటూటాడు. అయితే అలాగే ఉంటే ఇంక మజా ఏముంది.ఈ సారి టిల్లు (సిద్దు) లైఫ్ లోకి లిల్లీ (అనుపమ) వస్తుంది. ఒక పబ్‌లో అనుకోకుండా పరిచయమై.. మనోడి గుండెను గాభరా పెట్టి గాయబ్ అయ్యపోతుంది. ఆ రాత్రి ఇద్దరూ ఒకటవటంతో ఆమెను మర్చిపోలేక ఆమెను తలుచుకుంటూ వెతుకుతూంటాడు. ఓ  నెల తరువాత ఆమె కనిపించి గర్భవతి అని చెప్పి షాక్ ఇస్తుంది. ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.
 

Tillu Square Movie Review

 ఆ తర్వాత టిల్లు పుట్టిన రోజుకు మళ్లీ గతంలోలాగే లిల్లి కోసం కూడా అదే అపార్ట్మెంట్స్ కి  వెళతాడు. అక్కడ ఆమె తన అన్న రోహిత్ తప్పిపోయి అప్పటికి ఒక సంవత్సరం అయిందని చెపుతుంది. టిల్లుకు టెన్షన్ స్టార్ట్.  ఎందుకంటే రోహిత్ మరెవరో కాదు.  'డీజీ టిల్లు' లో చనిపోయిన వాడే. అతన్ని తనే  పూడ్చిపెట్టాడు  కాబట్టి.  అప్పుడు టిల్లూ ఏం చేసారు...ఇంతకీ లిల్లీ ఎవరు? రోహిత్ నిజంగానే ఆమెకి అన్నయ్య అవుతాడా? అప్పటి పాత కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడారు? పని గట్టుకుని మరీ  టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? అలాగే దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న షేక్ మహబూబ్ (మురళీ శర్మ) ఎవరు..అతనితో ఈ కథకు ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tillu Square Movie Review

విశ్లేషణ

ఇది క్యారక్టర్ డ్రైవన్ ప్లాట్. ఇందులో ఫోకస్ మొత్తం ప్లాట్ మీద కన్నా క్యారక్టర్ డవలప్మెంట్ మీద ఉంటుంది. అలాంటి విలక్షణమైన పాత్ర టిల్లుది. ఆ పాత్ర ఇప్పటికే జనాలకు ఎక్కేసింది కాబట్టి ఆ పాత్ర ఎలా నడిస్తే అలా నడవనిచ్చి, ఆ పాత్రను సమస్యలో పడేసి దాని నుంచి పుట్టే సంఘటనలను రికార్డ్ చేసినట్లు గా స్క్రిప్టు చేసారు. టిల్లు పాత్రతో పూర్తిగా ఎంగేజ్ అయ్యేలా చేసి...దాని పర్శనల్ జర్నీగా ఈ సినిమాని చూస్తాం. ఆ పాత్ర మళ్లీ సమస్యలో పడుతుంది అని తెలుసు. అయితే ఈ సారి ఏ సమస్యలో పడుతుందో...ఎలా బయిటపడతారో అనే టెన్షన్ ని బిల్డప్ చేయటంలో సక్సెస్ అవ్వటంతో కొంత రిపీట్ సీన్స్ ఉన్నా, కొంత సోసోగా అనిపించేవి ఉన్నా నడిచిపోయింది. ముఖ్యంగా టిల్లూ పాత్రకు సమయోచితమైన పన్ డైలాగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. టిల్లు ఇలాగే ఆలోచిస్తాడు..ఇలాగే మాట్లాడతాడు అని తెలిసిన వాళ్లు ఫుల్ గా ఎంజాయ్ చేయగలుగుతారు. 
 

Tillu Square Movie Review

టిల్లూ పాత్ర మళ్లి ఓ అమ్మాయి వల్ల సమస్యలో పడినప్పుడు ఆటోమేటిక్ గా అయ్యో అనే సానుభూతి..ఈడి తిక్క వేషాలకు ఇలాగే జరగలాలిలే అనే చిన్న కోరిక మనలో పుట్టించగలిగారు. అంతేకాకుండా డీజే టిల్లులోని రాధిక పాత్రను మళ్లీ తీసుకొచ్చారు.ఇలా సినిమాని స్క్రీన్ ప్లేతో పరుగెత్తించి,వవసపెట్టి వన్ లైనర్స్ తో దడదడలాడించారు. ఈ సినిమాకు ప్లస్ అయ్యింది యాజటీజ్ ..డీజే టిల్లు స్క్రీన్ ప్లే డిజైన్ నే యాజటీజ్ ఫాలో అయ్యిపోవటం. దాంతో కొంత ప్రెడిక్టబుల్ అనిపించినా ఎక్కువ శాతం జనాలకు నచ్చే సినిమాగా మారింది. 

Tillu Square Movie Review

అయితే సినిమాలో స్పెషల్ ఫోర్స్, ఇంటర్నేషనల్ మాఫియా వంటివి చెప్తూంటే ఇదేంటి ఇంత సిల్లీగా అంత పెద్ద సెటప్ ని తీసారు అనిపిస్తుంది. అయితే కామెడీ సినిమా అని తెలుసు కాబట్టి లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోతాం. లిల్లీ పాత్ర కాస్త ఓవర్ గానే అనిపిస్తుంది. అదీ అనుపమా పరమేశ్వరన్ చేయటంతో మరీ ఇంత బోల్డ్ గానా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే చివరకు చిన్న రీజన్ చెప్పి ఓకే అనిపిస్తారు. ఏదైమైనా సెకండాఫ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేదే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్టాఫ్ ఉన్న ఫన్, రన్ ఇక్కడ కనపడదు. క్లైమాక్స్ వచ్చేటప్పటికి సర్దుకున్నారు.

Tillu Square Movie Review

టెక్నికల్ గా ..

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా క్రెడిట్ మొత్తం సిద్దుకే వెళ్ళిపోతుంది. డైరక్టర్ ఎవరు ఏంటని కూడా అడగరు. డీజే టిల్లుకు అదే జరిగింది. ఇక్కడా అదే జరిగే అవకాసం ఉంది. టెక్నికల్ గా పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కావటంతో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసారు. సినిమాలో హైలెట్ డైలాగులు. పైల్స్ గురించి చెప్పే డైలాగులు వదిలేస్తేనే సుమా. స్క్రీన్ ప్లే సేమ్ టెంప్లేట్ అయినా ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. రన్ టైమ్ కూడా 120 నిముషాలే కాబట్టి హ్యాపీసు. అలాగే డీజే టిల్లు సాంగ్ ని రీమిక్స్ చేయటం మంచి ఆలోచన. ఆ పాటే సినిమాలో హైలెట్. అంతకు మించి ఇవ్వలేమనుకున్నారో ఏమోకానీ ఇదే వర్కవుట్ అయ్యింది. కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సితార బ్యానర్ ఎప్పుడూ ఆ విషయంలో తన ప్రత్యేకత చూపిస్తోంది.

ఆర్టిస్ట్ లు ఫెరఫెర్మన్స్

ఈ సినిమాలో హోల్ అండ్ సోల్ గా సిద్దు జొన్నలగడ్డ ఏకపాత్రాభినయం. మొత్తం భుజాలపై మోసాడు వంటి పదాలు వాడాలి. అనుపమ చాలా గ్లామర్ గా బోల్డ్ గా కనిపించింది. నేహాశెట్టి చివర్లో కాసేపే కనపడినా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మురళి శర్మ,తండ్రిగా వేసిన మురళీధర్ వంటివారు అలా ప్లోలో చేసుకుంటూ వెళ్లిపోయారు. 
 

ప్లస్ లు 

సిద్దు యాక్టింగ్
వన్ లైనర్స్
రీమిక్స్ సాంగ్
నేహాశెట్టి రీఎంట్రీ సీన్

మైనస్ లు

సిల్లీగా అనిపించే ప్లాట్
సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ 
సెకండాఫ్ లో బోర్ కొట్టించేలా కొంత సాగతీత
కీ పాత్రలను తప్పించి మిగతావి పట్టించుకోకపోవటం
 


ఫైనల్ థాట్

సీక్వెల్ కూడా మొదటి పార్ట్ కు ఈక్వెల్ గా చేయటం మామూలు విషయం కాదు. అలాగే ఇది సిద్దు జొన్నలగడ్డ సినిమా అని చివర్లో వేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా కాస్త అడల్ట్ డోస్ తగ్గిస్తే బాగుండేది.

Rating:3
----సూర్య ప్రకాష్ జోశ్యుల
 

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్‌, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం:మల్లిక్ రామ్
నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటింగ్‌: నవీన్ నూలి
విడుదల తేది: మార్చి 29, 2024

click me!