Shanmukha Movie Review: `షణ్ముఖ` మూవీ రివ్యూ

Shanmukha Movie Review: ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ `షణ్ముఖ`. ఆదిత్య ఓం ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

Shanmukha Movie Review I telugu arj
shanmukha movie review

Shanmukha Movie Review: ఆది సాయికుమార్‌, అవికా గోర్‌ జంటగా, ఆదిత్య ఓం కీలక పాత్రలో నటించిన మూవీ `షణ్ముఖ`. షణ్ముగం సప్పాని దర్శకత్వంలో సాప్‌ బ్రో ప్రొడక్షన్స్ ప్రై లి పతాకంపై తులసీరామ్‌ సప్పాని, రమేష్‌ యాదవ్‌, షణ్ముగం సప్పాని సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. నేడు శుక్రవారం(మార్చి 21)న ఈ చిత్రం విడుదలైంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా, క్షుద్రపూజల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Shanmukha Movie Review I telugu arj
shanmukha movie review

కథః 
ఒక అటవి ప్రాంతంలో ఉపాసకుడు విగాండ(చిరాగ్‌ జానీ) భార్య గర్భవతి. ఆమెకి ఆరుముఖాలతో కురూపిగా కొడుకు జన్మిస్తాడు. అతని రూపం చూసి మంత్రసాని షాక్‌ అయి పారిపోతుంది. చూసిన వారంతా రక్తం కక్కుని చచ్చిపోతాడు. ఆరు ముఖాలో జన్మించిన తన కొడుక్కుని షణ్ముఖ అని పేరు పెడతాడు విగాండ. తన కొడుక్కి ఉన్న ఆరు ముఖాలు పోయి ఒకే రూపంతో ప్రకాశవంతుడిగా కనిపించేందుకు మాంత్రికుల సహాయంతో యాగం చేస్తుంటాడు.

అందుకోసం కొందరు అమ్మాయిలను బలివ్వాల్సి వస్తుంది. ఈ యాగం పూర్తి కావాలంటే క్లీంకార(అవికాగోర్‌) కావాలి. ఆమె కోసం వెతుకుతుంటారు. మరోవైపు కార్తి(ఆది సాయికుమార్‌) పోలీస్‌ ఆఫీసర్‌. సిటీలో డ్రగ్స్, మిస్సింగ్‌ కేసులను ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో డ్రగ్స్ దందా చేస్తున్న కమల్‌ (ఆదిత్య ఓం)ని పట్టుకునే ప్రయత్నం చేయగా, అతను తన గన్‌ తీసుకుని పారిపోతాడు.

మరోవైపు బెంగుళూరులో క్రిమినాలజీలో రీసెర్చ్ చేస్తున్న సారా(అవికా గోర్‌) అదృశ్యం అవుతున్న అమ్మాయిలకు గల కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటుంది. హైదరాబాద్‌ కి వచ్చి కార్తి సాయం తీసుకుంటుంది. కట్‌ చేస్తే వీరిద్దరు ఒకప్పుడు లవర్స్. దీంతో ప్రారంభంలో వీరిద్దరికి పడదు. కానీ కేసులో ముందుకెళ్లగా వీరికి అమ్మాయిల మిస్సింగ్‌ కేసుకి సంబంధించిన షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి.

మరి ఆ నిజాలేంటి? కార్తి, సారాల లవ్‌ స్టోరీ ఏంటి? ఎందుకు విడిపోయారు?  కిడ్నాప్‌ అవుతున్న అమ్మాయిలకు షణ్ముఖ యాగానికి ఉన్న సంబంధమేంటి? దీన్ని సారా, కార్తి ఎలా డీల్‌ చేశారు? ఇందులో క్లీంకార ఎవరు? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 


shanmukha movie review

విశ్లేషణః 
క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను మనం తరచూ చూస్తున్నాం. కానీ దీనికి ఆథ్యాత్మిక టచ్‌, అలాగే మూఢవిశ్వాసాలను జోడించి డివోషల్‌ టచ్‌ ఇస్తూ రూపొందిన మూవీ `షణ్ముఖ`. ఇందులో ఇదే మెయిన్‌ హైలైట్‌. అమ్మాయిల కిడ్నాప్‌కి విగాండ యాగానికి ముడిపెడుతూ కథని నడిపించిన తీరు కొత్తగా ఉంటుంది. ఎంగేజ్‌ చేసేలా ఉంటుంది.

అయితే ఆరు ముఖాలతో కొడుకు పుట్టడం, అతను పుట్టుకతోనే ఈ విశ్వం దద్దరిల్లడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. ఏం చూపించబోతున్నారనే ఆసక్తి ఏర్పడుతుంది. కట్‌ చేస్తే రెగ్యూలర్‌ సోసైటీని చూపిస్తూ, అమ్మాయిలకు మిస్సింగ్‌ కేసులు నమోదు కావడం, పోలీస్‌ ఆఫీసర్‌ కార్తి ఈ విచారణలో ఉండటం,

అదే సమయంలో తన రీసెర్చ్ కోసం సారా హైదరాబాద్‌కి రావడం, వీరిద్దరు కలసి పనిచేసే క్రమంలో షాకింగ్‌ విషయాలు బయటకు రావడం అనేది కథ పరంగా బాగానే ఉంది. కానీ దాన్ని నడిపించిన తీరులో కొంత లోటుపాట్లు కనిపిస్తాయి. ఫస్టాఫ్‌ కొంత కన్‌ఫ్యూజన్ గా అనిపిస్తుంది. పారలల్‌గా మూడు స్టోరీలను చూపించడం, ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టుగా ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా ఉంటుంది. 

shanmukha movie review

అయితే సెకండాఫ్‌ వచ్చేసరికి ఒక్కో సస్పెన్స్ రివీల్‌ అవుతుంటాయి. ఒక్కో కథకి లింక్‌ దొరుకుతుంటుంది. అదే క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. ఇవన్నీ షణ్ముఖ యాగానికి ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే సంబంధం లేని పాత్రలు రావడం, వాళ్ల కథలు చెప్పడం మరికొంత కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ అవుతుంది. కానీ చివరికి అన్ని రకాల సస్పెన్స్ లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టిన తీరు బాగుంది.

అదే సమయంలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు, చోటు చేసుకునే మలుపులు ఎంగేజ్‌ చేసేలా ఉంటాయి. ఏంజరుగుతుందో అనే ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. క్లైమాక్స్ వాహ్‌ అనిపిస్తుంది. అనంతరం ఫాంటసీ ఎలిమెంట్లు, డివోషనల్‌ ఎలిమెంట్లు, షణ్మఖుడి కథని యానిమేషన్‌లో చెప్పిన తీరు అదిరిపోయింది. అదే సినిమాకి హైలైట్‌గా నిలిచింది. 

shanmukha movie review

నటీనటులుః 
కార్తి పాత్రలో ఆది సాయికుమార్‌ బాగా చేశాడు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అదరగొట్టాడు. నటుడిగా చాలా బెటర్‌మెంట్‌ కనిపిస్తుంది. అవికా గోర్‌ సైతం బలమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. కథని ముందుకి తీసుకెళ్లే పాత్రలో, కథని మలుపు తిప్పే పాత్రలో అలరించింది. వీరితోపాటు కానిస్టేబుల్‌గా కృష్ణుడు మరోసారి బాగాచేశాడు.

ఆదిత్య ఓం నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. విగాండ గా చిరాగ్‌ జానీ బాగా చేశాడు. వీరితోపాటు వీరశంకర్‌, అరియానా గ్లోరీ, చిత్రం శ్రీను, దొరబాబు ఉన్నంత సేపు అలరించారు. ఇక దర్శకుడు షణ్ముగం సాప్పని కాసేపు కనిపించి రచ్చ చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. 

shanmukha movie review

టెక్నీకల్‌గాః 
సినిమాకి రవి బన్సూర్‌ సంగీతం మెయిన్‌ హైలైట్‌. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. అదే సినిమాకి హైలైట్‌. తనదైన స్టయిల్‌లో బీజీఎంతో రచ్చ చేశాడు. ఆడియెన్స్‌ ని థియేటర్లో కూర్చోబెట్టారు. మామూలు సీన్లు కూడా హైలైట్‌ అయ్యేలా చేశారు. ఆర్‌ఆర్‌ విష్ణు కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఇంకా బాగా చేయాల్సింది. ఎడిటర్‌ ఎంఏ మాలిక్‌ ఎడిటింగ్‌పై మరింత దృష్టిపెట్టాల్సింది. క్లారిటీ మెయింటేన్‌ చేయాల్సింది.

దర్శకుడు షణ్ముగం సాప్పని ఎంచుకున్న కథ బాగుంది. రెండు మూడు లేయర్లలో సాగే కథని నడిపించిన తీరు, వాటిని ముడిపెట్టిన తీరు బాగుంది. కానీ ప్రారంభం నుంచి కథనాన్ని నడిపించే విషయంలో మరింత స్పష్టత అవసరం. కన్‌ఫ్యూజ్‌ లేకుండా కథని నడిపిస్తే మరింత బాగుండేది. కానీ క్లైమాక్స్ లో మాత్రం వాహ్‌ అనిపించాడు. 

ఫైనల్‌గాః క్రైమ్‌, డివోషనల్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. 
రేటింగ్‌ః 2.5
 

Latest Videos

vuukle one pixel image
click me!