అనసూయ ‘సింబా’మూవీ రివ్యూ

First Published | Aug 9, 2024, 1:22 PM IST

  డైరెక్టర్ సంపత్ నంది ఈ మూవీకి కథను అందించటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో కొత్త,పాత వాళ్ల కలగలపుగా  వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి.... ?  

Simbaa

ఏదో ఒక కొత్తదనం లేకపోతే జనం చూడటం లేదు..ముఖ్యంగా ఓటిటిలు వచ్చాక కథలు తెరపై చెప్పటం చాలా ఛాలెంజింగ్ గా మారింది.  ఆల్టర్నేటివ్ ఇంట్లోనే దొరుకుతున్నప్పుడు పనిగట్టుకుని థియేటర్ వచ్చి చూడగలిగే అంత సత్తా ఉన్న కంటెంట్ ఉండాలి. లేదా పెద్ద స్టార్ అయినా ఉండాలి. ఈ క్రమంలో సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ లతో తెరకెక్కిన చిత్రం ‘సింబా’. అనసూయ భరద్వాజ్, జగపతి బాబు కీలక పాత్రలు వహించిన ఈ సినిమాకు  డైరెక్టర్ సంపత్ నంది ఈ మూవీకి కథను అందించటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో కొత్త,పాత వాళ్ల కలగలపుగా  వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి.... ?  
 


కథేంటి


హైదరాబాద్‌ సిటీలో  ఓ మర్డర్ చాలా దారుణంగా జరుగుతుంది. ఆ చనిపోయిన వ్యక్తి మామూలు వాడు కాదు.  ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్‌ సింగ్‌) సన్నిహితుడు. దాందో  పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుని ఇన్విస్టిగేట్ చేస్తూంటారు. ఈ క్రమంలో  పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) సిటీకి వస్తాడు. అయితే ఈ కేసు తేలేలోగా మరో హత్య  జరుగుతుంది. పోలీస్ లపై ప్రెజర్ పెరిగిపోతుంది.  దాంతో వారు రకరకాలగా ప్రయత్నించి  ఈ రెండు హత్యల వెనుక స్కూల్‌ టీచర్‌ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ ఫాజిల్‌(శీనాథ్‌ మాగంటి) ఉన్నారని కనుక్కుంటారు.  వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. దాంతో వాళ్లు కోర్టుకు వెళ్లే క్రమంలో చంపేయాలని పార్ద ప్లాన్ చేస్తాడు. అందుకు తన తమ్ముడుని కలుపుకుంటాడు. 
 

Latest Videos



అయితే అనుకోకుండా ఆ ఎటాక్ లో పార్ద తమ్ముడు చనిపోతాడు. పోలీస్ ల అదుపులో ఉన్న వాళ్లిద్దరూ కాకుండా మరొకరు పార్ద తమ్ముడుని చంపేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ చంపిన వ్యక్తి ఎవరు...పార్ద మనుష్యులను అక్షిత, ఫాజిల్ ఎందుకు చంపారు. డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) కు ఈ హత్యలకు లింక్ ఏమిటి. చంపిన వాళ్లు విచార‌ణ‌లో మాత్రం తాము అమాయ‌కులమని.. ఈ హ‌త్య‌ల‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని ఎందుకు చెప్తున్నారు. ఈ కథలో పురుషోత్తమ్‌ రెడ్డి అలియాస్‌ సింబా(జగపతి బాబు) పాత్ర ఏమిటి? ఫైనల్ గా పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్‌ చేశారు? వంటి విషాయలు తెలియాలంటే సినిమా  చూడాల్సిందే.

Simbaa

 
విశ్లేషణ

ప్రారంభం ఓ స్కూల్ టీచర్ ... ఓ వ్యక్తిని మర్డర్ చేయటం ఆసక్తి కలిగేలా మొదలెట్టారు. ఆ తర్వాత కొంతదూరం బాగానే ఇంట్రస్టింగ్ గానే వెళ్లింది. కానీ ఆ తర్వాత రొటీన్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ డ్రామా గా మారిపోవటం మొదలెట్టింది. అయితే ఈ కథలో చెప్పుకోదగ్గ అంశం. ఆ మర్డర్స్ చేయటానికి రీజన్, మర్డర్స్ చేయటానికి అనుసరించిన పద్దతులు.  సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ  అంటు కొత్త విషయాలు మనకు చెప్పటం. అయితే బయోలాజికల్ మెమరీ విషయం మనకు తెలుసున్నదే.  అదే సమయంలో సీరియస్ గా నడిచే క్రైమ్ థ్రిల్లర్ ని లవ్ ట్రాక్ పెట్టాలనే ఆలోచన పాడు చేసింది. అలాగే పోలీస్ ఇన్విస్టిగేషన్ ఏదో తూతూ మంత్రంగా నడుస్తూంటుంది. అంటే ఇది ఇన్విస్టిగేషన్ డ్రామా కాదు కదా దానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు అనుకుంటారు కానీ చూసేవారి  దృష్టి ఖచ్చితంగా అటే ఉంటుందనే విషయం మర్చిపోయారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ లిస్ట్‌ లలో హంతకుడుని ట్రేస్ చేయటం అనేది ఎన్నో సినిమాల్లో చూసిన అంశం కావటంతో పెద్దగా కిక్ ఇవ్వదు. ఇక జగపతిబాబుని పోస్టర్స్ లో హైలెట్ చేసి సినిమాలో చివరి దాకా దాచి ఉంటాడు. పోనీ ఆ పాత్ర రివీల్ చేసిన తర్వాత ఏమన్నా అద్బుతంగా ఉంటుందా అంటే... ప్రకృతి పాఠాలతో క్లైమాక్స్ కు రప్పిస్తాడు. నిజానికి సినిమాలో జగపతిబాబు క్యారక్టరే మనకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల్సింది. కానీ అది ఎప్పుడో చివర్లో వచ్చి..అంతా నేనే చేసాను..కారణం ఇదీ చెప్తూంటే ఓహో అలాగా అనేస్తాం.
 

Simbaa


ఎవరెలా చేసారు

జగపతిబాబు ఎక్కడో చివర్లో వస్తాడు. పెద్దగా ఇంప్రెస్ చేయడు. అనసూయ...కాస్త సర్పైజింగ్ గానే అనిపిస్తుంది. ఇక మాగంటి శ్రీనాథ్ బాగా చేసారు. సీనియర్ నటి గౌతమికు పెద్దగా చేయటానికి ఏమీ లేదు. కొద్దిగా ఓవర్ బిల్డప్ ఇచ్చారు. వసిష్ఠ సింహ పాత్రల పరిధిమేర చేసారు.  కబీర్ సింగ్ రెగ్యులర్ విలనీ..కథ బాగుంటే రాణించేది. 
 

Simbaa


టెక్నికల్ గా..

ప్రకృతి, సెల్యూలర్ మెమరీ, బయోలాజికల్ మెమరీ అనే మూడు అంశాలతో ఈ సినిమాని లాగేద్దామనుకున్నారు. కానీ అవి ఫెరఫెక్ట్ గా సెట్ కాలేదు.సంపత్ నంది ..కమర్షియల్ పంధాలోనే కథ రాసారు కానీ ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే సెట్ కాలేదు. డైలాగులు బాగున్నాయి. కృష్ణ సౌరభ్ సంగీతం,కెమెరా వర్క్  బావుంది. డైరక్టర్ కొత్తవాడైనా ఎక్కడా తడబాటు లేకుండా తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారు. 
 

Simbaa


ఫైనల్ థాట్

సందేశాలు చెప్పటానికి సినిమాలు ఎందుకురా అబ్బాయి..పోస్ట్ కార్డ్ రాస్తే చాలుదూ అన్న చక్రపాణి గారి మాటలు గుర్తు వస్తాయి. అసలే మనమంతా వాట్సప్ మెసేజ్ లుతో మునిగిపోతున్న కాలంలో ఇలాంటివి కాస్త ఇబ్బందిగానే ఉంటాయి.ఏదైమైనా మంచి ప్రయత్నం...మరీ తీసిపారేయదగ్గది కాదు..ఓ లుక్కేయచ్చు.  కాకపోతే అది థియేటర్ లోనా.ఓటిటిలోనా అనేది మన ఇష్టం.

Rating: 2 
  

నటీనటులు: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, శ్రీనాథ్ మాగంటి, క‌బీర్‌సింగ్‌ తదితరులు;

దర్శకత్వం: మురళీ మనోహర్‌రెడ్డి;

విడుదల: 09-08-2024

click me!