పాక్ ని రక్షించే భారత్ స్పై 'టైగర్ 3' రివ్యూ

First Published | Nov 12, 2023, 1:00 PM IST

‘ ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలకు సీక్వెల్‌గా వచ్చిన టైగర్‌ 3 ఎలా ఉంది?  

tiger3


స్పై సినిమాలు సక్సెస్ ఎప్పడూ మన ఇండియన్  భాక్సాఫీస్ దగ్గర డైలమానే. అయితే 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ దాన్ని అథిగమించి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. మారిన ప్రేక్షకుల టేస్ట్ ని సల్మాన్,కత్రినాల స్పై సీక్వెన్స్ లతో  భాక్సాఫీస్ కు పరిచయం చేసింది. దాంతో  ఆ తర్వాత అదే కాంబినేషన్ లో మరో స్పై సినిమా ఇన్నాళ్లకు టైగర్ 3 గా మన ముందుకు వచ్చింది. మంచి ఫామ్ లో షారూఖ్ గెస్ట్ గా కనిపించిన ఈ చిత్రంలో హృతిక్ ఉన్నారని అఫీషియల్ గా ప్రకటించారు. మరో ప్రక్క ఎన్టీఆర్ కామెయో గా చేసారనే ప్రచారం ఉంది..అలా తెలుగు జనాల్లోనూ ఈ సినిమా నానింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది. అంచనాలను అందుకుందా... టైగర్ మరో సారి గాండ్రించిందా...పిల్లి కూతలతో పలాయినం చిత్తగించిందా చూద్దాం.

TIGER3


స్టోరీ లైన్

టైగర్ 'రా' ఏజెంట్,  జోయా (కత్రినా కైఫ్) పాకిస్దాన్ కు చెందిన  మాజీ ఐఎస్ఐ ఏజెంట్... వీళ్లద్దరూ భార్యాభర్తలు. గతంలో వీళ్లద్దరు విడివిడిగానూ, కలిసి తమ దేశ శత్రువుల ఆట సమర్దవంతంగా కట్టించిన సమర్దులే.  అయితే 12 ఏళ్లుగా  ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలను ఇప్పుడు గతం వెంబడించి సవాల్ విసరింది. ప్రస్తుతానికి వస్తే...పాకిస్థాన్ ప్రధాని ఇరానీ (సిమ్రాన్)‌ను గద్దె దించేందుకు కుట్ర పన్నుతాడు మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతిష్ రెహమాన్ (ఇమ్రాన్ హష్మీ) . అతనితో చేతులు కలుపుతుంది జోయా. ఈ విషయం తెలిసుకున్న టైగర్... జోయా, అతీష్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడతాడు. ఆ క్రమంలో  టైగర్ పాక్ సైన్యానికి చిక్కుతాడు. అప్పుడు టైగర్‌ను రక్షించడానికి పఠాన్ (షారుక్ ఖాన్)  రంగంలో దిగుతాడు. అప్పుడు ఏం జరిగింది...టైగర్, పఠాన్ కలిసి పాకిస్థాన్ ఆర్మీపై చేసిన పోరాటం ఎలా సాగింది? ఆతీష్ రెహ్మన్  తో  జోయా ఎందుకు చేతులు కలిపింది? పాక్ ప్రధానిని రక్షించడానికి, పాక్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా టైగర్ ఏం చేసాడనేదే  టైగర్ 3 సినిమా కథ. 
  


  
ఎలా ఉంది
  
యూనివర్స్‌ సినిమాలు... ఫ్రాంచైజీ సినిమాలు ఇప్పుడు అంతటా నడుస్తోన్న ట్రెండ్. అందులో  భాగంగా వచ్చిన  సినిమాలకు కాన్సెప్టు కన్నా స్టార్స్ ఎట్రాక్షన్ ప్రధానబలం అని చెప్పాలి.  ఏ సినిమా ఎలా ముగుస్తుందో, కొత్తగా ఎవరి పాత్రలు పరిచయం అవుతాయో ఊహించకుండా సర్పైజ్ చేయటమే వాటి స్పెషల్ ఎట్రాక్షన్. ఆ పాత్రలు,స్టార్స్ తోనే తర్వాత సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తుంటారు దర్శకనిర్మాతలు.ఈ ట్రెండ్ ని అనుసరిస్తూ యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి రూపొందుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఎవరు గెస్ట్ రోల్ చేస్తున్నారు అనేది జనం ఎదురూచూస్తూంటారు. అంతేకాకుండా యూనివర్స్‌లో భాగంగా నెక్ట్స్ రాబోతున్న సినిమాల్లోని పాత్రల్ని కూడా చూచాయగా పరిచయం చేస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలా ‘టైగర్‌ 3’ కూడా అతిథి పాత్రల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. 

Tiger 3 Movie Review


పఠాన్‌గా షారుక్‌ ఖాన్‌, మేజర్‌ కబీర్‌ ధలీవాల్‌ పాత్రలో హృతిక్‌రోషన్‌ అతిథి పాత్రల్లో తళుక్కున మెరిసారు. అంతవరకే ఈ సినిమా సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎత్తుకొచ్చిన యాక్షన్‌ ఎపిసోడ్ల బాగున్నప్పటికీ  స్క్రీన్ ప్లే మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా రాయటంతో ప్రేక్షకుడుకి పజిల్ లాగ కాకుండా పరీక్షలా మారింది. భారత స్పై వెళ్లి పాక్ ..అంతర్గత సంక్షోభాన్నిఅడ్డుకోవటం అనేది దర్శక,నిర్మాతలకు బాగుంటుందేమో కానీ చూసేవారికి మాత్రం తేడాగా అనిపిస్తుంది..పాక్ స్దాన్ ప్రధాన పీఠాన్ని మన కాపాడటం ఏమిటా అనిపిస్తుంది..పోనీ మన దేశం పెద్ద మనస్సు చేసుకుని చేసుకుని మనం ఆనందపడినా పాక్ లో ఈ సినిమా చూసేవాళ్లకు ఎలా ఉంటుందో... వాళ్లకు ఏమేరకు డైజస్ట్ అవుతుందో... అక్కడా సల్లూ భాయ్ కు,షారూఖ్ కు  అభిమానులు ఎక్కువే కదా.


ఎన్టీఆర్ ఉన్నాడా

ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇది మీద క్యూరియాసిటీ పెరగటానికి చేసిన ప్రచారం అనే అర్దమైపోంది. ఈ యూనివర్స్‌లో భాగంగానే రూపొందుతున్న ‘వార్‌ 2’లో హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించనున్నారనే దాన్ని అడ్డం పెట్టి ఈ ప్రచారం జరిగింది. కాబట్టి‘టైగర్‌ 3’తోనే ఆయన పాత్రని పరిచయం చేస్తున్నారనే ప్రచారం  అబద్దమే.


టెక్నికల్ గా..
ఈ సినిమా సాంకేతికగా కొంతవరకూ ఆకట్టుకుంటుంది. అయితే ఆ బ్యానర్ కు ,సల్మాన్ ఖాన్ సినిమాకు తగినట్లు మాత్రం లేదు. ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ మాత్రం ఇరక్కొట్టారు. పాటలు జస్ట్ ఓకే. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగా కుదిరింది. కెమరాపనితం మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ప్రొడక్షన్ హౌస్, కథకు తగ్గట్టుగా మాత్రం లేవు. ఎడిటింగ్ ఓకే.. రన్ టైమ్ కాస్త ఎక్కువే అనిపించింది.

shah rukh khan cameo in tiger 3


ఆర్టిస్ట్ లు ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే..
టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్  బాగా చేసారు అంటే రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్లారు. కాని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాల నాటి జోష్ లేదు. డైరక్టర్ హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ పెద్దగా దృష్టి పెట్టలేదు. 'టైగర్ 3'లో అవి పెద్దగా కనపడవు. లేక అవి ఉన్నా ..మనకు రొటీన్ గా అనిపించి ..గూస్ బంప్స్ రావటం లేదో. ఇక కత్రినా కైఫ్ పోషించిన జోయా పాత్రకు బాగా ప్రయారిటీ ఇచ్చారు. టైగర్ కన్నా ఆమె మీద ఎక్కువ ఆధారపడ్డారు పాపం వీళ్లిద్దరితో పోలిస్తే విలన్ గా చేసిన  ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ స్పేస్ బాగా తక్కువ. గెస్ట్ గా కనిపించిన షారుఖ్ ఖాన్ ..పఠాన్ లో తనకు సాయిం చేసిన సల్మాన్ కు ఇలా బదులు తీర్చేసుకున్నాడు. వీళ్లిద్దరు చేసిన యాక్షన్ ఎపిసోడ్ బావుంది. హృతిక్ రోషన్ కొద్ది క్షణాలు మాత్రమే అదీ క్లైమాక్స్ తర్వాత ఎండ్ టైటిల్స్ లో  అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కీలక పాత్రలో సిమ్రాన్ గురించి. ఆమె చాలా బాగా చేసారు. 'రా' చీఫ్ మీనన్ పాత్రలో రేవతి , గవర్వనమెంట్ లో కీలక పదవిలో ఉన్న వ్యక్తిగా అనీష్ కురువిల్లా మనకు నేటివిటి ఫీల్ తెచ్చారు.
 

ప్లస్ లు ?

సల్మన్, షారూఖ్ కలిపి చేసిన యాక్షన్ ఎపిసోడ్
కత్రినా టవల్ ఫైట్

మైనస్ లు 
ఇంటెన్సిటీ లేని యాక్షన్ బ్లాక్స్ 
ట్విస్ట్ లు,టర్న్ లు లేని స్క్రీన్ ప్లే
ఉషారు లేని సల్మాన్ 

తెలుగు డబ్బింగ్ డైలాగులు


ఫైనల్ థాట్

టైగర్... పార్ట్ 3 కి వచ్చేసరికి ముసలిదై,ఓపిక తగ్గిపోయింది.కత్రినా ఉన్నా కిక్ లేదు. ఎక్కడా ఉత్సాహం లేదు. దానికి  కథా వయాగ్రా అత్యవసరం.లేకపోతే చూసేవారికి వైరాగ్యమే.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

 


ఎవరెవరు..

బ్యానర్: యష్ రాజ్ ఫిల్మ్స్‌
నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, అశుతోష్ రానా, వీరేందర్ సింగ్ గుమన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ తదితరులు ,అతిథి పాత్రల్లో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్
 స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
 డైలాగ్స్: అంకుర్ చౌదరీ
 కథ, నిర్మాత: ఆదిత్య చోప్రా
 సినిమాటోగ్రఫి: అనయ్ గోస్వామి
 ఎడిటింగ్: రామేశ్వర్, భగత్ 
మ్యూజిక్: ప్రీతమ్ (పాటలు), తనూజ్ టిక్ (బీజీఎం) 
దర్శకత్వం: మనీష్ శర్మ
రన్ టైమ్: 156 నిమిషాలు 
రిలీజ్ డేట్: 2023-11-12
  

Latest Videos

click me!