Thandatti tamil Movie OTT Review
ఓటిటిలు వచ్చాక తమిళ,మళయాళ సినిమాలను తెగులు లో డబ్ చేసి వాటిల్లో పెడుతున్నారు. దాంతో విభిన్నమైన కాన్సెప్టు లతో వస్తున్న కొత్త తరహా సినిమాలు సైతం మన తెలుగు వారు చూసే అవకాసం కలుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పశుపతి,రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన తందట్టి సినిమాని ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సినిమా చూడదగినదేనా, కథ ఏమిటి...ఎలా ఉందో చూద్దాం.
Thandatti, pasupathi, rohini, OTT Review
స్టోరీ లైన్
అత్యుత్సాహంతో అనవసరమైన విషయాల్లో వేలుపెడుతూ డిపార్టమెంట్ లో పెద్దల చేత తిట్లు తింటూ, ట్రాన్సఫర్స్ అవుతూంటాడు సుబ్రమణ్యం (పశుపతి). పది రోజుల్లో రిటైర్ అయ్యే అతను స్టేషన్ లో తోటి వారు వారిస్తున్నా ఓ కేసు టేకప్ చేస్తాడు. ఆ కేసు కిడారిపట్టి అనే గ్రామంకు సంభందించింది. ఆ గ్రామంలో వాళ్లకు పోలీస్ లు అంటే పడదు. ఏ సమస్య వచ్చినా వాళ్లే సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఊళ్లో పోలీస్ లు వస్తే ఊరుకోరు. ఆ ఊరు గురించి పెద్దగా తెలియని సుబ్రమణ్యం... తంగపొన్ను(రోహిణి) అనే పెద్దావిడ కనపడలేదని తెలిసి ఆ కేసు డీల్ చేద్దామని బయిలు దేరతారు. తంగపొన్నుకు ఐదుగురు పిల్లలు. ఆమె మనవడు వచ్చి మా నాయనమ్మ కనపడటం లేదని చెప్తే సరేనని బయిలుదేరతాడు. వెతుకుతూంటే ఓ బస్టాప్ లో కనపడుతుంది. కొద్ది సేపటికే మరణిస్తుంది.
Thandatti, pasupathi, rohini, OTT Review
దాంతో ఆ శవాన్ని తీసుకుని ఆమె మనవడుతో పాటు ఆ ఊరు వెళ్తాడు. అక్కడకు వెళ్లాక అసలు గొడవ మొదలవుతుంది. ఆమె పిల్లలంతా ఆస్దులు కోసం, చెవి దిద్దులు కోసం ఒకరితో మరొకరు ..పెద్ద యుద్దం చేస్తూంటారు. ఈ లోగా ఆమె చెవి లకు ఉన్న దుద్దులు మాయమౌతాయి. ఎవరు వాటిని దొంగలించారో అర్దంకాదు. విషయం తేల్చకుండా వెళ్లటానికి కుదరదని ఆమె తాగుబోతు కొడుకు కత్తి పట్టుకు కూర్చుంటాడు. అక్కడ నుంచి ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఆ విచారణలో ఏం తేలింది. దిద్దలు ఎవరు తీసారు. సుబ్రహమణ్యం తన విచారణలో ఆ విషయాన్ని ఎలా కనుక్కున్నాడు. చివరకు ఓ ఊహించని ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి..మధ్యలో వచ్చే ప్రేమ కథ ఎవరికి సంభందించి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Thandatti, pasupathi, rohini, OTT Review
ఎనాలసిస్ ..
సినిమా ప్రారంభం ఓ మిస్టరీ డ్రామాగై మొదలై...మెల్లిమెల్లిగా కథలోని మిగతా సబ్ ప్లాట్స్ తో ఎమోషనల్ ఫన్ డ్రామా గా ముందుకు వెళ్తుంది. ఫస్టాఫ్ పరుగులు పెడుతుంది. సెకండాఫ్ కూడా అక్కడక్కడే కథ తిరుగుతూంటే కాస్త ఇబ్బందిగా రిపీట్ గా అనిపిస్తుంది. అయితే అక్కడే డైరక్టర్ ఓ కొత్త లేయర్ ఓపెన్ చేసి క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి..మంచి సినిమా చూసామన్నా ఫీల్ కలగ చేస్తాడు. మన తెలుగు సినిమాలు పూర్తిగా కమర్షియల్ వైపు , ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ ల వైపు ప్రయాణం పెట్టుకుంటూంటే... తమళ,మళయాళ సినిమాలు కాన్సెప్టు ఓరియెంటెడ్ గా సాగుతున్నాయి. హ్యూమన్ ఎమోషన్స్ పట్టుకోవటానికి ట్రై చేస్తున్నారు. దాంతో అవి ఓటిటిల్లో వచ్చి మనవాళ్లకు కూడా నచ్చుతున్నాయి. గతంలో మనకు డబ్బింగ్ అంటే పెద్ద హీరో సినిమానే..కానీ ఇప్పుడు ఓటిటిలతో ఖర్చు తగ్గటంలో చిన్న సినిమాలు సైతం డబ్ అయ్యి మనకు అందుబాటులో వస్తున్నాయి.
Thandatti
ఈ సినిమా చూస్తూంటే చాలా భాగం మన ఇళ్లలో జరిగినట్లే అనిపిస్తుంది. ఈ మధ్యనే వచ్చిన బలగం చావు ఇంట్లో మానవసంభందాలను సీరియస్ గా చూపిస్తే ఈ సినిమా ఫన్ తో ముందుకు తీసుకువెళ్తుంది. డబ్బు,బంగారం ముందు తల్లి,చెల్లి లేదు ఎమోషన్స్ లేవు అన్నీ ప్రక్కకు వెళ్లిపోతాయి అనే విషాయన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే అక్కడితో ఆపేస్తే ఏదో హ్యూమన్ రిలేషన్స్ మీద ఓ కామెంట్ లా జస్ట్ ఓకే అనిపించేది. కానీ దర్శకుడు అందులో ఓ లవ్ స్టోరీని,అసలు ఊహించని క్లైమాక్స్ తీసుకుని సినిమాకు నిండుతనం ఇచ్చాడు. తమిళ వాసన ఎక్కువ ఉండటం, పశుపతి ప్రధాన పాత్ర కావటంతో సినిమా ప్రారంభం మనకు ఎక్కటానికి టైమ్ తీసుకుంటుంది. కానీ ఒక్కసారి కథలో డ్రామా వచ్చాక ...లీనమై చూస్తాము.
Thandatti
తండట్టీ అర్దం ఏమిటంటే...
ఓ రకమైన పాతకాలంలో తమిళనాడులో ఆడవాళ్లు ధరించే చెవి పోగులు...అవి geometrical షేప్ లో ఉంటూ, interlocking squares, triangles తో ఉంటాయి. దాదాపు గా పిరమిడ్ ఆకారంలో కనిపిస్తాయి. ఇక ఈ దిద్దులు ఉండే స్క్రూ...ఓ బాల్ ఆకారంలో ఉంటుంది.
Thandatti
ఎవరెలా చేసారు
ఈసినిమా పూర్తిగా పశుపతి తన భుజాలపై మోసిన సినిమా.పశుపతి చూసాక చాలాసేపు గుర్తుండిపోతాడు. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఆమె చుట్టూ కథ తిరిగినా ఆమె కనపడేది కొద్ది సేపే. మిగతా నటీనటులు ఎక్కువ శాతం మనకు పరిచయం లేనివాళ్లే. కూతురిగా దీపా శంకర్ కాస్త ఓవర్ చేసిందనిపిస్తుంది. ఇక సెమ్మలర్ అన్నం, జానకి, పూవిత, తాగుబోతుగా వివేక్ ప్రసన్న మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
టెక్నికల్ గా
చిన్న సినిమాకు తగ్గ హంగులు అన్నీ ఉన్నాయి. మహేశ్ ముత్తుస్వామి సినిమాటోగ్రఫీ విలేజ్ ఎట్మాస్మియర్ ని బాగా పట్టుకుంది. కెఎస్ సుందరముర్తి, సామ్ సీఎస్ సంగీతం సినిమాని స్మూత్ గా నడిచేలా చేసాయి. దర్శకుడు మంచి కథను ఎంచుకుని కొత్తగా ట్రై చేసారు.
Thandatti
ఫైనల్ థాట్
'తందట్టి' ఓటీటిలో ఓ సారి సరదాగా చూడదగ్గ సినిమా. నిరాశపరచదు. ఇలాంటి చిన్న కాన్సెప్టు సినిమాలు మన తెలుగులో ఎందుకు రావటం లేదో అని ఆలోచనలో పడేలా చేస్తుంది.
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
Thandatti
నటీనటులు : రోహిణి, పశుపతి, దీపా శంకర్, అమ్ము అభిరామి, వివేక్ ప్రసన్న, మీనల్ తదితరులు..
సినిమాటోగ్రఫీ : మహేశ్ ముత్తుస్వామి
మ్యూజిక్ : సామ్ సీఎస్, కేఎస్ సుందరమూర్తి
దర్శకుడు : రామ్ సంగయ్య
నిర్మాత : కిరుబాకరన్ ఏకేఆర్, శ్రావంతి సాయినాథ్
OTT:అమెజాన్ ప్రైమ్ వీడియో