Ranabaali Day 1 Collections: రణబాలికి షాకింగ్‌ కలెక్షన్లు.. విజయ్‌, రష్మిక మూవీకి మొదటి రోజు వచ్చింది ఇంతేనా?

Published : Oct 17, 2026, 07:53 AM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన `రణబాలి` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈమూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మరి బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

PREV
14
రణబాలికి పాజిటివ్‌ టాక్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీ `రణబాలి`. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన సినిమా కావడం, అదే సమయంలో పెళ్లి తర్వాత కలిసి చేసిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 1870-80 టైమ్‌లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ.. సింగనమల ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా పీరియాడికల్‌ హిస్టరీ యాక్షన్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దసరా స్పెషల్‌ గా శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. చాలా వరకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. మరి ఇది బాక్సాఫీసు వద్ద రిఫ్లెక్స్ అయ్యిందా? ఈ మూవీకి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

24
రణబాలి మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు

`రణబాలి` మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. అయితే విజయ్‌ గత చిత్రాలతో పోల్చితే డల్‌గానే ప్రారంభమైంది. కానీ ఇంతటి కాంపిటీషన్‌లో ఈ రేంజ్‌ వసూళ్లు రావడమ విశేషమనే చెప్పొచ్చు. మరి ఈ మూవీకి ఎంత వచ్చాయనేది చూస్తే, మొదటి ప్రపంచ వ్యాప్తంగా రూ.16.50కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఇండియాలో పది కోట్ల 75లక్షలు రాగా, ఓవర్సీస్‌లో రూ.5.75కోట్లు వచ్చాయి. అయితే రెగ్యూలర్‌ టికెట్‌ రేట్లతో ఈ స్థాయి కలెక్షన్లు అంటే బెటర్‌ అనే చెప్పొచ్చు. కానీ ఈ మూవీకది సరిపోదు. ఇంకా చాలా కావాలి.

34
రణబాలి మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`రణబాలి` మూవీకి అయిన బడ్జెట్‌ రూ.120కోట్లు అని సమాచారం. ఇందులో అరవై కోట్ల వరకు నాన్‌ థియేట్రికల్‌గా వచ్చినట్టు సమాచారం. ఇక థియేట్రికల్‌గా దాదాపు అరవై కోట్లు వసూలు చేయాలి. అంటే వంద నుంచి రూ.120కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. ఇప్పుడు అందులో రూ.15శాతం మాత్రమే వచ్చాయి. దాదాపు పది కోట్ల షేర్‌ వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఇంకా వంద కోట్లకుపైగానే కలెక్షన్లు రావాలి. మరి అది ఎంత వరకు రీచ్‌ అవుతుందనేది ప్రశ్న.

ఇదిలా ఉంటే విజయ్‌ చివరి మూవీ `కింగ్‌డమ్‌`కి మొదటి రోజు దాదాపు రూ.39కోట్లు వచ్చాయి. ఇప్పుడు అందులో సగం కూడా దీనికి రాకపోవడం షాకిస్తోంది. టికెట్‌ రేట్లు పెంపు లేకపోవడం, జైలర్‌ 2 ప్రభావం, క్రేజీ కల్యాణం మూవీ కూడా అదే రోజు రావడంతో థియేటర్లు పంచుకోవాల్సి వచ్చింది. ఇది వసూళ్లపై ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. సినిమా పుంజుకుంటే విజయం దిశగా వెళ్లే ఛాన్స్ ఉంది.

44
రణబాలి కథ ఇదే

`రణబాలి` మూవీ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా వచ్చింది. 1870-80లో సహజంగా వచ్చిన కరవు, బ్రిటీష్‌ వారు క్రియేట్‌ చేసిన కరవుకి ప్రజలు అల్లాడిపోయారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రజల ధాన్యాన్ని దోచుకుపోతున్న బ్రిటీష్‌వారిపై రణబాలి చేసిన పోరాటమే ఈ చిత్రం అని చెప్పొచ్చు. హృదయాన్ని కదిలించే రియలిస్టిక్‌ కథాంశంతో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌. విజయ్‌ దేవరకొండ నటన అదిరిపోయింది. రష్మిక మందన్నా రోల్‌ బాగుంది. ఎమోషనల్‌గా ఉంది. అయితే ఇలాంటి సబ్జెక్ట్ ఆడియెన్స్ కి రీచ్‌ కావడం చాలా ముఖ్యం. రీచ్‌ అయ్యేదాన్ని బట్టి ఆడుతుంది. కమర్షియల్‌ యాంగిల్‌లో దీన్ని చూడలేం. అదే ఈ మూవీకి మైనస్‌గా చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories